Don't Miss!
- News
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!!
- Finance
Telangana Budget: కీలక రంగాలకు కేటాయింపులు ఇలా.. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా..
- Sports
INDvsAUS : స్పిన్ పిచ్‌లతో భారత్‌కూ సమస్యే?.. రికార్డులు చూస్తే తెలిసిపోతోంది!
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss 5: పందులే గుంపులుగా ఆడతాయి.. షన్ను గ్యాంగ్ పరువు తీసేసిన ఆనీ మాస్టర్.. విశ్వరూపం
బిగ్ బాస్ హౌస్ లో ఎప్పటికప్పుడు వాతావరణం మారిపోతుంటుంది. కంటెస్టెంట్స్ టాస్క్ ల సమయంలోనే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉండాలి. ఇక నెగిటివ్ కామెంట్స్ రావడం కామన్ అని చెప్పవచ్చు. గేమ్ ఎంత పాజిటివ్ గా ఆడినా కూడా పరిస్థితులు కొన్నిసార్లు బ్యాలెన్స్ తప్పుతాయి. ఇక గ్రూపులు మెయింటెయిన్ చేస్తే మాత్రం కొన్ని సార్లు అవమానపడక తప్పదు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5లో త్రిమూర్తులుగా మంచి స్నేహితులుగా కొనసాగుతున్న వారిలో షణ్ముఖ్ జస్వంత్ జెస్సి సిరి ఉన్నారు. ఓ వర్గం నుంచి వీరికి మద్దతు బాగానే వస్తోంది కానీ గురువారం ఎపిసోడ్ లో అయితే కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. కెప్టెన్ టాస్క్ లో గొడవలు గట్టిగానే జరిగాయి. షన్ను గెలిచాడు కానీ ఆనీ మాస్టర్ కౌంటర్ కు అతను నోరు తెరవలేకపోయాడు.
Photo Courtesy: Star మా and Disney+Hotstar

కలిసికట్టుగా అడిగితే
బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి కూడా ప్రతి సీజన్లో కొంతమందిని గ్రూపులుగా ఏర్పడుతూ చివరివరకు ఆటను కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఆ ప్రణాళికలలో కొంతమంది సక్సెస్ అవుతున్నప్పటికీ కూడా మరికొందరు మాత్రం బొక్క బోర్లా పడుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఫ్రెండ్షిప్ అనేది ఎక్కువకాలం కొనసాగదు. ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా కంటెస్టెంట్స్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తుంది. కలిసికట్టుగా అడిగితే ప్రేక్షకులు కూడా మద్దతు ఇవ్వడానికి ఆలోచిస్తారు.

షన్ను గ్యాంగ్ రొమాన్స్
ఒక విధంగా బిగ్ బాస్ సీజన్ 5లో ఒక ఫ్రెండ్షిప్ బాండ్ అయితే ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంది. షణ్ముఖ్ జెస్సి సిరి ముగ్గురు కూడా మొదటి నుంచి కూడా కలిసికట్టుగా ఆడుతూ వస్తున్నారు. మధ్యలో షన్ను అలకపాన్పు ఎక్కిన ప్రతీ సారి కూడా సిరి ఓదారుస్తూ వస్తుంది. ఇక వీరి మధ్య లో వస్తున్న రొమాంటిక్ సన్నివేశాలు కొన్నిసార్లు చూడడానికి కూడా ఇబ్బందిగానే అనిపిస్తున్నాయి. కెమెరాలు ఎక్కువగా ఈ ముగ్గురు పైన ఫోకస్ అవుతుండడం విశేషం.

జెస్సి ఫెయిల్..
ఇక 8వ వారం చివరి కెప్టెన్సీ టాస్క్ లో మరోసారి వీరి రాజకీయాలు చాలా క్లారిటీగా బయటపడ్డాయి. మొత్తంగా చివరి టాస్క్ లో ఐదు మంది కంటెస్టెంట్స్ లో కెప్టెన్ పోటిదారులుగా నిలువగా అందులో సిరి షన్ను కూడా ఉన్నారు. ఇక ఐదు మంది పోటీదారులకు టాస్క్ లో సంచాలకుడిగా జెస్సి ఉండడం మరొక ట్విస్ట్ అని చెప్పాలి. ఆటలో అతను స్నేహితులకు మద్దతు తెలపడానికి లోలోపల చాలా మాధనపడ్డాడు. పైకి కనిపించకుండా చాలా బాగా హ్యాండిల్ చేశాడు కానీ చివరికి బిగ్ బాస్ చేతిలో చివాట్లు తిన్నాడు. మరొకసారి గేమ్ రూల్స్ ను తెలుసుకొని వచ్చి ఆడినప్పటికీ కూడా అతని సంచాలకుడిగా అయితే సక్సెస్ కాలేకపోయాడు.

ఆనీ మాస్టర్ ను టార్గెట్ చేసి..
చివరగా అని మాస్టర్ షణ్ముఖ్ జస్వంత్ సిరి ముగ్గురు కూడా పోటీలో నిలిచారు. ఒక సర్కిల్ లో తర్మకోల్ తో ఉన్న సంచి తగిలించుకొని తిరుగుతూ ఉండాలి. అయితే ఈ ఆటలో భాగంగా మరొకరి బ్యాగ్ లోనే తర్మకోల్ కింద పడేసే అధికారం కూడా ఉంటుంది. అయితే ఎవరికి వారు వారి సంచులు కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇక చివరికి మిగిలిన ఆనీ మాస్టర్ ను యశ్వంత్, సిరి ఇద్దరు కూడా టార్గెట్ చేశారు.
Recommended Video

పందులే గుంపులుగా..
షన్ను సిరి ఇద్దరు కూడా మళ్ళీ చివరి టాస్క్ లో గ్రూపులుగా ఏర్పడడం ఎవరికీ నచ్చలేదు. ఆనీ మాస్టర్ పై ప్రత్యేకంగా టార్గెట్ చేసే ఆమె సంచిని కింద పడేయాలని చూశారు. దీంతో ఆనీ మాస్టారు ఓపిక పట్టలేక చివరికి తన సంచిని కింద పడేసి టాస్క్ నుంచి వైదొలిగింది. ఆనీ మాస్టర్ చివరివరకు గట్టిగానే పోరాడింది కాని షన్ను సిరి కూడా పక్కాగా ప్లాన్ చేసి ఆడడం వలన ఆమె ఓపిక ఒక్కసారిగా కోల్పోయింది. పందులే గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్ గా వస్తుంది అంటూ వారిని పండులతో పోల్చింది. మొత్తానికి షణ్ముఖ్ అయితే ఈ వారం కెప్టెన్ గా నిలిచాడు.