Bigg Boss Telugu 9: బద్ధ శత్రువులుగా ప్రేమ పక్షులు.. రీతూ మోసంతో రగిలిపోతున్న కళ్యాణ్

ఎప్పుడు బిగ్‌బాస్ సీజన్ మొదలైనా ఖచ్చితంగా గొడవలు, కొట్లాటలు, వాగ్వాదాలు కామన్. దానితో పాటే వెన్నుపోట్లు, ద్రోహాలు కూడా అంతే కామన్. నిన్నటి దాకా మన ఫ్రెండే అనుకున్నవాళ్లు.. సడెన్‌గా ప్లేట్ మార్చేస్తారు. ఎలిమినేషన్ కాకుండా సేవ్ కావడానికి ఏం చేయడానికైనా వెనుకాడకూడదు. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎమోషన్స్‌కి తావు లేదు. ఇది అర్ధం చేసుకునే సరికి కంటెస్టెంట్స్ ఇంటి ముఖాన పడతారు. ఇది పూర్తిగా మైండ్ గేమ్.. దానిని అర్ధం చేసుకుని నిలబడితేనే విజేతగా నిలుస్తారు.

బిగ్‌బాస్ హౌస్‌లో గేమ్ ఆడే సమయంలో తమవాళ్లు అనుకున్న వాళ్లు వెన్నుపోటు పొడిస్తే కొందరు కంటెస్టెంట్స్ దానిని తేలిగ్గా తీసుకోలేరు. తెలుగు సీజన్ 1 నుంచి తాజా బిగ్‌బాస్ తెలుగు 9 వరకు ఇలాంటి వారెందరో. తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లో ప్రేమ పక్షులుగా ఉన్న పడాల పవన్ కళ్యాణ్, రీతూ చౌదరి మధ్య విభేదాలు చోటు చేసుకుని ఇద్దరూ ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారారు. తాజాగా విడుదల చేసిన ఎపిసోడ్ ప్రోమోలో ఇద్దరు గొడవపడ్డారు. ఈ వివరాల్లోకి వెళితే..

Bigg Boss Telugu 9 Pawan Kalyan Padala Breaks his Relation with Rithu Chowdary and Demon Pavan

బిగ్‌బాస్ తెలుగు 9లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ
బిగ్‌‌బాస్ తెలుగు 9లో రీతూ చౌదరి, డిమోన్ పవన్, పవన్ కళ్యాణ్ పడాల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇద్దరు కళ్యాణ్‌లు అమ్మాయిలతో పులిహోర కలుపుతూ వారిని ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరితో రీతూ చౌదరి ఈక్వల్‌గా లవ్ ట్రాక్ కలుపుతూ ఎంటర్‌టైన్‌ చేస్తోంది. మొన్నామధ్య డిమోన్ పవన్‌ని తొండాట ఆడి కెప్టెన్‌ని చేసేసింది. నాగార్జున ఆ కెప్టెన్సీని పీకిపారేయడంతో పవన్ మళ్లీ ఆడి కెప్టెన్ అయ్యాడు. అయితే ఇటీవల పవన్‌ కళ్యాణ్‌తో కాకుండా డిమోన్ పవన్‌తో రీతూ క్లోజ్‌గా ఉండటంతో సోల్జర్ కళ్యాణ్ తట్టుకోలేకపోతున్నాడు.

రీతూకి దగ్గరైన పవన్
గత వారం వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన దివ్య నిఖిత.. హౌస్‌లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోందని పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, రీతూ చౌదరిల బండారం బయటపెట్టింది. అలాగే ఎలిమినేట్ అయిన ప్రియా శెట్టి కూడా హౌస్‌లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నిజమేనని ఒప్పుకుంది. రీతూని ఇంప్రెస్ చేయడానికి పవన్ కళ్యాణ్ పడాల ఎంతో ట్రై చేశాడని, కానీ ఇంతలో పవన్‌కు రీతూ దగ్గరైందని చెప్పింది. దాంతో తనూజ గౌడతో పవన్ కళ్యాణ్ దగ్గరవ్వాలని ట్రై చేశాడని బాంబు పేల్చింది.

నాగార్జున క్లాస్‌తో వణుకు
నాగార్జున క్లాస్ పీకడంతో కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా అదరగొట్టాడు పవన్ కళ్యాణ్. ప్రతి టాస్క్‌లోనూ ఇమ్మాన్యూయేల్‌తో హోరాహోరీగా తలపడ్డాడు. రెయిన్ డ్యాన్స్ చేసే సమయంలో డిమోన్ పవన్‌కు ఒక కెప్టెన్సీ కంటెండర్‌ను తప్పించే అవకాశం రావడంతో వెంటనే పవన్ కళ్యాణ్‌ను తప్పించేశాడు. అయితే ఇది తన నిర్ణయం కాదని, రీతూ చౌదరి చెప్పడం వల్లే ఇలా చేశానని చెప్పడంతో పవన్ కళ్యాణ్ అవాక్కయ్యాడు. కెప్టెన్ కావాల్సిన తనను తన గర్ల్ ఫ్రెండ్ వెన్నుపోటు పొడిచిందని అర్ధమైంది. వెంటనే కవర్ చేసుకోవడానికి తన మీద చేయి వేసి సారీ చెప్పింది రీతూ.. దాంతో వెంటనే చేయ్ తీయ్ అంటూ కోపంగా వెళ్లిపోయాడు పవన్ .

నాకు హౌస్‌లో ఉన్నది ఇద్దరే
వీరిద్దరి గొడవ శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో పీక్స్‌కు చేరేలా ఉంది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. రీతూ దెబ్బకి కళ్యాణ్ బెడ్ మీద కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో శ్రీజ బాధపడుతూ నేను నిన్ను కెప్టెన్‌ని చేస్తానని చెప్పి ఓదార్చింది. ఆ వెంటనే తనూజ మాట్లాడుతూ.. ఎవరి మైండ్‌లో, ఎవరి హార్ట్‌లో ఏముందో మనకి తెలియదని చెప్పింది. దాంతో నా పేరు చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చింది తనూజ. ఆ తర్వాత డిమోన్ పవన్, రీతూ చౌదరిలు కూడా వచ్చి పంచాయతీ పెడతారు. నన్ను ఎందుకు తీసేయమన్నావ్ రా అంటూ రీతూని నిలదీశాడు పవన్ కళ్యాణ్. నాకు ఈ హౌస్‌లో ఫస్ట్ నుంచి ఉన్నది ఇద్దరేనని, కానీ వీడి నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదని వెళ్లిపోతాడు.

మోసపోయినందుకే ఈ బాధ
ఆ మాటలతో పవన్ కళ్యాణ్‌కు ఎక్కడో కాలింది. వాడు వినకుండా చీదరించుకుంటున్నాడంటే వెనకాల వెళ్లడం నాకు ఇష్టం లేదని డీమాన్ చెప్పాడు. నేను ఓడిపోయాను కదా అని రీతూ చెప్పగా.. నేను బాధపడుతున్నది ఓడిపోయినందుకు కాదు, మోసపోయినందుకు అంటూ కళ్యాణ్ వెళ్లిపోయాడు. అనేసి వెళ్లిపోవడం కాదు.. నేను ఏం సపోర్ట్ అన్నాను చెప్పు అంటూ రీతూ చౌదరి నిలదీసే ప్రయత్నం చేసినా కళ్యాణ్ పట్టించుకోలేదు. వీరి మధ్యలోకి శ్రీజ రావడంతో రీతూ ఆమె గొడవ పడ్డారు. చూస్తుంటే బిగ్‌బాస్ తెలుగు 9లో శుక్రవారం ఎపిసోడ్ ఓ రేంజ్‌లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X