గాజులేసుకుని కూర్చో.. సుమన్ శెట్టిపై నోరుజారిన సంజన, ఏకీపారేస్తోన్న నెటిజన్లు
బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్స్ మధ్య వాగ్వాదాలతో రచ్చ జరుగుతోంది. ఎవరికి వారు తమ నోటి దురుసుతో నానామాటలు అంటున్నారు. తొలివారం గుండు అంకుల్, రెడ్ ఫ్లవర్ కామెంట్స్ హౌస్‌ని హీటెక్కించిన సంగతి తెలిసిందే. స్వయంగా హోస్ట్ అక్కినేని నాగార్జున గత వారం అందరినీ కడిగిపారేశారు. అయినప్పటికీ బుద్ధి తెచ్చుకోకుండా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు కంటెస్టెంట్స్. కామనర్స్ కానీ, సెలబ్రెటీలు కానీ ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా సంజన గల్రానీ నోటి దురుసుతో బిగ్‌బాస్‌లో కొత్త వివాదం చోటు చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..
హౌస్‌లో గొడవలు, కొట్లాటలు
బిగ్‌బాస్ తెలుగు 9లో రెండో వారం నామినేషన్స్ దగ్గరి నుంచి కెప్టెన్సీ టాస్క్‌లు, ఓనర్‌గా అర్హత పొందే టాస్క్‌లలో ఇంటి సభ్యుల మాటల యుద్ధంతో పాటు ఫిజికల్‌గానూ గొడవ పడ్డారు. ఆడ, మగా తేడా లేకుండా తమ విశ్వరూపం చూపించారు. కెప్టెన్సీ టాస్క్‌లో డిమోన్ పవన్ తర్వాతి నుంచి రీతూ చౌదరి రెచ్చిపోయింది. టెనెంట్స్‌లో ఒకరికి ఓనర్‌గా అవకాశం ఇచ్చేందుకు బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో తనూజ పుట్టస్వామితో బాహాబాహీ తలపడింది. తనూజ కూడా ఎక్కడా తగ్గకపోవడంతో ఇద్దరు కొట్టుకున్నంత పనిచేశారు. ఒకదశలో తనూజ మీద కూర్చొన్న రీతూ.. ఆమెను ఎటూ కదలనివ్వలేదు.

తొలి రౌండ్‌లోనే సుమన్ ఔట్
ఓనర్‌గా అర్హత సాధించాలంటే బిగ్‌బాస్ ఇచ్చే వస్తువులను బాస్కెట్‌లో వేసుకుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చివరి బజర్ మోగే వరకు ఎవరి బాస్కెట్‌లో అయితే ఎక్కువ వస్తువులు ఉంటాయో వారే గెలిచినట్లనని బిగ్‌బాస్ కండీషన్ చెప్పాడు. ఇదే టాస్క్ సందర్భంగా సుమన్ శెట్టితో గొడవ పెట్టుకుంది సంజన గల్రానీ. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. ఈ టాస్క్ మొదలైన వెంటనే తొలి రౌండ్‌లోనే సుమన్ శెట్టిని ఔట్‌గా ప్రకటించింది సంచాలక్ ప్రియా శెట్టి.
డీఎన్ఏ టెస్ట్ చేయాలంటూ రీతూ గొడవ
రీతూ ఫౌల్ గేమ్ ఆడింది.. అయినా ఎందుకు ఆడలేదు, ఫ్రెండ్ అయినంత మాత్రాన ఇలా పక్షపాతంగా వ్యవహరిస్తారా? అని సంజన అడిగింది. మీరు ఫ్రెండ్‌షిప్ గురించి మాట్లాడొద్దు అని రీతూ అనగా.. నాకు బ్లడ్ వస్తుంది, మీ గోరే గీసుకుందని చెప్పింది సంజన. అయితే అది నా గోరేనా అనేడి డీఎన్ఏ టెస్ట్ చేయాలంటూ వాదించింది రీతూ. ఆమె వద్ద ఎన్ని వస్తువులు ఉన్నాయో కౌంట్ చేయాలని సంజన వాదించగా.. తప్పకుండా అని ఓనర్లు ఆన్సర్ ఇచ్చారు. రీతూ వద్ద తక్కువ వస్తువులు ఉన్నాయి కాబట్టే కౌంట్ చేయడం లేదని సంజన పాయింట్ లాగింది.
గాజులేసుకుని కూర్చో
మరోవైపు.. ఫ్లోరా, సంజన కలిసి తనను ఔట్ చేయడంతో సుమన్ శెట్టి రగిలిపోయాడు. మీరు మమ్మల్ని చెడ్డోళ్లని చేసి మీరు గాజులేసుకుని కూర్చోండి అంటూ సుమన్ శెట్టిపై నోరు జారింది సంజన. దాంతో మీరెప్పుడో చెడ్డోళ్లు అయ్యారు.. మీరే ఆల్రెడీ వేసుకున్నారు కదా అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు సుమన్. ఈ మాటలు విన్న దమ్ము శ్రీజ.. సంజన గారు అలాంటి మాటలు వాడొద్దని వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సంజనపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
సంజనపై నెటిజన్ల ఫైర్
ఇప్పటికే గత వారం భరణి, ఇమ్మాన్యుయేల్‌లు మగాళ్లు కాదు అన్న అర్ధం వచ్చేలా హరిత హరీశ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్షమాపణలు చెప్పించారు. దీంతో సుమన్ శెట్టిపై తాజాగా సంజన చేసిన వ్యాఖ్యలపైనా నాగార్జున పంచాయతీ పెట్టించే అవకాశం లేకపోలేదు. వీకెండ్ కావడంతో కొద్దిగంటల్లోనే నాగార్జున ఎపిసోడ్ ప్రసారం కానుంది. మరి ఆయన ఎవరికి క్లాస్ పీకుతారో? ఎవరికి కామెంట్ ఇస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











