Bigg Boss Telugu 7th Week Elimination: షాకింగ్‌గా బిగ్‌బాస్ తెలుగు ఓటింగ్.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు

బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షో 7వ వారంలోకి దిగ్విజయంగా అడుగుపెట్టింది. గత 5వ వారాలుగా నత్తనడక సాగిన ఈ గేమ్ షో.. 6వ వారం నుంచి జోష్‌ను పెంచింది. ఇంటిలోకి ఆరుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా అడుగుపెట్టడంతో ఇళ్లు వైబ్ మారిపోయింది. అయితే 6వ వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీలతో హౌస్ హంగామాగా మారింది. అయితే ఇంటి సభ్యుల మధ్య విభేదాలు, అలకలు, గొడవల మధ్య 7వ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. అయితే ఈ వారం నామినేట్ అయింది ఎవరు? వారికి నమోదైన ఓటింగ్ వివరాలు ఏమిటనే విషయంలోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 9 ఇంటి నుంచి అనూహ్యంగా టాప్ కంటెస్టెంట్ భరణి శంకర్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే అందరూ టాప్ 5 కంటెస్టెంట్‌గా భావిస్తున్న ఆయన ఎలిమినేట్ కావడం అందర్నీ షాక్ గురి చేసింది. ఇప్పటి వరకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారిలో శ్రష్టి వర్మ,న, మర్యాద మనీష్, ప్రియా, హరిత హరీష్, శ్రీజ దమ్ము, ఫ్లోరా సైనీ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు.

Bigg Boss Telugu 9 Week 7th Elimination

ఇక 7వ వారం నామినేషన్ ప్రక్రియ ఘాటుగా, జోరుగా సాగింది. వైల్డ్ కార్డు ఎంట్రీలకు లభించిన పవర్ అస్త్రాలను ఉపయోగించి నామినేషన్ ప్రక్రియను కంటెస్టెంట్లు కొనసాగించారు. ఆయేషా తనకు లభించిన అస్త్రాన్ని ఉపయోగించి డైరెక్టుగా నామినేట్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. దాంతో ముఖానికి ఫోమ్ పూసి ఇంటి సభ్యులు నామినేట్ చేశారు. అయితే ఆయేషా తనకు లభించిన పవర్‌ను ఉపయోగించి.. రీతూ చౌదరీని నామినేట్ చేశారు. ఈ సందర్భంగా భారీగానే వాగ్వాదం జరిగింది.

నామినేషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ వారం ఓటింగ్ జోరుగా మొదలైంది. ఈ వారం ఓటింగ్ ప్రక్రియలో టాప్ గేర్‌లో సాగింది. తనూజ, సంజన గల్రానీ, రీతూ చౌదరీ, రమ్య కు టాప్ ఓటింగ్ నమోదైంది. ఇక ఈ వారం ఎలిమినేష్ ముప్పు ఎదుర్కొంటున్న వారిలో రాము యాదవ్, శ్రీనివాస్ సాయి, పవన్ కల్యాణ్ ముందు వరుసలో ఉన్నారు.

ఓటింగ్ వివరాలను పరిశీలిస్తే.. తనుజాకు అత్యధికంగా 40 శాతం ఓటింగ్, కల్యాణ్ పడాలకు 25 శాతం ఓటింగ్, సంజన గల్రానీకి 10 శాతం ఓటింగ్, దివ్య నిఖితకు 10 శాతం, రాము రాథోడ్‌కు 8 శాతం, రీతూ చౌదరీకి 7 శాతం, శ్రీనివాస సాయికి 5 శాతం, రమ్య మోక్షకు 4 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే తొలి రోజు కాబట్టి ఈ ఓటింగ్ విషయం లో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X