Elimination: బిగ్‌బాస్‌లో 6వ వారం ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. ఆ ఇద్దరు డేంజర్ నుంచి తప్పించుకోవాలంటే?

బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షో 6వ వారం ముగింపు దశకు చేరుకొన్నది. ఫైర్ స్ట్రామ్ పేరుతో 6 గురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డు ద్వారా ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆట తీరు ఊహించని విధంగా మారిపోయింది. వైల్డ్ కార్డు ఎంట్రీల తర్వాత ఇంటిలో వాతావరణం ఘాటుగా, అంచనాలను మంచి ఘర్షణ వాతావరణం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో 6వ వారం నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. అయితే ఈ వారం ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యే వారు ఎవరు? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారనే విషయంలోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ ఆరంభమైనప్పటి నుంచి 5 వారాల్లో 6 గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం శ్రష్టి వర్మ, రెండో వారం మర్యాద మనీష్, మూడో వారం ప్రియా శెట్టి, నాలుగో వారం హరిత హరీష్ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అయితే 5వ వారంలో షాకింగ్‌గా డబుల్ ఎలిమినేషన్ చేశారు. దాంతో ఇంటి నుంచి ఫ్లోరా సైనీ, శ్రీజ దమ్ము ఎలిమినేట్ అయ్యారు.

Bigg Boss Telugu 9 Week 6th Elimination

ఇక 6వ వారంలో నామినేషన్ల ప్రక్రియ ఘాటుగా సాగింది. ఈ వారం మొత్తం 6 గురు నామినేట్ అయ్యారు. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అర్హత ఉన్నట్టు భావిస్తున్న వారిలో తనుజా పుట్టస్వామి, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, దివ్య నిఖిత, భరణి శంకర్, రాము రాథోడ్ ఉన్నారు. అయితే ఈ వారం టాప్ కంటెస్టెంట్లు నామినేట్ కావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంపై ఆసక్తి పెరిగింది.

ఇక ఈ వారం నామినేషన్లలో ఉన్న వారిలో తనుజా టాప్ రేంజ్‌లో ఓటింగ్ సంపాదించుకొన్నారు. ఆమెకు 32 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక సుమన్ శెట్టి రెండో స్థానంలో నిలిచి 25 శాతం ఓట్లు సంపాదించుకొన్నారు. ఆ తర్వాత డీమాన్ పవన్‌కు 15 శాతం ఓటింగ్, దివ్య నిఖితకు 11 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక చివరి రెండుస్థానాల్లో భరణి 10 శాతం, రాము రాథోడ్ 10 శాతంతో డేంజర్ జోన్‌లో ఉన్నారు.

ఇక ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం ఉన్న వారిలో భరణి శంకర్, రాము రాథోడ్ ఉన్నట్టు సమాచారం. ఈ వారం ఏదైనా ట్విస్టు జరిగితే తప్పా.. ఈ ఇద్దరిలో ఒకరు సేవ్ కావడం జరుగుతుంది. కాల్ డేటా ద్వారా ఏదైనా భారీగా ఓటింగ్ వస్తే.. ఇద్దరు ఎలిమినేషన్ నుంచి తప్పించుకొని మరొకరు డేంజర్ జోన్‌ ఉండే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X