Bigg Boss Telugu 6th Week Voting: ఓటింగ్‌లో అనూహ్య మార్పులు.. తనూజ గ్రాఫ్ డౌన్.. డేంజర్ జోన్‌లో ఉన్నదెవరంటే?
Bigg Boss Telugu 6th Week Voting: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రతి రోజు ఊహించని కొత్త మలుపులు, కొత్త ట్విస్టులతో ఈ రియలిటీ షో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో బిగ్‌బాస్ హౌస్ స్వరూపమే మారిపోయింది. ఇదిలాఉంటే.. ఆరోవారం ఓటింగ్ ఫలితాల్లో అనూష్య మార్పులు అభిమానులను షాక్‌కు గురిచేశాయి. ఇప్పటివరకు స్థిరంగా ఉన్న ఓటింగ్ ట్రెండ్స్ ఒక్కసారిగా మారిపోయాయి. ఈ వారం ఎవరికి హౌస్ గుడ్‌బై చెప్పబోతున్నారన్న హై టెన్షన్ క్రియేట్ అయింది. ఆ వివరాల్లోకెళ్తే..
బిగ్ బాస్ సీజన్ 9 రీలాంచ్ అయింది. ఆదివారం ఎపిసోడ్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్‌కి కొత్త ఉత్సాహం వచ్చిందని అందరికీ తెలిసిన విషయమే. కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లు - ఆయేషా జీనత్, దివ్వెల మాధురి, రమ్య మోక్ష, శ్రీనివాస్ సాయి, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా లు మొదటి రోజు నుంచే షోలో హీట్ తెచ్చారు. వీరిలో దివ్వెల మాధురి, రమ్య మోక్ష, ఆయేషా సెంటర్ ఆఫ్ ది షోగా మారిపోయారు. ఇక దివ్వెల మాధురి బిగ్ బాస్ లో హౌస్ తన రూలింగ్ ప్రారంభించింది. తన రూల్స్ పాటించకపోతే.. వెళ్లిపోవాలంటూ కంటెస్టెంట్లకు మాస్ వార్నింగ్ ఇచ్చేసింది.

ఇక రమ్య మోక్ష అయితే.. తన జోలికి వస్తే.. కొట్టిపడేస్తా అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. మరోవైపు తమిళ బిగ్ బాస్ ను షేక్ చేసిన ఆయేషా.. తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్లకు చుక్కులు చూపిస్తోంది. వచ్చి రాగానే.. డివైండ్ అండ్ రూల్ పాలసీని అమలుపరిచింది. బాండింగ్స్ అంటూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అయినా భరణి, తనూజ లను టార్గెట్ చేసింది. తన మైండ్ గేమ్స్ తో మేల్ కంటెస్టెంట్లను కూడా టార్గెట్ చేసింది. తన ఓ చూపులతో డిమాన్ పవన్ ను ప్లాట్ చేసింది. కెప్టెన్ కళ్యాణ్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇలా పాత కంటెస్టెంట్లకు టెన్షన్ పెడుతున్నారు. ఇదే టెన్షన్ ఓటింగ్ ట్రెండ్స్‌లో కూడా కనిపిస్తోంది.
"బాల్ ఆన్ ఫైర్" టాస్క్ తో ఈ వారం నామినేషన్స్ రసవత్తరంగా సాగాయి. నామినేట్ అయిన వారిలో డిమోన్ పవన్, తనూజ గౌడ, సుమన్ శెట్టి, దివ్య నిఖిత, భరణి శంకర్, రాము రాథోడ్ ఉన్నారు. మొదట్లో తనూజ గ్రాఫ్ టాప్‌లో ఉండగా, ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయింది. సోషల్ మీడియాలో, అనధికార పోలింగ్ సైట్లలో వస్తున్న అంచనాల ప్రకారం సుమన్ శెట్టి 23.5 శాతం ఓట్లతో మొదటి స్థానంలోకి దూసుకెళ్లాడు. అతనికి దగ్గరగా 22.97 శాతం ఓట్లతో డిమోన్ పవన్ రెండో స్థానంలో ఉన్నాడు. మొదటి వారం నుంచే స్ట్రాంగ్‌గా ఉన్న తనూజ గౌడ 21 శాతం ఓట్లతో మూడో స్థానంలోకి పడిపోయింది. ఈ ముగ్గురు ప్రస్తుతం సేఫ్ జోన్‌లో ఉన్నారని బిగ్ బాస్ అభిమానులు భావిస్తున్నారు.
కానీ, గేమ్‌లో అనూహ్య మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి. తక్కువ ఓటింగ్ తో భరణి శంకర్ ఈసారి డేంజర్ జోన్‌లో నిలిచారు. అతనికి కేవలం 12.65 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక రాము రాథోడ్, దివ్య నిఖిత ఇద్దరికీ 9.5 శాతం చొప్పున ఓట్లు రావడంతో వీరిద్దరూ కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారని చెప్పవచ్చు. బిగ్ బాస్ రివ్యూయర్స్ అంచనా ప్రకారం ఈ వారం రాము రాథోడ్ లేదా దివ్య నిఖితలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.
వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో గేమ్ డైనమిక్స్ పూర్తిగా మారిపోవడంతో పాత కంటెస్టెంట్లకు సేఫ్ జోన్ హామీ ఇవ్వలేమని అంటున్నారు. ఇక అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు సపోర్ట్ చేస్తూ క్యాంపెయిన్లు చేస్తున్నారు. ఎవరికి ఫైనల్‌గా హౌస్ గుడ్‌బై చెప్పాలనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. కానీ ఈ వారం ఓటింగ్‌లో జరిగిన ఈ అనూహ్య మార్పులు బిగ్ బాస్ హౌస్‌లో గేమ్ కొత్త మలుపు తిరిగిందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











