Bigg Boss 9 Telugu: ర్యాంకింగ్ టాస్క్‌తో హౌస్‌లో టెన్షన్.. కెప్టెన్సీ కోసం బిగ్ ఫైట్..

Bigg Boss 9 Telugu:బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్. ఈ రియాలిటీ షో ప్రతి సీజన్‌లో కొత్త ట్విస్ట్‌లు, షాకింగ్ సర్ప్రైజ్‌లతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. ప్రస్తుత బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కూడా అదే తరహాలో వినూత్న ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. ఈ సీజన్‌ను ప్రత్యేకంగా 'చదరంగం కాదు, రణరంగం'కాన్సెప్ట్‌తో ప్లాన్ చేశారు. ఇప్పటికే హౌస్‌లో 9 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్లు ఎంట్రీ ఇచ్చారు. కంటెస్టెంట్లు తమ మైండ్ తో తమని తాము కాపాడుకుంటుండగా, బిగ్ బాస్ మాత్రం వారికి దిమ్మతిరిగిపోయేలా ట్విస్టులు ఇస్తున్నారు. ప్రతి రోజు ఓ కొత్త మార్పు చేస్తూ.. గేమ్‌ను మరింత ఉత్కంఠభరితంగా మార్చుతున్నారు. తాజాగా, అనూహ్యంగా ఓ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.

కంటెస్టెంట్ల మధ్య బిగ్ బాస్ చిచ్చు
గతంలో ఎన్నాడు చూడలేని, చూడని టాస్కులు, దిమ్మతిరిగే ట్విస్టులు ఇస్తున్నారు. తాజాగా గేమ్ కూడా "చదరంగం కాదు.. రణరంగం" అనే కాన్సెప్ట్‌తో సాగుతోంది. ఈ షోలో సెలబ్రిటీలు, కామనర్స్ కలిసి పోటీపడుతున్నారు. ఇప్పటికే మూడో వారం హౌస్‌లో గేమ్ ఉత్కంఠగా మారింది. బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా వచ్చిన దివ్యా నిఖిత హౌస్ లో అడుగుపెట్టింది. వచ్చి రాగానే.. కంటెస్టెంట్ల మధ్య చిచ్చుపెట్టేలా బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. కంటెస్టెంట్స్ ఆటతీరును ఎలా ఉందో చెప్పామన్నారు. ఈ క్రమంలో దివ్యా నిఖిత రెచ్చిపోయింది. ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ, సూటిగా అభిప్రాయాలు వెల్లడించింది.

Bigg Boss Telugu 9 Shocking Ranking Twist Heated Captaincy Task

వైల్డ్‌కార్డ్ ఎంట్రీ షాకింగ్ ట్విస్ట్
బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం.. దివ్యా నిఖిత హౌస్ సభ్యులను మాటలతో ర్యాగ్ చేయాలి. ఈ క్రమంలో శ్రీజను ఉద్దేశిస్తూ.. "నువ్వు గొడవలు పెడుతున్నావు కానీ, సాల్వ్ చేయడం లేదు" అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. ఆ తరువాత ప్రియాను టార్గెట్ చేస్తూ.. "నీ ఆటిట్యూడ్ అందరికి విసుగు తెప్పిస్తోంది, సలహా తీసుకోవడంలో వెనుకబడుతున్నావు" అని ఫైర్ అయ్యింది. అలాగే సంజన ఎక్స్ప్రెషన్స్, ఇమ్మానుయేల్ నడవడి, భరణి శంకర్ ఓవర్ కాన్ఫిడెన్స్‌ పైన కూడా దివ్య షాకింగ్ కామెంట్స్ చేసింది. కంటెస్టెంట్లపై నేరుగా కామెంట్స్ చేసి హౌస్ వాతావరణాన్ని మరింత హీట్ చేసింది.

దివ్యా నిఖిత ర్యాంకింగ్ ఇలా..
బిగ్ బాస్ ఆదేశాల మేరకు వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి వచ్చిన దివ్యా నిఖిత కంటెస్టెంట్లకు ర్యాంకులు కేటాయించింది. మొత్తం 13 మందికి ఒకటి నుండి పదమూడు వరకు ర్యాంకింగ్ ఇచ్చింది. ఇందులో భరణి శంకర్ మొదటి స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో ఇమ్మానుయేల్, మూడవ స్థానంలో సంజన ఉన్నారు. నాలుగో స్థానాన్ని డిమాన్ పవన్ దక్కించుకోగా, ఐదవ స్థానంలో తనుజ, ఆరవ ర్యాంక్‌లో సుమన్ శెట్టి నిలిచారు. ఏడవ స్థానంలో రీతు వర్మ, ఎనిమిదవ స్థానంలో ప్రియా శెట్టి, తొమ్మిదవ స్థానంలో మాస్క్ మాన్ హరిత హరీష్ ఉన్నారు. పదో స్థానాన్ని శ్రీజ పొందగా, పదకొండవ స్థానంలో ఆర్మీ కళ్యాణ్ నిలిచాడు. చివర్లో ఫోక్ సింగర్ రాము రాథోడ్ 12వ ర్యాంక్, ఫ్లోరా షైనీ 13వ ర్యాంక్‌తో నిలిచారు. ఈ ర్యాంకింగ్ హౌస్‌లో కొత్త టెన్షన్, చర్చలకు కారణమైంది.

హీట్ పుట్టించిన కెప్టెన్సీ టాస్క్
దివ్యా నిఖిత తన అభిప్రాయం ప్రకారం.. ఐదు మందిని కెప్టెన్సీ టాస్క్ కోసం ఎంపిక అయ్యారు. వీరిలో భరణి శంకర్, ఇమ్మానుయేల్, సంజన, డిమోన్ పవన్, తనుజాలు ఉన్నారు. ఎంపికైనవారంతా హౌస్ కెప్టెన్ అవ్వడానికి ఒక కఠినమైన టాస్క్‌లో పాల్గొన్నారు. బిగ్ బాస్ రూపొందించిన ఈ టాస్క్‌లో కంటెస్టెంట్స్ ప్రత్యేక జాకెట్ ధరించి ఉండాలి. బయట నుండి ఇతరులు బాల్స్ విసురుతుండగా, వాటిని జాకెట్‌పై అతుక్కోకుండా తప్పించుకోవాలి. ఇది కేవలం శారీరక శక్తి పరీక్ష మాత్రమే కాకుండా, మైండ్ గేమ్‌గా కూడా మారింది. ప్రతి ఒక్కరు కెప్టెన్సీ కోసం తమ శక్తిమేరకు పోరాడుతున్నారు. ఈ టాస్క్ తో బిగ్ బాస్ హౌస్ లో ఉత్కంఠ మరింత పెరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X