»   » బిగ్ బాస్‌: ఆ నలుగురు చాలా వరస్ట్, అందుకే శిక్ష!

బిగ్ బాస్‌: ఆ నలుగురు చాలా వరస్ట్, అందుకే శిక్ష!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోకు సంబంధించి బుధవారం ప్రసారం అయిన 25వ ఎపిసోడ్‌ ఎలాంటి వివాదాలు లేకుండా సింపుల్‌గా సాగింది. అంతకు ముందు రోజు బిగ్ బాస్ ఇచ్చిన 'ముళ్ల కుర్చీ' టాస్క్‌‌లో రెండు జట్ల పెర్ఫార్మెన్స్ ఏమంత గొప్పగా లేదని బిగ్ బాస్ అంతృప్తి వ్యక్తం చేశారు.

రెండు జట్ల మధ్య జరిగిన టాస్క్‌లో మీడియేటర్‌గా ఉన్న మహేష్ కత్తి కొందరి వైపు పక్షపాతంగా వ్యవహరించాడని బిగ్ బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ముళ్ల కుర్చీ టాస్క్‌లో అత్యంత వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన నలుగురికి శిక్షలు విధించారు.

ఆ నలుగురూ..

ఆ నలుగురూ..

ముళ్ల కుర్చీ టాస్క్‌లో వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన నలుగురు వ్యక్తులను ఎంపిక చేసే బాధ్యత ఇంటి సభ్యులకే అప్పగించారు. ముమైత్ ఖాన్, మహేష్ కత్తి, ధనరాజ్, ఆదర్శ్‌లకు శిక్షలు విధించారు.

Bigg Boss Telugu : Hari Teja out From of Bigg Boss show
షూ పాలిష్, బట్టలు ఉతకడం

షూ పాలిష్, బట్టలు ఉతకడం

ఈ నలుగురు వరస్ట్ పెర్ఫార్మర్స్‌కు షూ పాలిష్, బట్టలు ఉతకడం లాంటి శిక్షలు విధించారు. షూ పాలిష్ శిక్షను ధనరాజ్, ముమైత్ ఖాన్ స్వీకరించగా.... బట్టలు ఉతికే శిక్షను మహేష్ కత్తి, ఆధర్శ్ స్వీకరించారు.

గెలిచిన టీం సభ్యులకు

గెలిచిన టీం సభ్యులకు

గెలిచిన టీం సభ్యులకు తమకు ఇష్టమైన తిండి పదార్థాలను ఎంచుకునే అవకాశం కల్పించారు బిగ్ బాస్. ఈ పదార్థాలు ఎంపిక చేసుకునే ప్రక్రియ ఫన్నీగా సాగింది. శివ బాలాజీ కళ్లకు గంతలు కట్టుకుని హరితేజ సూచనలు ఫాలో అవుతూ....తమకు ఇష్టమైన పదార్థాల పేర్లు రాసిన ఉన్న చెక్కముక్కలను నోటితో కుక్కలాగా కరుచుకుని తేవడం లాంటి వాటితో ఫన్నీగా సాగింది.

మసాలా తగ్గింది

మసాలా తగ్గింది

బిగ్ బాస్ షో రాను రాను పేలవంగా సాగుతోందని... మొదటి, రెండు, మూడు వారాల ఎపిసోడ్లతో పోలిస్తే నాలుగోవారం బిగ్ బాస్ షో సాగుతున్న తీరు చాలా పేలవంగా ఉందని, షో ఇలానే సాగితే ప్రేక్షకుల్లో ఈ షోపై ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

English summary
Who Are The Worst Four? Big Boss blames every contestants for their poor performances in that last few tasks and punishes four worst performers. What is the punishment? here the full episode details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu