»   » బిగ్ బాస్: బూతులు తిట్టిన ముమైత్, ఆటాడించిన ఎన్టీఆర్...

బిగ్ బాస్: బూతులు తిట్టిన ముమైత్, ఆటాడించిన ఎన్టీఆర్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రసారం అవుతున్న 'బిగ్ బాస్' రియాల్టీ షో శనివారం(ఆగస్టు 19) మరింత రసవత్తరంగా సాగింది. షోను హోస్ట్ చేస్తున్న ఎన్టీఆర్ ఇంటి సభ్యులతో కుర్చీలాట ఆడించారు. అనంతరం కామెడీ స్కిట్లు చేయించారు.

డిఫరెంటుగా సాగిన ఈ ఆట, కామెడీ స్కిట్లు ప్రేక్షకులను బాగా నవ్వించాయి. కుర్చీలాటలో అర్చన విజయం సాధించింది. ఈ గెలుపుకుగాను బిగ్ బాస్ ఆమెకు బిర్యానీ గిఫ్టుగా ఇచ్చాడు. దాన్ని ముగ్గురితో మాత్రమే పంచుకోవాలని నిబంధన విధించగా..... ముమైత్, హరితేజ, నవదీప్‌లతో బిర్యానీ షేర్ చేసుకుంది.

అదరగొట్టిన ధనరాజ్

అదరగొట్టిన ధనరాజ్

ఈ షోలో ముమైత్, ధనరాజ్ కలిసి కొన్ని స్కిట్లు చేశారు. ముమైత్ తన లాగే ఒరిజినల్‌గా నటించాలి... ధనరాజ్ ఇంట్లోని వివిధ సభ్యుల మాదిరిగా నటించి చూపించాలి అనే కాన్సెప్టుతో నిర్వహించిన ఈ స్కిట్లు ఇంటి సభ్యులతో పాటు షో చూస్తున్న ప్రేక్షకులను బాగా నవ్వించింది.

ధనరాజ్, హరితేజ సేఫ్

ధనరాజ్, హరితేజ సేఫ్

ఈ వారం మొత్తం నలుగురు సభ్యులు ఎలిమినేషన్‌కు నామినేట్ కాగా..... అందులో నుండి ధనరాజ్, హరితేజ సేఫ్ అయ్యారు. ముమైత్ ఖాన్, అర్చనలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆదివారం రాత్రి ప్రసారం అయ్యే షోలో ఎన్టీఆర్ వెల్లడిస్తారు.

తాప్సీ ఔట్

తాప్సీ ఔట్

అంతకు ముందు రోజైన శుక్రవారం ప్రసారం అయిన బిగ్ బాస్ వివరాల్లోకి వెళితే... తాప్సీ ఇంటి పరిస్థితులను పోటీదారులను అడిగితెలుసుకుంది. బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తరువాత ఏం నేర్చుకున్నారనగా ఒక్కొక్కరుగా అభిప్రాయాలను తెలియజేశారు. తాప్సీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చే సమయంలో ఇంటి సభ్యులంతా ఆమెతో సెల్పీ దిగారు.

కొత్త కెప్టెన్సీ కోసం పోటీ

కొత్త కెప్టెన్సీ కోసం పోటీ

అంతకు ముందు జరిగిన హోటల్ టాస్క్ ముగిసిన అనంతరం.... రాయల్ గెస్టులతో పాటు, ఇంటి సభ్యులకు కెప్టెన్ గా పోటీ చేసే అవకాశం దక్కింది. కెప్టెన్‌గా ఉండటానికి దీక్ష నిరాకరించడంతో నవదీప్ పోటీలో నిలిచారు. నవదీప్‌తో కెప్టెన్సీ కోసం పోటీపడేందుకు ముమైత్ ఖాన్‌ రంగంలోకి దిగింది.

విడిపోయిన ఇంటి సభ్యులు

విడిపోయిన ఇంటి సభ్యులు

ఓ చాలెంజింగ్ టాస్క్ ఇచ్చిన బిగ్‌బాస్ ఇది గెలిచిన వారికే కెప్టెన్సీ తెలిపారు. ఈ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయారు. నవదీప్ వైపు శివబాలాజీ, కత్తి కార్తీక, ధనరాజ్, దీక్షలు ఉండగా.... ముమైత్ వైపు ప్రిన్స్, ఆదర్శ్, హరితేజ, అర్చనలు నిలిచారు.

ఎగ్ టాస్క్

ఎగ్ టాస్క్

కెప్టెన్సీ పోటీలో భాగంగా ముమైత్, నవదీప్‌లకు రెండు ఎగ్స్ ఉన్న బౌల్స్ ఇచ్చారు. ఒకటీం, మరొక టీం ఎగ్స్ పగలగొట్టే ప్రయత్నం చేయాలి. చివరకు ఎవరి వద్ద ఎక్కువ ఎగ్స్ మిగిలితే వారే కెప్టెన్.

శృతి మించిన టాస్క్

ఇరు జట్లు టాస్క్ గెలిచే క్రమంలో.... కాస్త శృతి మించి ప్రవర్తించారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఇంట్లో కాస్త డ్యామేజ్ కూడా జరిగిపోయింది.

బాత్రూంలో దాక్కున్న నవదీప్

బాత్రూంలో దాక్కున్న నవదీప్

తన ఎగ్స్ కాపాడుకోవడానికి నవదీప్ బాత్రూంలో వెళ్లి దాక్కున్నాడు. ఆ తర్వాత నవదీప్ టీం సభ్యులు ముమైత్ ఖాన్ ఎగ్స్ పగలగొట్టే ప్రయత్నం చేసే క్రమంలో కాస్త ఓవర్ గా ప్రవర్తించారు.

బూతులు తిట్టిన ముమైత్

బూతులు తిట్టిన ముమైత్

నవదీప్ టీం మెంబర్స్ గేమ్‌లా ఆడకుండా తమపై దాడి చేసే ప్రయత్నం చేయడంతో ముమైత్ కోపం కట్టలు తెచ్చుకుంది. వారిని బూతులు తిట్టింది. అయితే ఆ బూతులు ప్రేక్షకులకు వినిపించకుండా సెన్సార్ కట్ చేశారు. శనివారం జరిగిన హోస్ట్ షోలో ఎన్టీఆర్ ముమైత్ బూతులు తిట్టిన విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం.

నవదీప్ కొత్త కెప్టెన్

నవదీప్ కొత్త కెప్టెన్

మొత్తానికి ఎలాగో అలా టాస్క్ గెలిచి ఇంటి కొత్త కెప్టెన్‍‌గా నవదీప్ బాధ్యతలు చేపట్టాడు.

English summary
Mumaith fights for captaincy against Navdeep. Bigg Boss gives the contestants a tough task. While performing it some of the contestants hurt themselves and start bleeding.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu