Bigg Boss Telugu: బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలు.. డ్రగ్, క్రిమినల్ కేసుల ఎవరెవరిపై అంటే?

Bigg Boss Telugu Celebrities in Controversies: బిగ్‌బాస్ రియాలిటీ షో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతి ఇంటికి చేరువైన పాపులర్ షో. ప్రతి సీజన్ కొత్త కాన్సెప్ట్, ట్విస్టులు, కాంట్రవర్సీలు, లవ్ ట్రాక్స్ తో ముందుకు వస్తుంది. ప్రేక్షకులు ఈ షోని ఎంతగానో ఇష్టపడటానికి కారణం ఇదే. ఈ షో ద్వారా చాలా మంది సెలబ్రిటీలుగా పేరు సంపాదించుకున్నారు. టాలీవుడ్, టెలివిజన్ ఇండస్ట్రీలో ప్రాచుర్యం పొందిన అనేక మంది కంటెస్టెంట్లు బిగ్‌బాస్ హౌస్ ద్వారా తమ కెరీర్‌లో కొత్త దశలో అడుగుపెట్టారు. కానీ, అన్ని కథలూ సుఖాంతంతో ముగవు. బిగ్‌బాస్ లో పాల్గొన్న కొంతమంది సెలబ్రిటీలు డ్రగ్స్ కేసులు, క్రిమినల్ కేసులు, ఆస్తి స్కాంలు, మానీ లాండరింగ్ ఆరోపణలు వంటి వివాదాలకు సంబంధించి వార్తల్లో నిలిచారు. కొందరు కోర్ట్ కేసులు, దర్యాప్తులు, పోలీస్ విచారణలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలా కేసుల్లో ఇరుక్కొన్న బిగ్ బాస్ సెలబ్రెటీలు ఎవరు? వారి కేసులు వివరాలేంటీ?

సంజన గల్రానీ

ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ సంజన గల్రానీ. తాజా సీజన్ 9 లో పాల్గొంటుంది. ఈ సౌత్ హీరోయిన్ సంజన గల్రానీపై 2020లో కర్ణాటకలో డ్రగ్స్ కేసు నమోదు అయ్యింది. నార్కోటిక్స్ అండ్ సైకట్రాపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ 1985 కింద ఆమెపై పిటిషన్ దాఖలయ్యింది. 2024 మార్చి 25న ప్రత్యేక లీవ్ పిటిషన్ ద్వారా కేసు రద్దు చేయాలని కోర్టు ముందుకు వచ్చారు. కర్ణాటక హైకోర్టు కేసుకు క్లీన్ చిట్ ఇచ్చినా, సుప్రీం కోర్ట్ నోటీసులు జారీ చేసింది. కోర్ట్ విచారణలో ఫోన్ డేటా, నగదు లావాదేవీలు, డ్రగ్స్ సరఫరాదారులతో సంబంధాలు పరిగణలోకి తీసుకోలేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు నిర్వాహకులు సంజనాను మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరిట రెండు రోజులు సీక్రెట్ రూమ్‌లో ఉంచి, తర్వాత తిరిగి ఇంట్లోకి తీసుకొచ్చి డ్రామా సృష్టించారు. సాధారణంగా ఆడియెన్స్ ఓటింగ్ లేకుండా ఎలిమినేషన్ జరగదు. కానీ కోర్టు కేసు కారణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.

Bigg Boss Telugu Celebrities in Controversies

శ్రష్టి వర్మ

తాజా సీజన్ బిగ్ బాస్ తెలుగు 9 లో పాల్గొంది లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ. అయితే.. ఆమెకు సరైన ఓటింగ్ రాకపోవడంతో మొదటి వీక్ ఎలిమినేట్ అయ్యింది. వాస్తవానికి మధ్యప్రదేశ్ చెందిన శ్రష్టి వర్మ పాపులర్ డ్యాన్స్ షో 'ఢీ' తన కెరీర్ ప్రారంభించింది. తరువాత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసింది. ఆ తరువాత జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా జానీ మాస్టర్ ప్రవర్తించారని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు ఫలితంగా జానీ అరెస్ట్ అయ్యి, కొద్ది రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. జానీ కేసును ఖండిస్తూ కొన్ని వ్యక్తులు కుట్ర చేశారని తెలిపారు. ఇప్పటికి ఈ కేసు కొనసాగుతోంది. శ్రష్టి వర్మ కూడా కొరియోగ్రాఫర్‌గా అవకాశాలు పొందుతోంది.

రీతూ చౌదరి

బుల్లి తెర, వెండి తెరలో పాపులర్టీ పొందిన అమ్మడు రీతూ చౌదరి. ఆమె అసలు పేరు వనం దివ్య. కెరీర్ కోసం పేరు మార్చి రీతూ చౌదరిగా పరిచయం అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు బిగ్ బాస్ తెలుగు 9 లో పాల్గొంటుంది. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టక ముందు లాండ్ స్కాంలో ఆమె పేరు వినపడింది. సుమారు 700 కోట్ల విలువ చేసే ఆస్తులు చీమకుర్తి శ్రీకాంత్ అక్రమంగా రిజిస్టర్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే రీతూ మాత్రం శ్రీకాంత్‌తో సంబంధం లేదని చెబుతోంది. పెళ్లి విషయంపై పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. రీతూ రెండేళ్ల క్రితం శ్రీకాంత్‌తో ఫోటోలు, వీడియోలు షేర్ చేసినప్పటికీ, ఇప్పుడు ఆమె తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా బెట్టింగ్ యాప్స్ కేసులో కూడా రీతూ చౌదరి విచారణ ఎదుర్కొంది.

ముమైత్ ఖాన్

ముమైత్ ఖాన్ ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. ఈ బ్యూటీ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ బాస్ సీజన్‌ 1లో పాల్గొంది. ఈ సీజన్ లో రెండోవారంలో ఎలిమినేట్ అయిన ముమైత్ ఖాన్‌ని సీక్రెట్ రూంలో పెట్టి మళ్లీ హౌస్‌లోకి పంపారు. ఆ తరువాత ఫిఫ్టీ ఎపిసోడ్‌ల వరకూ ఆమెను కంటిన్యూ చేశారు. ఈ షోతో ముమైత్ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక నటి ముమైత్ ఖాన్ డ్రగ్స్ - మనీలాండరింగ్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సమయంలో బ్యాంక్ లావాదేవీలు, డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో సంబంధాలు, ఎఫ్‌క్లబ్‌లో పార్టీల హాజరు, మాదకద్రవ్య వినియోగం వంటి అంశాలపై ప్రశ్నలు ఎదుర్కొన్నారు.

నవదీప్

సినీ హీరో నవదీప్ బిగ్ బాస్ సీజన్ 1 లో పాల్గొన్నారు. టాప్ 5 ఒకరిగా నిలిచారు. హీరో నవదీప్ 2017లో డ్రగ్స్ కేసులో విషయంలో వివాదం ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈడీ (Enforcement Directorate)ముందు హాజరయ్యాడు. పలు సార్లు విచారణ ఎదుర్కొన్నారు. ఈ కేసు గుడిమల్కాపూర్ / మాదాపూర్ డ్రగ్స్ కేసుతో సంబంధం కలిగి ఉంది. నైజీరియన్ డ్రగ్ పేడ్లర్లు, తెలుగు సినీ నిర్మాతలు వెంకటరత్నారెడ్డి, రాంచందర్‌లతో సంబంధాలు ఉన్నందున నవదీప్ పేరు బయటకు వచ్చింది. పోలీసుల నివేదికల ప్రకారం, ఆయన 29వ నిందితుడిగా నమోదు అయ్యాడు. అయితే.. నవదీప్ డ్రగ్స్ ఉపయోగించలేదని, ఆర్థిక లావాదేవీల మాత్రమే జరిపినట్లు టాక్.

తనీష్

నటుడు తనీష్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో పాల్గొన్నారు. తన ఆట తీరులో టాప్ 5 లో ఒకరిగా నిలిచారు. ఇదిలా ఉంటే.. తనీష్ కూడా టాలీవుడ్ డ్రగ్స్-మనీలాండరింగ్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరయ్యాడు. అనుమానాస్పద లావాదేవీలు, డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో సంబంధాలు, ఎఫ్‌క్లబ్ పార్టీల హాజరు, మాదకద్రవ్య సరఫరా, ఇతర సెలబ్రిటీలతో సంబంధాలు వంటి అంశాలపై ప్రశ్నలు ఎదుర్కొన్నారు. తనీష్ మీడియాకు పేర్కొన్నట్లుగా, అతనికి కెల్విన్‌తో ఎలాంటి పరిచయం లేదు, ఎఫ్‌క్లబ్‌లో హాజరుకాలేదని, ఈడీ విచారణ తేలింది..

లోబో

బిగ్‌బాస్ స్టార్ లోబో 2018లో హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రధాన నిందితుడు. ఈ కేసులో జనగామ కోర్టు అతనికి ఏడాది జైలు శిక్ష, రూ.12,500 జరిమానా విధించింది. సోషల్ మీడియాలో ఫేమ్ పొందిన లోబో, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ద్వారా నటుడిగా గుర్తింపు పొందాడు.

విష్ణుప్రియ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ విష్ణుప్రియ. ఈ అమ్మడు పలు షోలకు యాంకర్ గా వ్యవహరించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఫేమ్ తో యాంకర్ విష్ణుప్రియ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. విష్ణుప్రియ మూడు యాప్స్ ప్రమోషన్ చేశారని అంగీకరించినప్పటికీ, మొత్తం 15 యాప్స్ ప్రమోషన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో యాప్‌కు రూ.90,000 ఫీజు వసూలు చేసినట్లు వెల్లడయ్యింది. పోలీసులు బ్యాంక్ స్టేట్‌మెంట్లు, డబ్బు లావాదేవీలు పరిశీలించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాప్స్ ప్రమోషన్ కూడా గుర్తించారు.

More from Filmibeat

Read more about: bigg boss sanjana navadeep
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X