Bigg Boss Buzzz: శ్రీజకు చెమటలు పట్టించిన శివాజీ.. దమ్ముంటే టచ్ చేయి అంటూ..
Bigg Boss Buzzz: బిగ్ బాస్.. బుల్లి తెర పేక్షకులను, ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో అట్రాక్ట్ చేస్తున్న రియాల్టీ షో. ప్రతి సీజన్ సరికొత్త కాన్సెప్ట్ తో ప్రారంభం కాగా.. ఈ సీజన్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అనే థీమ్‌తో ప్రారంభమైంంది. ఎవరు ఊహించని ట్విస్టులు, సర్ప్రైజ్ తో ఆసక్తికరంగా సాగుతోంది. అయితే.. ఈ షోలో కంటెస్టెంట్లు చేసిన తప్పులను వీకెండ్ లో కింగ్ నాగార్జున ఎత్తిచూపితే.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను బిగ్ బాస్ బజ్‌కి పిలిచి, తనదైన శైలిలో ఇచ్చిపడేస్తాడు మంగపతి శివాజీ. ఇలా ఈ వారం ఎలిమినేట్ అయిన దమ్ము శ్రీజ, ఫ్లోరాల దుమ్ము దులిపాడు. ఇంతకీ ఏమన్నారు? షో ఎలా సాగింది?
బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌కి తర్వాతి అడ్రస్ "బిగ్ బాస్ బజ్"షో. హౌస్ లో ఎలా ఆడారో? ఏం మాట్లాడారో? ఎవరి మీద ఎలా రియాక్ట్ అయ్యారో ? అనే విషయాలపై వీకెండ్‌లో కింగ్ నాగార్జున కాస్త క్లాస్ అరుసుకుంటే.. మంగపతి శివాజీ మాత్రం ఇక్కడ కూడా తగ్గేదేలే అన్నట్లుగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల తప్పులను చూపిస్తూ.. వారిని ఎండగడుతారు. అలాగే ఈ వారం బిగ్ బాస్‌లో డబుల్ ఎలిమినేషన్ జరగగా, ఫ్లోరా సైని మరియు శ్రీజ దమ్ము శివాజీ ఎదుట బజ్ ఇంటర్వ్యూకి హాజరయ్యారు. మెయిన్ గా ఈ వారం బిగ్ బాస్ కార్యక్రమంలో దమ్ము శ్రీజ దుమ్ము దులిపాడు.

ప్రోమో స్టార్ట్ అవ్వగానే శ్రీజను ఉద్దేశించి శివాజీ సూటిగా ప్రశ్నించారు. "నువ్వు కామనర్స్, సెలబ్రిటీస్ అని మనసులో గట్టిగా పెట్టుకున్నావ్. అదే నీ మైనస్ పాయింట్. నీ ఎలిమినేషన్‌కు కారణం అదే."అని గట్టిగా చెప్పారు. శ్రీజ వెంటనే 'నేను ఒక్కసారి మాత్రమే అలా అన్నాను'అంటూ బదులిచ్చింది. దీంతో శివాజీ వెంటనే రియాక్ట్ అయి..'నీ గేమ్ మైనస్ కి కారణమే అదే'అని వివరించారు. 'గేమ్స్, ఎమోషన్స్, టాస్కులు.. నువ్వు ఎందులో సరిగా ఆడావ్? 'అని శివాజీ తన స్టైల్ లో మరో ప్రశ్నఅడిగారు. దానికి శ్రీజ బదులిస్తూ..'టు బి ప్రాంక్.. ఒక మనిషిని నువ్వు నెగిటివ్.. నువ్వు నెగటివ్.. నువ్వు ఎవరికీ సెట్ కావు.. నీతో మాట్లాడకూడదంటే.. ఆటోమేటిక్ గా ఎక్కడో డౌన్ అవుతాం.. అదే విషయం నాకు జరిగింది. హౌస్‌లో ఎవరు ఎవరిని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది గమనించా, అందుకే ఆ మాటలు వచ్చాయి" అని చెప్పింది.
అంతటితో శివాజీ ఆగకుండా శ్రీజపై మళ్లీ ఫైర్ అయ్యారు. ' శ్రీజకు గొంతు ఎక్కువ, వెనుక ముందు చూడకుండా మాట్లాడేస్తుంది. నీతో కూర్చున్న వాళ్లు లేచి వెళ్లిపోయారంటే కారణం ఏమిటో ఆలోచించావా?'అని గట్టిగా అడిగారు. శ్రీజ'నేను ఒక్కరి దగ్గర కూర్చున్నా అంటే.. వేరే వాళ్లు లేచి వెళ్లేవాళ్లు'అని అంగీకరించింది. దానికి వెంటనే శివాజీ "నీ హౌస్‌మేట్స్ నిన్ను చూసి పారిపోతున్నారు అంటే మీరు రెండు వారాలు మీరు ఎంత టార్చర్ పెట్టారో ఊహించుకో!" అంటూ సూటి కౌంటర్ వేశారు. ఆ తరువాత డిమాన్ పవన్ ఫోటో చూపిస్తూ.. "హౌస్‌లో లవ్ యాంగిల్ ప్లాన్‌గా నడిపారా?" అని అడిగారు. దానికి శ్రీజ "కంటెంట్ కోసం అయి ఉండొచ్చు" అని సమాధానమిచ్చింది.
ఇంతటితో ఆగకుండా శివాజీ .. బిగ్ బాస్ హౌస్‌లో శ్రీజ చెప్పిన "దమ్ముంటే టచ్ చేయండి, ధైర్యం ఉంటే టచ్ చేయండి, కొడతా, తంతా"వంటి మాటల గురించి కూడా ప్రస్తావించారు. ఆ సన్నివేశంపై శ్రీజ తలవంచుకుంది. మొత్తం మీద ఈ బిగ్ బాస్ బజ్ ఎపిసోడ్‌లో శివాజీ ప్రశ్నలతో శ్రీజ, ఫ్లోరాలు చెమటలు పట్టించుకున్నారు.
మరోవైపు.. ఫ్లోరాను కూడా ఇంటర్య్వూ చేశారు. "మీరు అసలు గేమ్ ఎందుకు ఆడలేకపోయారు?" అని ఫ్లోరాను నిలాదీశారు. దీంతో ఫ్లోరా.. 'నేను ప్రతి వారం ఇంప్రూవ్ అయ్యాను" అని సమాధానమిచ్చింది. అయితే శివాజీ సూటిగా "లేదు, మీరు గేమ్ ఆడలేకపోయారు" అని తిప్పికొట్టారు. ఆ తరువాత 'సంజనా నిన్ను తోలుబొమ్మలాగా ఆడించిందని అనిపించలేదా?'అని సూటిగా ప్రశ్నించగా, ఆమె కాస్త తడబడుతూ "నేను నా లెవల్‌కి తగ్గట్టు ప్లే చేశాను" అని సమాధానమిచ్చింది. వీక్షకులు అయితే "ఇదే అసలైన బిగ్ బాస్ బజ్" అని కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











