Bigg Boss Elimination: సీక్రెట్ రూమ్‌లోకి సంజన.. షాకింగ్‌గా మరో ఎలిమినేషన్.. ఎవరంటే?

బిగ్‌బాస్ తెలుగు 9 మూడో వారం చివరికి చేరుకుంది. చూస్తుండగానే రెండు వారాలు గడిచేయగా, హౌస్‌లో గేమ్ ఉత్కంఠగా మారుతోంది. కామనర్స్, సెలబ్రెటీలు హోరాహోరీగా తలపడుతున్నారు. గొడవలు, కొట్లాటలే కాదు.. అప్పుడప్పుడు సరదాలు, సంతోషాలు, అల్లరి కూడా హౌస్‌లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మూడో వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు? ఎవరు సేఫ్ జోన్‌లో ఉన్నారు? ఈ వివరాలు పరిశీలిస్తే..

హాట్ హాట్‌గా నామినేషన్స్
9 మంది సెలబ్రెటీలు, ఆరుగురు కామనర్స్‌తో కలిపి మొత్తం 15 మందితో బిగ్‌బాస్ తెలుగు 9 ప్రారంభమైంది. వీరిలో తొలివారం కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో మర్యాద మనీశ్ హౌస్‌ను వీడారు. దీంతో ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో 13 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. వీరిలో ఈ సోమవారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ జరగ్గా.. మొత్తంగా మూడో వారం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారు పవన్ కళ్యాణ్, ప్రియ, హరీష్, రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, రాము రాథోడ్. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.

Bigg Boss Telugu 9 Third Week Elimination Padala Pawan Kalyan and Priya shetty in Danger zone

షాకిచ్చిన బిగ్‌బాస్
బిగ్‌‌బాస్‌లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని గాసిప్స్ వైరల్ అయ్యాయి. మిడ్‌వీక్ ఒకరు, వారం చివరిలో మరొకరు హౌస్‌ను వీడతారని వార్తలు వచ్చాయి. దీనిని నిజం చేస్తూ ఈ శుక్రవారం ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ పేరుతో దివ్య నిఖితాను పంపించి, ఆ వెంటనే ఎవిక్షన్ అంటూ బాంబు పేల్చాడు. అర్థరాత్రి గంట కొట్టి అందరినీ నిద్రలేపిన బిగ్‌బాస్.. గార్డెన్ ఏరియాకు రప్పించి రెడ్ సీడ్ పొందని వారికి ఎలాంటి ఫలితం దక్కబోతుందో చెబుతానని అన్నాడు. రెడ్ సీడ్ దక్కించుకున్న వారికి ఓ కంటెస్టెంట్‌ను ఇంటికి పంపించే అధికారాన్ని ఇస్తున్నానని చెప్పాడు బిగ్‌బాస్. దివ్య, ఫ్లోరాలను తప్పించి మీలో ఒకరిని ఎలిమినేట్ చేయాల్సిందిగా సూచించాడు.

హౌస్‌ను వీడిన సంజన
దాంతో రెడ్ సీడ్ పొందిన భరణి, హరీష్, పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, రాము రాథోడ్‌లు మరో మాట లేకుండా సంజన పేరును సూచించారు. దాంతో సంజన బాగా ఎమోషనల్ అయ్యింది. నా పరంగా బిగ్‌బాస్ హౌస్‌కి 100కి 500 శాతం ఇచ్చానని చెబుతూ సంజన హౌస్‌ను వీడింది. అయితే అందరూ ఊహించినట్లుగానే సంజన సీక్రెట్ రూమ్‌లో ఉన్నారు. ఎట్టకేలకు ఓ కంటెస్టెంట్ హౌస్‌లో లేకపోవడంతో మరి ఆదివారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ ఓటింగ్ అనేది హాట్ టాపిక్‌గా మారింది.

ఈ వారం షాకింగ్‌ ఎలిమినేషన్
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న బిగ్‌బాస్ తెలుగు 9 ఓటింగ్ వివరాలు పరిశీలిస్తే.. ఫ్లోరా షైనీ, రాము రాథోడ్‌ల మధ్య ఓటింగ్‌లో పోరు జరుగుతోంది. అయితే ఫ్లోరాపై రామునే పై సాధించాడు. రాము రాథోడ్ 26.4 శాతం ఓటింగ్‌తో టాప్‌లో ఉండగా.. ఫ్లోరా షైనీ 20.87 శాతం ఓటింగ్‌తో తర్వాతి స్థానంలో నిలిచారు. అనంతరం రీతూ చౌదరి 14.11 శాతం, హరిత హరీశ్ 13.8 శాతం, పవన్ కళ్యాణ్ పడాల 12.9 శాతం, ప్రియా శెట్టి 11.93 శాతం ఓటింగ్‌తో నిలిచారు. వీరిలో పవన్ కళ్యాణ్, ప్రియా శెట్టిలు డేంజర్ జోన్‌లో నిలవగా వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X