బిగ్‌బాస్‌లో భూకంపం సృష్టిస్తా.. 1 కాదు 5 అంటూ సంజన గల్రానీ శపథం
బిగ్‌బాస్ తెలుగు 9 హోరాహోరీగా సాగుతూ నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. హౌస్‌లో తొలివారం శ్రష్టీ వర్మ, రెండో వారం మర్యాద మనీష్, మూడో వారం ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యారు. గత వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫైనలిస్ట్ దివ్య నిఖిత ఎంట్రీ ఇచ్చింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకన్న సంజన హవా కొద్దిరోజులుగా హౌస్‌లో సాగడం లేదు. ఇంటిలో ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఎక్కువగా నడుస్తుండటంతో సంజన సైలెంట్ అయ్యింది. దీంతో తన మార్క్ చూపించాలని ఆమె ఓ కుట్ర వేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
కెప్టెన్‌గా రాము
బిగ్‌బాస్ తెలుగు 9 చూస్తుండగానే నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. శుక్రవారం కావడంతో కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. తొలి వారం సంజన గల్రానీ కెప్టెన్ కాగా, రెండో వారం డిమోన్ పవన్, మూడో వారం ఇమ్మాన్యుయేల్‌లు కెప్టెన్ అయ్యారు. దీంతో మిగిలిన వారు తమ అవకాశం పరీక్షించుకోవాలని అనుకున్నారు. ఈ వీక్ పవన్ కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరి, రాము రాథోడ్‌లు కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. వీరిలో విజేతను తేల్చేందుకు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఇందులో చివరి వరకు రాము, రీతూ చౌదరిలు నిలిచారు. రీతూని తెలివిగా భరణి తప్పించడంతో రాముకి కెప్టెన్సీ దక్కింది.

సంజన వెన్నుపోటు
కెప్టెన్సీ టాస్క్‌లో ఒకే టీమ్‌లో ఉన్న రాము రాథోడ్‌ని ఓడించడానికి సంజన అన్ని రకాలుగా ట్రై చేసింది. ప్రత్యర్ధి టీమ్‌కి హెల్ప్ చేసినప్పటికీ రామునే కంటెండర్‌గా గెలిచాడు. కెప్టెన్సీ టాస్క్‌లోనూ చివరి వరకు పోరాడి సంజనకి షాకిస్తూ బిగ్‌బాస్ తెలుగు 9కి నాలుగో కెప్టెన్‌గా నిలిచాడు. ఏమాటకి ఆ మాట సంజన మాత్రం తన మైండ్ గేమ్‌తో షాకులు ఇస్తూనే వస్తోంది. గత వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ డ్రామా జరిగి సంజన తట్టా బుట్టా సర్దుకుని స్టేజ్ మీదకి వెళ్లడంతో ఆమె అభిమానులు బాధపడ్డారు.
సంజన మైండ్ గేమ్
ఏ మాత్రం అంచనాలు లేకుండా బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు సంజన గల్రానీ. తెలుగుపై పట్టు లేకపోవడం పైగా, కొంచెం వయసు ఎక్కువ కావడంతో కుర్రాళ్ల దెబ్బకు నెట్టుకొస్తుందా అని అందరూ అనుకున్నారు. తొలిరోజు కాస్త తడబడటంతో ఇక ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యే లిస్ట్‌లో సంజన పేరును వేసేశారు జనం. కానీ రెండో రోజు నుంచి సంజన మైండ్ గేమ్ స్టార్ట్ అయ్యింది. నవ్వుతూ, నవ్విస్తూ, బబుల్ గమ్ నములుతూ పావులు కదిపి హౌస్ మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది.
సంజన దెబ్బకు హీటెక్కిన హౌస్
ఫస్ట్ వీక్‌లో ఓనర్లకి బిగ్‌బాస్ పంపిన సంజన గేమ్ స్టార్ట్ చేసి అందరికీ షాకిచ్చింది. గుడ్డు ఎవరు తీశారో చెప్పమంటూ సెలబ్రెటీలు డిస్కస్ చేసుకుంటుంటే నేను గుడ్డు.. నాకు గుడ్డెందుకు అంటూ షాకిచ్చింది. అలా కామనర్లు, సెలబ్రెటీలు తన్నుకు చస్తుంటే తను ఓ మూలన కూర్చొని సినిమా చూసింది. మరోసారి ఆ రేంజ్‌లో తన తడాఖా చూపించాలని సంజన ప్లాన్ చేసింది. దీనిలో భాగంగా మరోసారి దొంగతనం చేయాలని కన్నింగ్ ప్లాన్ వేసింది. మరోసారి గుడ్డుతోనే పావులు కదపాలని కుట్ర చేసింది.
ఒక్క గుడ్డుకే భూకంపం
బెడ్‌పై పడుకుని ఆలోచిస్తూ.. నాకు ఈసారి ఐదు గుడ్లు కావాలని, బిగ్‌బాస్ టాస్క్ ఇవ్వగానే అందరూ బయటికి పోతారు. దాంతో లోపల ఉన్న పది గుడ్లలో 5 గుడ్లు తినేస్తా.. ఆ గుడ్డు ఎక్కడ ఉందనేది ప్రూఫ్ ఉండకూడదు. ఆ గుడ్డు నేను ఒంటరిగానే తినాలి, ఎందుకంటే షేర్ చేయడానికి పోతే అయిపోతాం. షేర్ చేసుకోవచ్చా? లేదా అనేది ఆలోచిస్తున్నా. ఒక్క గుడ్డుతోనే లాస్ట్ టైం భూకంపం వచ్చింది.. ఈసారి ఐదు గుడ్లు తినేస్తే గుడ్ అయిపోతాం అంటూ సంజన తన ప్లాన్ గురించి తనలో తానే డిస్కస్ చేసుకుంది. చూస్తుంటే వీకెండ్ లోగా.. బిగ్‌బాస్ హౌస్‌లో భూకంపం పెట్టడానికి సంజన అన్ని రకాలుగా ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











