Bigg Boss Telugu Elimination: బిగ్‌బాస్ నుంచి మరో కామన్‌మెన్ ఔట్? ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?
బిగ్‌బాస్ లవర్స్‌కు బాగా కిక్ ఇచ్చే ఎపిసోడ్ ఏదైనా ఉందంటే అది ఎలిమినేషన్ ఎపిసోడే. వారం మొత్తం జరిగే తప్పులపై విశ్లేషణలు చేసి హోస్ట్ అక్కినేని నాగార్జున ఎవరిని ఇంటికి పంపుతాడనే ఉత్కంఠ ప్రేక్షకులతో పాటు కంటెస్టెంట్స్‌లోనూ ఉంటుంది. హౌస్‌లో కంటెస్టెంట్స్ అంతా కష్టపడి ఎలిమినేషన్‌ను తప్పించుకోవాలనే చూస్తారు. కానీ ప్రతి వారం ఎవరో ఒకరు ఇంటికి వెళ్లాల్సిందే. ఇక బిగ్‌బాస్ తెలుగు 9లో మూడో వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? అనేది ఉత్కంఠగా నిలిచింది. ఈ వివరాల్లోకి వెళితే..
నామినేషన్స్‌లో ఆరుగురు
బిగ్‌బాస్ తెలుగు 9లో తొలివారం కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, రెండో వారంలో మర్యాద మనీశ్ ఇంటి ముఖం పట్టారు. దీంతో ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో 13 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. వీరిలో సోమవారం జరిగిన నామినేషన్స్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారు పవన్ కళ్యాణ్, ప్రియ, హరీష్, రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, రాము రాథోడ్. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.

షాకిచ్చిన బిగ్‌బాస్
బిగ్‌బాస్‌లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని సోమవారం నుంచే సోషల్ మీడియాలో పుకార్లు వినిపించాయి. దీనిని నిజం చేస్తూ శుక్రవారం అర్ధరాత్రి బాంబు పేల్చాడు బిగ్‌బాస్. రెడ్ సీడ్ పొందిన వారికి స్పెషల్ పవర్ ఇచ్చి.. దివ్య నిఖిత, ఫ్లోరా షైనీ తప్పించి మిగిలిన వారిలో ఎవరినైనా ఎలిమినేట్ చేయమని చెప్పారు. దాంతో రెడ్ సీడ్ పొందిన భరణి, హరీష్, పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, రాము రాథోడ్‌లు పక్కకి వెళ్లి డిస్కస్ చేసుకుని సంజన పేరుకు ఆమోదముద్ర వేశారు. ఈ మాట వినగానే సంజన బాగా ఎమోషనలై అందరికీ వీడ్కోలు చెప్పి హౌస్‌ను వీడింది. ఎపిసోడ్ చివరిలో సీక్రెట్ రూమ్‌లో నుంచి సంజన హౌస్‌లో జరిగే వాటిని చూస్తుండటంతో.. ఆమె సీక్రెట్ రూమ్‌లో ఉందని ప్రేక్షకులు భావించారు.
సంజన ఎలిమినేట్
అయితే ఇక్కడే బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. సంజనను సీక్రెట్ రూమ్‌కి పంపడం లేదని ఎలిమినేట్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. శనివారం విడుదల చేసిన ప్రోమోలో తన లగేజ్‌తో పాటు సంజన స్టేజ్ మీదకి వచ్చి నాగార్జునను హగ్ చేసుకుంది. దీంతో బిగ్‌బాస్ తెలుగు 9లో సంజన ప్రయాణం ముగిసినట్లే. ఈ సీజన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా, టైటిల్ విజేతలలో ఒకరిగా నిలిచిన సంజన హౌస్‌ను వీడటం ఆమె అభిమానులను నిరాశకు గురిచేసింది.
వీకెండ్‌లో మరో ఎలిమినేషన్
అయితే ఈ షాక్ నుంచి తేరుకొనేలోపు బిగ్‌బాస్ మరో షాక్ తగిలింది. ఆదివారం మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా సమాచారం ప్రకారం.. బిగ్‌బాస్ తెలుగు 9లో మూడో వారం రాము రాథోడ్ 26.4 శాతం ఓటింగ్‌తో టాప్‌లో ఉండగా.. ఫ్లోరా షైనీ 20.87 శాతం ఓటింగ్‌తో తర్వాతి స్థానంలో నిలిచారు. అనంతరం రీతూ చౌదరి 14.11 శాతం, హరిత హరీశ్ 13.8 శాతం, పవన్ కళ్యాణ్ 12.9 శాతం, ప్రియా శెట్టి 11.93 శాతం ఓటింగ్‌తో నిలిచారు. వీరిలో పవన్ కళ్యాణ్, ప్రియా శెట్టిలు డేంజర్ జోన్‌లో నిలవగా వీరిలో ప్రియాశెట్టి ఈ వారం ఎలిమినేట్ అవుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరోసారి కామనర్ ఔట్
నోరు వేసుకుని అరవడం తప్పించి ఈమె పెద్దగా ప్రభావం చూపించలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండో వారంలో సుమన్ శెట్టితో గొడవ, నాగార్జున క్లాస్ పీకడం తప్పించి ప్రియాశెట్టి ఫుటేజ్ పెద్దగా కనిపించలేదని చెబుతున్నారు. ఈ కారణాలతో ఈసారి నామినేషన్స్‌లో పెద్దగా ఓటింగ్ సాధించలేక పోయింది ప్రియ. దాంతో మూడో వారం ప్రియశెట్టి ఎలిమినేట్ కావడం తథ్యం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











