Bigg Boss Telugu 9: నీ సారీ ఎవడికి కావాలి.. కామనర్‌కి ఇచ్చిపడేసిన సుమన్ శెట్టి
బిగ్‌బాస్ తెలుగు 9 ఉత్కంఠగా సాగుతోంది. మరికొద్దిగంట్లో రెండో వారం పూర్తి చేసుకుని, మూడో వారంలోకి అడుగుపెట్టనుంది బిగ్‌బాస్ తెలుగు. వీకెండ్ కావడంతో హోస్ట్ అక్కినేని నాగార్జున కంటెస్టెంట్స్ ఆటతీరు, హౌస్‌లో గొడవలపై విశ్లేషణ చేశారు. ఈ సందర్భంగా టెనెంట్స్‌కి ఓనర్స్‌గా మారే ఛాన్స్ కోసం బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో సుమన్ శెట్టి, ప్రియా శెట్టికి మధ్య జరిగిన గొడవపై నాగార్జున పంచాయతీ పెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే..
డబుల్ హౌస్ - డబుల్ డోస్
బిగ్‌బాస్ తెలుగు 9లో రెండు హౌస్‌లు ఉంటాయని ముందు నుంచి చెబుతున్నారు. దీనికి తగినట్లుగానే డబుల్ హౌస్.. డబుల్ డోస్ అంటూ నాగార్జున ప్రోమోలలో చెబుతూ వచ్చారు. బిగ్‌బాస్ గ్రాండ్ లాంచ్ రోజున బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో గెలుపొందిన కామనర్స్.. ఓనర్స్‌గా మెయిన్‌హౌస్‌లో ఉంటూ సకల సదుపాయాలు అనుభవిస్తారని నాగార్జున తెలిపారు. సెలబ్రెటీలు టెనెంట్స్‌గా ఔట్ హౌస్‌లో ఉంటారని, ఓనర్స్ దయాదాక్షిణ్యాలను బట్టే ఫుడ్, ఇతర లగ్జరీస్ లభిస్తాయని కండీషన్ చెప్పారు నాగార్జున.

సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేసిన ప్రియ
ఔట్‌హౌస్‌లో ఉన్న సెలబ్రెటీలు.. ఫుడ్ కోసం ఎంతో ఇబ్బంది పడ్డారు. దీంతో కిచెన్‌లో నిత్యం గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే సెలబ్రెటీలకు ఓనర్స్ అయ్యే అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. ఓనర్స్ విసిరిన వస్తువులను పట్టుకుని ఎండ్ బజర్ మోగేలోపు టెనెంట్స్ వాటిని తమ బాస్కెట్‌లో భద్రంగా దాచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే భరణి శంకర్‌కు ఓనర్‌గా అవకాశం దక్కడంతో మిగిలిన సెలబ్రిటీలైన రాము రాథోడ్, తనూజ, ఫ్లోరా షైనీ, ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టి, రీతూ చౌదరి, సంజనలు ఈ టాస్క్‌లో పాల్గొన్నారు. టాస్క్ మొదలయ్యాయి.. సుమన్ శెట్టి నుంచి సంజన, ఫ్లోరా షైనీలు వస్తువులు లాక్కోవడానికి ప్రయత్నించారు. కొడితే ఎలిమినేట్ అని సంచాలక్‌గా ఉన్న ప్రియా శెట్టి చెప్పింది. ఈ క్రమంలో సంజనను సుమన్ కొట్టినట్లుగా ఉండటంతో మరో మాట లేకుండా సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేసేసింది.
నాగ్ ముందు బుకాయించిన ప్రియ
దీనిపై నాగార్జున విశ్లేషణ చేశారు. ఓనర్స్ గెలవాలని డిసైడ్ అయిపోయావా? అని వీడియో వేసి చూపించారు. ఇందులో సంజన, ఫ్లోరా షైనీల నుంచి వస్తువులను సుమన్ శెట్టి కాపాడుకోవడం, సంజనను సుమన్ కొట్టినట్లుగా ఉండటం, దానికి సుమన్‌ను ప్రియ ఎలిమినేట్ చేసినట్లుగా ఉంది. నువ్వు చెప్పిన తర్వాత సంజనను, ఫ్లోరాను సుమన్ కొట్టలేదని నాగార్జున తేల్చి చెప్పారు. సంజన గారిని కొట్టినట్లుగా అనిపించడంతో సుమన్ అన్నని ఎలిమినేట్ చేసినట్లుగా ప్రియ బుకాయించే ప్రయత్నం చేసింది.
నా సారీ వల్ల ఓనర్ కాలేను
సుమన్ టీ షర్ట్‌నే కొట్టానని చెబుతున్నాడు.. నువ్వు డెసిషన్ తీసుకునే ముందు సంజనను అడిగావా? అని నాగ్ ప్రశ్నించారు. రెండు సార్లు నీ మూలన సుమన్ నష్టపోయాడన్నది మా అభిప్రాయమని చెప్పాడు. దీంతో నేను చూసుకోకపోవడం వల్లనే ఇలా జరిగిందని సుమన్‌కు ప్రియ సారీ చెప్పింది. ఓనర్ మిస్ అయిపోయింది కదమ్మా.. సారీ చెప్పేస్తే నాకేం వస్తుంది, ఓనర్ ఇచ్చేస్తానంటే నీ సారీ తీసుకుంటానని సుమన్ చెప్పడంతో అందరూ నవ్వేశారు. అది చూసిన నాగార్జున.. బాగా ఇంప్రూవ్ అయ్యావని సుమన్‌ను మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా సుమన్ గేమ్‌ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











