Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్? ఆ ఇద్దరికి పొంచి ఉన్న ముప్పు!

బిగ్‌బాస్ తెలుగు 9 మూడో వారంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే థర్డ్ వీక్ కూడా నామినేషన్స్ హోరాహోరీగా జరగ్గా.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? అన్న క్యూరియాసిటీ నెలకొంది. సోషల్ మీడియాలో మాత్రం ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు 9 మూడో వారం ఓటింగ్ ఎలా జరుగుతోంది? నిజంగానే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందా? అన్నది పరిశీలిస్తే..

హాట్ హాట్‌గా నామినేషన్స్
9 మంది సెలబ్రెటీలు, ఆరుగురు కామనర్స్‌తో కలిపి మొత్తం 15 మందితో బిగ్‌బాస్ తెలుగు 9 ప్రారంభమైంది. వీరిలో తొలివారం కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో మర్యాద మనీశ్ హౌస్‌ను వీడారు. దీంతో ప్రస్తుతం బిగ్‌బాస్ 9 హౌస్‌లో 13 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. వీరిలో ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ జరగ్గా.. మొత్తంగా మూడో వారం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారు పవన్ కళ్యాణ్, ప్రియ, హరీష్, రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, రాము రాథోడ్.

Bigg Boss Telugu 9 Third Week Voting get Ready for double elimination in this week Rithu Chowdary in Danger zone

రీతూ చౌదరి కంటతడి
నామినేషన్స్ ముగిశాక తనను కెప్టెన్ డీమోన్ పవన్ స్పెషల్ పవర్‌తో ఎందుకు సేవ్ చేయలేదని రీతూ చౌదరి డల్ అయ్యింది. నిన్ను కెప్టెన్‌ని చేస్తే నన్ను సేవ్ చేయవా అని రీతూ కన్నీళ్లు పెట్టుకుంది. అటు దమ్ము శ్రీజ కూడా తనని ఓనర్లు అందరూ నెగిటివ్ అంటూ నామినేట్ చేశారని శ్రీజ ఏడ్చేసింది. అయితే ఇమ్మూ వచ్చి చెల్లి అంటూ ఓదార్చడంతో శ్రీజ చల్లబడింది. అనంతరం రీతూ చౌదరిని బిగ్‌బాస్.. కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి చికెన్ ఆశపెట్టి హౌస్‌లో ఏం జరుగుతుందో సీక్రెట్స్ చెప్పాలంటూ ఆఫర్ ఇచ్చాడు. దాంతో రెచ్చిపోయిన రీతూ.. తనూజ- పవన్ కళ్యాణ్ మధ్య ఏదో జరుగుతుందని చెప్పింది. ఆ తర్వాత పవన్ గురించి చెప్పింది.. అయితే ఈ విశేషాలు చాలవని మరికొన్ని కావాలని బిగ్‌బాస్ చెప్పడంతో హాట్ హాట్ న్యూస్ పట్టుకొస్తానని చెప్పి వెళ్లిపోయింది.

దూసుకెళ్తోన్న రాము రాథోడ్
ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్స్‌ను బట్టి బిగ్‌బాస్ తెలుగు 9 థర్డ్ వీక్ ఓటింగ్ విషయానికి వస్తే.. ఓటింగ్స్ తారుమారు అవుతున్నాయి. ఫ్లోరా షైనీ, రాము రాథోడ్‌లు నువ్వా, నేనా అన్నట్లుగా తలపడుతున్నారు. ఈ రోజు ఓటింగ్‌లో రాము రాథోడ్ (26.8 శాతం) ఓటింగ్‌తో టాప్‌లో నిలిచాడు. ఆ తర్వాత ఫ్లోరా షైనీ (26 శాతం), హరిత హరీశ్ (18 శాతం), పవన్ కళ్యాణ్ పడాల (13.5 శాతం), రీతూ చౌదరి (10 శాతం), ప్రియా శెట్టి (8 శాతం) ఓటింగ్‌తో నిలిచినట్లు నెటిజన్లు చెబుతున్నారు.

డేంజర్ జోన్‌లో ముగ్గురు
మొత్తంగా ఈ వారం ముగ్గురు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ముందుగా చెప్పుకోవాల్సింది పడాల పవన్ కళ్యాణ్. సోల్జర్‌గా బిగ్‌బాగ్ అగ్నిపరీక్షలో సత్తా చాటిన పవన్.. మెయిన్ హౌస్‌లో ఖచ్చితంగా విన్నర్ మెటీరియల్‌ అనిపించుకున్నాడు. అయితే మనోడు మాత్రం రీతూతో తిరగడం, ఓదార్పు యాత్రలు, అమ్మాయిలతో తిరగడంతో కాలం గడుపుతున్నాడు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగబోతోందని గాసిప్స్ వస్తున్నాయి. రీతూ చౌదరి, ప్రియా శెట్టిలు ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. ప్రియాశెట్టికి ఓటింగ్ దారుణంగా పడిపోయింది, ఆమె వాయిస్ తప్పించి గేమ్ మాత్రం ఆడటం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రియ కూడా ఈ వారం ఎలిమినేట్ అయ్యే లిస్ట్‌లో ఉన్నారని గాసిప్స్ వస్తున్నాయి.

ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్?
ఇక రీతూ చౌదరిపై నెగిటివిటీ బాగా పెరిగిందని, ఇటీవల ఓ హీరోకి, అతని భార్యకి మధ్య జరిగిన గొడవల్లో ఆమె పేరు రావడంతో ఆమెకు ఓట్లు పడటం లేదని అంటున్నారు. ఈ పరిణామాలతో రీతూ చౌదరి డేంజర్‌ జోన్‌లో ఉన్నారని బిగ్‌బాస్ లవర్స్ చెబుతున్నారు. డబుల్ ఎలిమినేషన్ జరిగితే ప్రియ, రీతూలు ఎలిమినేట్ అవుతారని.. లేనిపక్షంలో సింగిల్ ఎలిమినేషన్ జరిగితే రీతూని ఎలిమినేట్ చేస్తే, ప్రియ సేవ్ అవుతారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X