Bigg Boss Telugu: నువ్వు ఇంత చీపా?.. మండిపడ్డ సంజన
Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఎన్నడూ చూడని, ఎప్పుడు ఊహించని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాలలో 'ఇదే షో రా బాబు' అనేలా నరాలు తెగేంత ఉత్కంఠతో చోటుచేసుకుంటుంది. తాజాగా ఎవరు ఊహించిన విధంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ సంజనా ను హౌస్ నుండి బయటికి పంపిన విషయం తెలిసిందే. అయితే.. ఆమెను సీక్రెట్ రూమ్ లో పెట్టినట్లు చూపించారు. అయితే.. ఆమెను మళ్లీ రూంలోకి పిలుస్తున్నారని బిగ్ బాస్ ఫ్యాన్స్ భావించారు. కానీ, నేడు స్టేజి పైకి తీసుకురావడంతో నిజంగానే ఆమెను బయటకు పంపించారా? అనేది ఆసక్తికరంగా మారింది.
లేటెస్ట్ గా విడుదలైన ప్రోమో ప్రకారం.. కింగ్ నాగార్జున సంజన ను స్టేజ్ పైకి పిలుస్తారు. వచ్చి రాగానే తనను ఎందుకు ఎలిమినేట్ చేశారో అర్థం కావడం లేదంటూ ఎమోషనల్ అవుతుంది సంజన. 'ఒకసారి బాగుంటుంది. ప్రతిసారి అలా చేస్తే.. అది ఇరిటేటింగ్ గా ఉంటుంది'అని నాగార్జున బదులుస్తాడు. ఆ తర్వాత కంటెస్టెంట్ల గురించి చెప్పమని అడిగారు. సంజన సుమన్ శెట్టి గురించి మాట్లాడుతూ..'అతనికి ఏ విషయంలోనూ సరైన స్టాండలేదని, ఒక స్థిరమైన అభిప్రాయం లేదంటూ ముక్కుసూటిగా తన అభిప్రాయాన్ని చెప్పేస్తుంది సంజన.

ఆ తర్వాత శ్రీజ ఏ విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకోవాలనీ నాగార్జున అడగగా.. 1000 ఆర్గుమెంట్స్ నుండి 3000 వరకు చేరుకుందని షాపింగ్ కామెంట్స్ చేస్తుంది. 'సంజన ఐ మిస్ యు' అంటూ భరణి విష్ చేస్తే.. నాగార్జున వెంటనే రియాక్ట్ అయ్యి..'బయటికి వెళ్లి పొమ్మని ఓటు చేసి.. ఇప్పుడు మిస్ యు అంటే ఎలా?' అని నాగార్జున నిలదీస్తాడు. దీంతో ఎమోషనల్ అయినా సంజన.. ప్రతిరోజు అన్నా చెల్లిగా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఉందో ఆరోజు అండగా ఉంటే చాలు' అంటూ భరణికి వార్నింగ్ ఇస్తుంది.
ఇక మాస్క్ మాన్ హరీష్ ను సంజన టార్గెట్ చేస్తూ.. 'అతనికి ఏం మాట్లాడాలి? ఏం చెప్పకూడదు? ఏం చెప్తే అవతల వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతారు? అనే విషయం అతనికి తెలియదు. ఏ విషయమైనా తనకు నచ్చకపోతే వెంటనే గొడవకు వస్తారు. ఇలాంటి వ్యక్తిని నేనెప్పుడూ ఎప్పుడూ చూడలేదు. నేనే గొప్ప.. ప్రైమ్ మినిస్టర్ లాగా ఫీల్ అవుతాడు. అవతల వారిని తొక్కిపడేస్తాడు. అతనితో బతకలేం. ఒక్క విషయాన్ని కూడా యాక్సెప్ట్ చేయడు'అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 'కొంతమందిని పెద్దగా ట్రీట్ చేస్తుంది. కొంతమందిని చిన్నగా ట్రీట్ చేస్తుంది. ఎప్పుడు రా నిన్ను అలా చూసాన్రా బిడ్డ' అంటూ ఫోక్ సింగర్ రాము రాథోడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తనని తాను రాము కవరింగ్ చేసుకుని ప్రయత్నం చేస్తాడు. 'నువ్వు ఇంత చీప్ అనుకోలేదు.. అన్ని వీడియోలు ఉన్నాయి మూసుకో' అంటూ అరుస్తుంది.
తర్వాత ఇమ్మాన్యుయేల్ గురించి మాట్లాడుతూ.. వాడు చాలా స్వీట్. కైండ్ హార్టెడ్ పర్సన్ అంటూ ఎమోషనల్ అయ్యింది. 'తన ఒడిలో పడుకోబెట్టుకుంటే మా అమ్మ గుర్తుకు వచ్చేది' అంటూ ఇమ్మూ కూడా ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత కింగ్ నాగార్జున ఇక ఇక బయటికి వెళ్లొచ్చు సమయం వచ్చేసిందంటూ సంజన అక్కడి నుండి పంపించేస్తాడు. నిజంగానే సంజన ఎలిమినేట్ అయ్యిందా? లేదా కంటెస్టెంట్లు అందరికీ షాక్ ఇచ్చేలా రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనేది మాత్రం సర్వత్ర ఉత్కంఠగా మారింది. ఇది ఏమైనా కింగ్ నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ మాత్రం పిక్స్.


Click it and Unblock the Notifications











