బిగ్‌బాస్‌లో సంజన బాడీ షేమింగ్ కామెంట్స్... ఆ కంటెస్టెంట్‌ని రోడ్డు రోలర్‌తో పోలుస్తూ
భారతీయ బుల్లితెరపై టాప్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది. సస్పెన్స్, మైండ్ గేమ్, గ్లామర్, కామెడీ, ఎమోషన్స్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ ఉండటంతో బిగ్‌బాస్ థీమ్‌కు భారతీయులు ఫిదా అయిపోయారు. హిందీలో మొదట ప్రారంభమై ఆ తర్వాత పలు ప్రాంతీయ భాషల్లోకి ఈ రియాలిటీ షో అడుగుపెట్టింది. అన్ని చోట్లా రికార్డ్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకెళ్తోంది. అయితే బిగ్‌బాస్ షోపై దేశవ్యాప్తంగా సాంప్రయదాయవాదుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. వివాహితుల్ని, అవివాహితుల్ని ఒకే గదిలో కొన్నిర ఉంచడం సరికాదని, అలాగే ఈ షోలో అశ్లీలత, కిస్సులు, హగ్గులు వంటి వాటిపై ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి.
బ్రోతల్ హౌస్ అన్న సీపీఐ నారాయణ
ఇక సీపీఐ నారాయణ వంటి వారైతే బిగ్‌బాస్ షోను బ్రోతల్ హౌస్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ బిగ్‌బాస్ టెలికాస్ట్ అవుతూనే ఉంది. ఇటీవల పర్యావరణానికి హానీ కలిగిస్తున్నారని, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదంటూ కన్నడ బిగ్‌బాస్ షోపై ఏకంగా కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బిగ్‌బాస్ షోను తక్షణం నిలిపివేయాలంటూ కర్ణాటక కాలుష్య నియంత్ర మండలి.. సెట్‌కి తాళాలు వేయించి, కంటెస్టెంట్స్‌ని హోటల్స్‌కి తరలించింది. ఆ తర్వాత వివాదం సద్దుమణగడంతో బిగ్‌బాస్ కన్నడ టెలికాస్ట్ అవుతోంది. కర్ణాటక మాదిరిగానే అన్ని భాషల్లోనూ బిగ్‌బాస్‌ను నిషేధించాలని కోర్టులలో పిటిషన్లు దాఖలవుతున్నాయి.

తెలుగు బిగ్‌బాస్‌పై కేసులు
కొద్దిరోజుల క్రితం బిగ్‌బాస్ తెలుగు 9ని నిషేధించాలంటూ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గజ్వేల్‌కు చెందిన కమ్మరి శ్రీనివాస్, బీ రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ అనే వ్యక్తులు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బిగ్‌బాస్ షోపై ఫిర్యాదు చేశారు. ఈ షో ద్వారా అశ్లీలాన్ని ప్రోత్సహిస్తూ.. సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాజంలో సరైన విలువలు లేని దివ్వెల మాధురి, రీతూ చౌదరి వంటి వారిని కంటెస్టెంట్స్‌గా ఎంపిక చేశారని మండిపడ్డారు. ఇలాంటి వారితో సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రియాలిటీ షో వల్ల యువత తప్పుడు మార్గంలో పయనించే అవకాశం ఉందని తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రస్తావించారు.
సంజనకు సుప్రీంకోర్టు నోటీసులు
ఇక బిగ్‌బాస్ తెలుగులో కాంట్రవర్సీ కంటెస్టెంట్స్‌లో హీరోయిన్ సంజన గల్రానీ కూడా ఒకరు. తెలుగు, కన్నడ సినిమాలలో రాణించిన ఈ ముద్దుగుమ్మ.. డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. కన్నడ డ్రగ్స్ రాకెట్ కేసులో ఏకంగా సుప్రీంకోర్ట్ జోక్యం చేసుకోవడంతో మరోసారి సంజనకు నోటీసులు వెళ్లాయి. బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన తర్వాత ఆమెకు నోటీసులు రావడం గమనార్హం. తెలుగు బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి ఆమెను షోను తన చుట్టూ తిప్పుకుంటూ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా నిలిచారు. టాస్క్‌లు, డిస్కషన్స్, మైండ్ గేమ్స్ ఇలా ఏవైనా సరే సంజనకు ఎదురు లేకుండా సాగుతోంది. ఈసారి బిగ్‌బాస్ తెలుగు 9లో ఖచ్చితంగా విజేతగా నిలిచేవారిలో ఒకరిగా నెటిజన్లు భావిస్తున్నారు.
దివ్య నిఖితపై బాడీ షేమింగ్ కామెంట్స్
అయితే సంజన నోటీ దురుసు వివాదాస్పదమవుతోంది. గతంలో పడాల పవన్ కళ్యాణ్‌ను లో క్లాస్ అంటూ వ్యాఖ్యానించడం దుమారం రేపింది. ఆ తర్వాత తనూజను జలసీ రాణి అంటూ సంబోధించి విమర్శల పాలైంది. తాజాగా ఈసారి ఏకంగా బాడీ షేమింగ్ కామెంట్స్‌ది తెరదీసింది. రమ్య మోక్షతో సంజన ఓ చోట కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కామన్ మెన్ కోటాలో బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన దివ్య నిఖితపై నోరు జారింది. ఇప్పటి వరకు నేను తనతో మాట్లాడలేదు.. తనూజాతో మాట్లాంది, ఒక రోడ్డు రోలర్‌లా మాదిరిగా మీదకి ఎక్కేస్తుందంటూ కామెంట్స్ చేసింది. దీంతో ఈ వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇలాంటి వారిని కంటెస్టెంట్స్‌గా ఎందుకు తీసుకొస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మరి దీనిపై ఈ వీకెండ్‌లో నాగార్జున ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











