Priya Shetty: బిగ్‌బాస్‌లో ఐదో కామనర్‌గా ప్రియశెట్టి.. డాక్టర్ నుంచి యాక్టింగ్ వైపు
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో ఐదో కామనర్‌గా ప్రియశెట్టి అడుగుపెట్టారు. ఆమెను స్టేజ్ మీదకు ఆహ్వానించగానే నాగార్జునను చూడగానే స్టన్ అయ్యింది ప్రియ. మెడిసిన్ చదివి డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తూనే తల్లిదండ్రుల సపోర్ట్‌తో తాను బిగ్‌బాస్‌కు అప్లయ్ చేశానని ప్రియ తెలిపింది. తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని వాటిలో ఏదో ఒకటి సెట్ అయితే వివాహ బంధంలోకి అడుగుపెడతానని ప్రియ తెలిపింది.

రాయలసీమలోని కర్నూలుకు చెందిన ప్రియ శెట్టి.. చూడటానికి చాలా క్యూట్‌గా ఉంటుంది కానీ, ఊరమాస్ అని బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఇంట్రోలో చెప్పింది. నిద్రలో నడిచే అలవాటు ఉందట కదా అని నవదీప్ అడుగుతాడు.. చిన్నప్పుడు నడిచేదానిని అని చెప్పింది. దీంతో ఎక్కడి దాకా వెళ్లారేంటీ అని నవదీప్ ప్రశ్నించాడు. వాష్‌రూమ్‌కి వెళ్లి నేను స్నానం కూడా చేసి మళ్లీ బెడ్ మీద పడుకున్నా అని చెప్పి అందరినీ నవ్వించింది. శ్రీముఖిని అత్తగారంటూ పంచ్ విసిరిన ప్రియా శెట్టి.. ఇద్దరం కలిసి రీల్స్ చేద్దామని చెప్పి షాకిచ్చింది. నేను మొదట అబ్జర్వ్ చేస్తానని, నా టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నా పాయింట్ రైజ్ చేస్తానని ప్రియా శెట్టి తెలిపింది.
మొత్తంగా బిగ్‌బాస్ తెలుగు 9లో సెలబ్రెటీలతో పాటు సామాన్యులకు సమానంగా అవకాశం కల్పించారు నిర్వాహకులు. సెలబ్రెటీ కేటగిరీలో తనూజ పుట్టస్వామి, ఆశా షైనీ, భరణి శంకర్, రీతూ చౌదరి, ఇమ్యాన్యుయేల్, సుమన్ శెట్టి, రాము రాథోడ్, శ్రేష్టి వర్మ, సంజన గల్రానీలు హౌస్‌లో అడుగుపెట్టారు. ఇక బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో టాప్ 13లో చోటు దక్కించుకుని ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా పవన్ కళ్యాణ్ పడాల, శ్రీజ దమ్ము, హరిత హరీష్, పవన్ డిమోన్, ప్రియ శెట్టిలు కామనర్స్ కేటగిరీలో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌గా ఛాన్స్ దక్కించుకున్నారు
ఇక తొలి రోజే నాగార్జున ఈసారి బిగ్‌బాస్‌లో రెండు హౌస్‌లు ఉంటాయని తెలిపారు. ఓనర్స్ మెయిన్ హౌస్‌లో ఉంటారని, టెనెంట్స్ ఔట్ హౌస్‌లో ఉంటారని చెప్పారు. టాస్క్‌లలో పాల్గొని, ఎంతో కష్టపడి, అగ్నిపరీక్షలో విజయం సాధించిన కామనర్సే మెయిన్ హౌస్‌లో ఉండటానికి అర్హులని చెప్పారు నాగ్. సెలబ్రెటీలంతా టెనెంట్స్ కాబట్టి.. వాళ్లు ఔట్ హౌస్‌లో ఉంటారని క్లారిీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











