»   » బిగ్ బాస్ ఫైనల్ వీక్ డే 2: ఎమోషనల్ మూమెంట్స్

బిగ్ బాస్ ఫైనల్ వీక్ డే 2: ఎమోషనల్ మూమెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bigg Boss Telugu Final Week Day 2 : బిగ్ బాస్ చూపించిన వీడియోలకి దిమ్మ తిరిగింది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా సాగుతున్న అవుతున్న 'బిగ్ బాస్' తెలుగు రియాల్టీ షో ఫైనల్ వీక్‌లోకి ఎంటరైన సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా గ్రాండ్ ఫినాలే వీక్ రన్ అవుతోంది. ఫైనల్ వీక్ లో రెండో రోజైన మంగళవారం జరిగిన విశేషాలపై ఓ లుక్కేద్దాం.

బిగ్ బాస్ విన్నర్ టైటిల్ దక్కించుకునేందుకు పోటీ పడుతూ ఫైనల్ వరకు చేరిన హరితేజ, నవదీప్, శివ బాలాజీ, ఆదర్శ్, అర్చన గడిచిన 9 వారాల పాటు గేమ్ ఎలా ఆడారు అనేది బిగ్ బాస్ చూపించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో బిగ్ బాస్ విన్నర్‌గా వీరిలో ఎవరిని నిలబెట్టాలి అని ప్రేక్షకులు తీసుకునే నిర్ణయానికి తోడ్పడేలా మంగళవారం ఎపిసోడ్ జరిగింది.

ఒక్కొక్కరిని పిలిచి..

ఒక్కొక్కరిని పిలిచి..

ఇంటి సభ్యులను బిగ్ బాస్ ఒక్కొక్కరుగా యాక్టివిటీ రూమ్‌కు పిలిచారు. ఇన్నాళ్లు బిగ్ బాస్ ఇంట్లో వారు చేసిన ప్రయాణాన్ని, గేమ్ ఆడిన తీరును గుర్తు చేసి అభినందించారు.

ఎమెషనల్ మూమెంట్స్

ఎమెషనల్ మూమెంట్స్

బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇన్నాళ్లు ఇంట్లో తాము గడిపిన క్షణాలను బిగ్ బాస్ వీడియో రూపంలో చూపించారు. బిగ్ బాస్ ఇంట్లో తాము అనుభవించిన సంతోషం, కోపం, దుఖం, ప్రేమ, ఎమోషన్ లాంటి మూమెంట్స్‌ వారికి చూపించారు.

హ్యాపీ ఫీల్

హ్యాపీ ఫీల్

బిగ్ బాస్ ఇంట్లో ఇన్ని రోజుల పాటు తాము గడిపిన క్షణాలను వీడియో రూపంలో చూసి ఇంటి సభ్యులు చాలా సంతోష పడ్డారు. ఈ క్రమంలో అర్చన, హరితేజ, శివ బాలాజీ, ఆదర్శ్ ఆ మూమెంట్స్ గుర్తు చేసుకుని కాస్త ఎమోషనల్ అయ్యారు.

ఫిటింగ్స్ పెట్టే ప్రయత్నాల్లేవ్

ఫిటింగ్స్ పెట్టే ప్రయత్నాల్లేవ్

బిగ్ బాస్ చివరి వారం జరిగే తీరు చూస్తుంటే... ఈ వారం ఇంటి సభ్యుల మధ్య ఎలాంటి ఫిట్టింగ్స్, గొడవలు పెట్టే ఉద్దేశ్యంలో బిగ్ బాస్ ఉన్నట్లు కనిపించడం లేదు. అందుకే ఈ వారం అలాంటి టాస్కులు ఏమీ ఇవ్వడం లేదు.

ప్రేక్షకులకు సులభంగా

ప్రేక్షకులకు సులభంగా

ఎవరిని బిగ్ బాస్ తొలిసీజన్ విజేతగా ఎన్నుకోవాలి, ఇన్నాళ్లు వారి జర్నీ ఎలా సాగింది. ఎవరి మనస్తత్వాలు ఏమిటీ అని ప్రేక్షకులు ఒక నిర్ణయానికి వచ్చేలా ఇంటి సభ్యులు ఇన్నాళ్లు గేమ్ ఆడిన తీరును బిగ్ బాస్ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

విజేత ఎవరో?

విజేత ఎవరో?

హరితేజ, శివ బాలాజీ, ఆదర్శ్, అర్చన, నవదీప్ లలో ఎవరు బిగ్ బాస్ విన్నర్ అవుతారు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. గడిచిన వారాల కంటే ఈ పైనల్ వారం ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది.

ఓటింగే కీలకం

ఓటింగే కీలకం

ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగానే బిగ్ బాస్ విన్నర్ ను ప్రకటించనున్నారు. గడిచిన వారం 4.8 కోట్ల ఓట్లు వచ్చాయి. ఫైనల్ వీక్ విజేతను ఎంపిక చేసే క్రమంలో ప్రేక్షకుల నుండి రికార్డు స్థాయిలో ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.

English summary
Bigg Boss Telugu final week day 2 details. Every individual pays a visit to the play area as and when Bigg Boss calls out their name. The contestants anxiously enter the play area and emotionally exit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu