Bigg Boss Telugu Elimination: డేంజర్ జోన్‌లో ఏకంగా నలుగురు.. ఇద్దరు కామనర్స్‌కి గండం?
బిగ్‌బాస్ తెలుగు 9 చూస్తుండగానే తొలి వారం పూర్తి చేసుకుని రెండో వారం ఎండ్‌కి వచ్చేసింది. ఇప్పటికే గొడవలు, కొట్లాటలతో హౌస్ హీటెక్కిపోతోంది. వీకెండ్ అనగానే బిగ్‌బాస్‌లో ఎలిమినేషన్ కంపల్సరీ. ఏ ఎపిసోడ్ మిస్ అయినా వీకెండ్ ఎపిసోడ్‌ను మాత్రం ప్రేక్షకులు మిస్ కారు. తొలి వారం కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. ఈ క్షణంలోనే ఓటింగ్ ఎలా జరుగుతుందో చూస్తే..
నామినేషన్స్‌లో 7గురు
బిగ్‌బాస్ తెలుగులో రెండో వారంలో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. వారు భరణి శంకర్, ఫ్లోరా షైనీ, హరిత హరీశ్, మనీష్ మర్యాద, డిమోన్ పవన్, ప్రియా శెట్టి, సుమన్ శెట్టి. గత వారం మాదిరిగానే ఈ వారం కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో నిలవడంతో డూ ఆర్ డై అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. వీరిలో రెండో వారం ఎవరు నామినేట్ కాబోతున్నారు? ఈసారి డబుల్ ఎలిమినేషనా? సింగిల్ ఎలిమినేషనా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

కెప్టెన్‌గా డిమోన్ పవన్
బిగ్‌బాస్ సెకండ్ వీక్ కెప్టెన్‌గా డిమోన్ పవన్ నిలిచాడు. రెండో వారానికే సెలబ్రెటీలను దాటుకుని ఓ కామనర్ బిగ్‌బాస్ కెప్టెన్ కావడం మామూలు విషయం కాదు. తొలుత ప్రియా శెట్టి, దమ్ము శ్రీజ, హరీష్, పవన్ కళ్యాణ్‌లు కూడా కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. అయితే బిగ్‌బాస్ ఆదేశాల మేరకు ఈ నలుగురిని సంజన అనర్హులుగా ప్రకటించింది. దీంతో మర్యాద మనీష్, భరణి శంకర్, డిమాన్ పవన్‌లు రెండో వారంలో కెప్టెన్సీ కంటెండర్లుగా తలపడ్డారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో గెలిచి డిమోన్ పవన్ హౌస్‌కి రెండో కెప్టెన్‌గా నిలిచాడు.
ఓటింగ్‌లో సుమన్ శెట్టి హవా
రెండో వారంలో కెప్టెన్ కావడంతో డిమోన్ పవన్ నామినేషన్స్ నుంచి ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోయినట్లే. దీంతో భరణి శంకర్, ఫ్లోరా షైనీ, హరిత హరీశ్, మనీష్ మర్యాద, ప్రియా శెట్టి, సుమన్ శెట్టిలలో ఎవరు సెకండ్ వీక్ ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓటింగ్ రిజల్ట్స్‌ను ఒకసారి పరిశీలిస్తే.. తొలి వారం మాదిరిగానే, రెండో వారంలోనూ సుమన్ శెట్టి ఓటింగ్‌లో దుమ్మురేపుతున్నాడు. ఓటింగ్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచిన అతనికి దరిదాపుల్లో ఏ కంటెస్టెంట్ కూడా లేడు. దాదాపు 42 శాతం ఓటింగ్‌తో సుమన్ శెట్టి అగ్రస్థానంలో ఉన్నాడు.
డేంజర్ జోన్‌లో నలుగురు
ఆ తర్వాత భరణి శంకర్ (23 శాతం ఓటింగ్), ఫ్లోరా షైనీ (8 శాతం ఓటింగ్), హరిత హరీష్ (7 శాతం ఓటింగ్), మర్యాద మనీష్ (6.68 శాతం ఓటింగ్), ప్రియా శెట్టి (6.53 శాతం ఓటింగ్)తో నిలిచారు. ఫ్లోరా, హరీష్, మనీష్, ప్రియాల ఓటింగ్ అటు ఇటుగా ఓకేలా ఉండటంతో వీరు డేంజర్ జోన్‌లో నిలిచారు. అయితే మర్యాద మనీష్, ప్రియాశెట్టిల మెడపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ కావడానికి ఇంకా సమయం ఉండటంతో ఓటింగ్స్ మారే అవకాశం ఉంది. మరి ఈ వారం ఎలిమినేట్ అవుతారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











