బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ల విజేతలు.. వారికి అందిన ప్రైజ్ మనీ ఎంతనో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 9న సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ లాంచింగ్ కు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రియాలిటీ షోకు ఎవరు కంటెస్టెంట్స్ గా రాబోతున్నారు. ఈసారి హౌజ్ లో ఫీచర్స్ ఎలా ఉంటున్నాయి, ఎలాంటి టాస్క్ లతో కంటెస్టెంట్స్ అలరించబోతున్నారు అనే విషయాలపై ఆసక్తి నెలకొంది. మరికొన్ని గంటల్లో ఘనంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం కానుండటం విశేషం. ఇప్పటికే ఈ షో 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే ఇప్పటి వరకు బిగ్ బాస్ టైటిల్ విన్నర్లు ఎవరు? ఏఏ సీజన్ లో ఎవరు టైటిల్ అందుకున్నారు? వారికి ఎంత ప్రైజ్ మనీ అందిందనే వివరాల్లోకి వెళితే..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో నటుడు శివ బాలాజీ టైటిల్ ను అందుకున్నారు. 2017లో మొదటి సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్ కు గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. పూణెలోని లోనావాలాలో మొదటి సీజన్ కొనసాగింది. శివ బాలాజీ టైటిల్ ను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రూ.50 లక్షలు ప్రైజ్ మనీని అందించారు. అలాగే హౌజ్‌లో ప్రతి వారానికి రూ.1 లక్షకు పైగానే రెమ్యునరేషన్ అందుకున్నారు. ఇలా మరో 12 లక్షలు అందాయి. మొత్తంగా రూ.62 లక్షలు అందుకున్నారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విజేతగా కౌశల్ మండా నిలిచిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు 2 సీజన్ కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఇక టైటిల్ విన్నర్ కౌశల్ మండాకు ప్రైజ్ మనీని రూ.50 లక్షలు అందించారు. కౌశల్ మండా ఆ డబ్బులను తన తల్లి గుర్తుగా క్యాన్సర్ రోగుల సంక్షేమానికి విరాళంగా అందించారు. ఇక బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచారు. ఆయనను నాగార్జున, రాహుల్ సిప్లిగంజ్ ఇద్దరూ విన్నర్ గా ప్రకటించారు. రాహుల్ టైటిల్ తో పాటు రూ.50 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో హ్యాండ్సమ్ హీరో అభిజీత్ దుద్దాల టైటిల్ ను గెలుచుకున్నారు. ఈయనకు బిగ్ బాస్ ట్రోఫీతో పాటు రూ.25 లక్షల ప్రైజ్ మనీ అందించారు. జ్యూయెల్లరీ, కారును కూడా బహుకరించారు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ ను యాక్టర్ వీజే సన్నీ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రూ.50 లక్షల ప్రైజ్ మనీ, బైక్, రూ.25 లక్షల విలువైన ప్లాట్ సహా బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రైజ్ ప్యాకేజీని అందుకున్నారు. ఇందులో ట్యాక్స్ లు పోను రూ.75 లక్షల వరకు అందుకున్నారు. అలాగే షోలో పాల్గొన్నందుకు 25 లక్షల వరకు పారితోషికం అందిందని తెలుస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 6లో స్టార్ సింగర్ రేవంత్ టైటిట్ ను అందుకున్నారు. అయితే ఈ సీజన్ లో టైటిల్ విన్నర్ కు కాకుండా రన్నరప్ కు రూ.40 లక్షలను ఆఫర్ చేశారు. దాంతో రేవంత్ ట్రోఫితో పాటు కేవలం రూ.10 లక్షల ప్రైజ్ మనీని మాత్రమే అందుకున్నారు. దాంతో పాటు రూ.25 లక్షల విలువైన ప్లాట్, రెమ్యూనరేషన్‌గా రూ.9.75 లక్షలు, రూ.13 లక్షలు విలువైన బ్రాండ్ న్యూ కారును సొంతం చేసుకున్నారు.
ఇక బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ టైటిల్ తో పాటు 35 లక్షల రూపాయల ప్రైజ్ మనీ, 15 లక్షల రూపాయల విలువైన జ్యూయెల్లరీ, ఒక లగ్జరీ కారు ను సొంతం చేసుకున్నారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ గా నిఖిల్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈయన బిగ్ బాస్ హిస్టరీలో అత్యధిక ప్రైజ్ మనీని అందుకున్నారు. ప్రతి సీజన్ లో సాధారణంగా వితేజతలకు రూ.50 లక్షల ప్రైజ్ మనీ ఉంటుంది. కానీ 8వ సీజన్ లో రూ.55 లక్షలు అందించారు. అలాగే వారానికి రూ.2.25 లక్షల రెమ్యునరేషన్, ఇలా 15 వారాల్లో రూ.33 లక్షలు అందుకున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి మొత్తంగా రూ.88 లక్షలు సంపాదించుకున్నారు.


Click it and Unblock the Notifications











