Bigg Boss Telugu 9: వైల్డ్ కార్డ్‌తో బిగ్‌బాస్‌లోకి దివ్వెల మాధురి? ఎంట్రీకి ముందే కంటెస్టెంట్స్‌కి వార్నింగ్
బిగ్‌బాస్ తెలుగు 9 ఈ సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమై ఉత్కంఠగా సాగుతోంది. 9 మంది సెలబ్రెటీలు, ఆరుగురు కామనర్స్‌తో కలిపి మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెట్టారు. గత సీజన్ అనుభవంతో ఈసారి జనానికి బాగా తెలిసినవారినే హౌస్‌లోకి పంపడంతో ఈసారి బిగ్‌బాస్‌కు ఓ లుక్ వచ్చినట్లుగా అభిమానులు భావిస్తున్నారు. దీనికి తోడు బిగ్‌బాస్ అగ్నిపరీక్షతో కామనర్స్‌తో కూడా హౌస్‌లోకి వచ్చి సత్తా చాటుతున్నారు.
త్వరలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు
బిగ్‌బాస్ తెలుగు 9లో తొలి వారం శ్రష్టి వర్మ, రెండో వారం మర్యాద మనీష్, మూడో వారం ప్రియా శెట్టి, నాలుగో వారం హరిత హరీశ్‌లు ఎలిమినేట్ అయ్యారు. రెండ్రోజుల్లో ఐదో వారం కూడా ముగియనుంది. ఈ వారం కూడా ఒకరు ఎలిమినేట్ అయితే హౌస్‌లో ఐదు బెర్త్‌లు ఖాళ అవుతాయి. అయితే గత సీజన్‌లలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లో అడుగుపెట్టిన వారు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచారు. ఈ నేపథ్యంలో తాజా సీజన్‌లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని లీకులు వచ్చాయి. దానికి తగినట్లుగానే బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫైనలిస్ట్ దివ్య నిఖిత హౌస్‌లో అడుగుపెట్టింది. త్వరలో వైల్డ్ కార్డ్ ద్వారా మరిన్ని ఎంట్రీలు ఉంటాయని చెబుతున్నారు.

వైల్డ్ కార్డ్ ద్వారా ఎంత మంది అంటే?
అక్టోబర్ 12వ తేదీన వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా ఆరుగురు కంటెస్టెంట్స్ బిగ్‌బాస్‌లో అడుగుపెడతారని చెబుతున్నారు. వీరిలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, బుల్లితెర నటులు ఉన్నారు. వారే దివ్వెల మాధురి, అలేఖ్య చిట్టి పికెల్స్ రమ్య మోక్ష, ఆయేషా జీనత్, శ్రీనివాస సాయి, గౌరవ్ గుప్తా, నిఖిల్ నాయర్. వీరిలో ప్రత్యేకంగా కనిపిస్తున్నది మాత్రం దివ్వెల మాధురియే. ఎప్పుడు బిగ్‌బాస్ సీజన్ మొదలవుతున్నా ఈమె పేరు కంటెస్టెంట్స్ లిస్ట్‌లో ఉంటుంది. బిగ్‌బాస్ తెలుగు 9వ సీజన్ ప్రారంభానికి ముందు కూడా మాధురి గురించి ఊహాగానాలు వినిపంచాయి. కానీ లాంచింగ్ ఎపిసోడ్ రోజున ఆమె జాడ కనిపించలేదు.
దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలిగా పాపులర్
ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ మాజీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలిగా తొలుత జనానికి పరిచయమయ్యారు దివ్వెల మాధురి. శ్రీనివాస్‌కు ఆల్రెడీ పెళ్లయి, పిల్లలు ఉన్నారు. అయితే మాధురితో ఆయన రిలేషన్, వీరి కుటుంబ తగాదాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో మాధురికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ లో దివ్వెల మాధురి కంటెస్టెంట్‌గా అడుగుపెడతారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దివ్వెల మాధురి బిగ్‌బాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నాతో అంత ఈజీ కాదు
బిగ్‌బాస్ నుంచి తమకు ఆఫర్ వచ్చినమాట వాస్తవమేనని మాధురి, శ్రీనివాస్‌లు అంగీకరించారు. బిగ్‌బాస్‌కి వెళితే ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉండాలని.. తాను అన్ని రోజులు నా రాజాకి దూరంగా ఉండలేనని మాధురి స్పష్టం చేశారు. అందుకే బిగ్‌బాస్ తెలుగు 9 ఆఫర్ రిజెక్ట్ చేశానని మాధురి వెల్లడించారు. అయితే కనీసం వైల్డ్ కార్డ్ ఎంట్రీగానైనా మాధురిని హౌస్‌లో అడుగుపెట్టించాలని బిగ్‌బాస్ టీమ్ శతవిధాలా ప్రయత్నిస్తోందట. అదే ఇంటర్వ్యూలో బిగ్‌బాస్‌లోకి వెళ్లడం సంగతి పక్కనపెడితే.. ఒకవేళ మీ గేమ్ ఎలా ఉంటుందని మాధురిని యాంకర్ ప్రశ్నించింది. దీనికి ఆమె ఆన్సర్ ఇస్తూ.. రియల్ లైఫ్‌లో ఎలా ఉందో గేమ్, అక్కడ కూడా అలాగే ఉంటుందని తేల్చేశారు మాధురి. ఎక్కడైనా మధు విన్నర్..... గెలిచే వస్తానని హాట్ కామెంట్స్ చేశారు. దీంతో తనతో ఆట అంత ఈజీ కాదని ఆల్రెడీ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి మాధురి వార్నింగ్ ఇచ్చినట్లయ్యింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇంతకీ మాధురి బిగ్‌బాస్‌లో అడుగుపెడతారో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











