»   » ‘బిగ్ బాస్’ ముళ్ల కుర్చీ: ఆదర్శ్‌ మనసు గాయపరిచిన శివ బాలాజీ!

‘బిగ్ బాస్’ ముళ్ల కుర్చీ: ఆదర్శ్‌ మనసు గాయపరిచిన శివ బాలాజీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాటీవీలో ప్రసారం అవుతున్న 'బిగ్ బాస్' రియాల్టీ షో మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలో విజయవంతంగా రన్ అవుతోంది. మంగళవారం ప్రసారం అయిన బిగ్ బాస్ ఎపిసోడ్ 24 ప్రేక్షకులను పెద్దగా ఎంటర్టెన్ చేయలేక పోయింది.

ఈ ఎపిసోడ్లో బిగ్ బాస్ సూచన మేరకు 'ముళ్ల కుర్చీ' టాస్క్ కత్తి మహేష్ ఆధ్వర్యంలో సాగింది. ఇందులో భాగంగా ఇంటి సభ్యులు రెండు గ్రూఫులుగా విడిపోయి ఈ గేమ్ ఆడారు. టీం 'ఏ'లో అర్చన, ప్రిన్స్, హరితేజ, శివ బాలాజీ, కల్పన...... టీం 'బి' తరుపున ధనరాజ్, ముమైత్ ఖాన్, ఆదర్శ్, కత్తి కార్తీక, దీక్షా పంత్ ఈ గేమ్ ఆడారు.

ముళ్లకుర్చీ

ముళ్లకుర్చీ

బిగ్ బాస్ సైరన్ మ్రోగగానే టీం ‘ఏ' సభ్యులు కుర్చీల్లో కూర్చోవాల్సి ఉంటుంది. వారిని కుర్చీ నుండి లేపే ప్రయత్నం ప్రత్యర్థి టీం చేయాలి. వాళ్ల ప్రయత్నాలకు లొంగకుండా.... ఎక్కువ సమయం కుర్చీల్లో కూర్చున్న టీం విజేతలు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా...

ఎన్ని ప్రయత్నాలు చేసినా...

టీం ‘ఎ' ఇంటి సభ్యులను కుర్చీ నుండి లేపడానికి టీం ‘బి' సభ్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కుర్చీ నుండి లేపలేక పోయారు. బిగ్ బాస్ సైరన్ మ్రోగే వరకు పూర్తి సమయం కుర్చీలో కూర్చుని విజయవంతంగా టాస్క్ పూర్తి చేశారు.

Bigg Boss Telugu : Kalpana Facing Elimination, 6 Members Nominated
భయ పెట్టిన బల్లి

భయ పెట్టిన బల్లి

కుర్చీ నుండి అర్చనను లేపే క్రమంలో ఆమెను భయ పెట్టేందుకు గోధుమ పిండితో తయారు చేసిన బల్లిని ప్రయోగించారు టీం ‘బి'. అది చూసిన అర్చన నిజం బల్లి అనుకుని భయంతో అల్లాడిపోయింది.

సూసూ ఆపుకోలేని ధన, ముమైత్

సూసూ ఆపుకోలేని ధన, ముమైత్

తర్వాత టీం ‘బి' ఆట మొదలైంది. అయితే వీరు ముళ్లకుర్చీ టాస్క్ ను విజయవంతంగా పూర్తి చేయలేక పోయారు. ముమైత్ ఖాన్, ధనరాజ్ సూసూ ఆపుకోలేక పూర్తి సమయం గడవక ముందే కుర్చీ నుండి లేచి టాయిలెట్‌ వైపు పరుగులు పెట్టారు. దీంతో టీం ‘బి' ఓటమిపాలు కాక తప్పలేదు.

ఆదర్శ్ మనసు గాయపర్చిన శివ బాలాజీ

ఆదర్శ్ మనసు గాయపర్చిన శివ బాలాజీ

గేమ్ ఆడే క్రమంలో శివ బాలాజీ ఆదర్శ్ మధ్య చిన్న వివాదం చోటు చేసుకుంది. అయితే శివ బాలాజీ వ్యక్తిగత దూషణకు దిగడంతో ఆదర్శ్ మనసు గాయపడింది. దీంతో ఆదర్శ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ధనరాజ్ కల్పించుకుని శివ బాలాజీ సారీ చెప్పడంతో ఆదర్శ్ కూల్ అయ్యారు.

మిగతాది రేపు...

మిగతాది రేపు...

అయితే ఓడిపోయిన టీం ‘బి'కి ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది బుధవారం జరిగే ఎపిసోడ్లో బిగ్ బాస్ వెల్లడించనున్నారు.

English summary
Bigg Boss divides the contestants into two teams and sets up Simhasanas in the house. Later, Shiva Balaji insults Adarsh till the latter breaks down.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu