»   » ‘బిగ్ బాస్’ గొప్పలు నిజమే కానీ... అభిమాని ఝలక్ చేదుగా ఉంది!

‘బిగ్ బాస్’ గొప్పలు నిజమే కానీ... అభిమాని ఝలక్ చేదుగా ఉంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు టెలివిజన్ రంగంలో సంచలనం క్రియేట్ చేస్తోంది బిగ్ బాస్ రియాల్టీషో. ఎన్టీఆర్ హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ షో... టీఆర్పీ రేటింగుల్లో టాప్‌లో కొనసాగుతోంది. తాజాగా స్టార్ మాటీవీ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది.

బిగ్ బాస్ షో ప్రారంభానికి ముందు.... 26వ వారంలో 529 పాయింట్లతో ఉన్న మాటీవీ రేటింగ్ బిగ్ బాస్ ప్రారంభం అయిన తర్వాత క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. 30 వారం వచ్చే సరికి మాటీవీ రేటింగ్ 825 పాయింట్లకు చేరింది. ప్రతి తెలుగు ప్రేక్షకుడు ఎక్కువ ప్రిఫర్ చేసే ఛానల్ మాటీవే అంటూ.... ఆ ట్వీట్లో పేర్కొన్నారు.

గొప్పలు నిజమే...

గొప్పలు నిజమే...

‘బిగ్ బాస్' షో గురించి మాటీవీ చెబుతున్న గొప్పలు అక్షరాల నిజం. బిగ్ బాస్ రియాల్టీ షో ప్రారంభమైన తర్వాత మాటీవీ రేటింగ్ అమాంతం పెరిగిపోయిందన్న మాట కూడా నిజం. బ్రాడ్‌కాస్ట్ ఆడియ‌న్స్ రీసెర్చి కౌన్సిల్ నివేధిక ఈ విషయాలను స్పష్టం చేస్తోంది.

అభిమాని ట్వీట్ చేదుగా ఉంది

అభిమాని ట్వీట్ చేదుగా ఉంది

అయితే మాటీవీ వారు పై విధంగా ట్వీట్ చేయగానే....ఈ షో చూస్తున్న అభిమాని ఒకరు ఘాటు రిప్లై ఇచ్చారు. బిగ్ బాస్ షోలో లోపాన్ని ఎత్తి చూపారు. బిగ్ బాస్ షోలో జరిగేదంతా ఫేక్ అని, బట్టలు ఉతుక్కోవాలని టాస్క్ ఇవ్వడం, కెమరాకు కనపడకుండా వాషింగ్ మెషిన్లో బట్టలు ఉతికిస్తున్నారంటూ విమర్శలు చేశారు. ఈ మేరకు మాటీవీ వారికి ట్విట్టర్లో రిప్లై ఇవ్వడం చర్చనీయాంశం అయింది.

Bigg Boss Telugu : 16th Day Episode Seen Like Midnight Masala
అతడి ఆరోపణలు నిజమేనా?

అతడి ఆరోపణలు నిజమేనా?

అయితే సదరు టీవీ అభిమాని చేస్తున్న ఆరోపణలు నిజమేనా? స్మకింగ్ రూమ్ లో ఉన్నది ఏమిటి? అది నిజంగా వాషింగ్ మెషీనా? లేక వాషింగ్ మెషీన్‌ను పోలి ఉన్న మరేదైనా వస్తువు అయి ఉంటుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

వ్యూవర్ ఇంప్రెషన్స్

వ్యూవర్ ఇంప్రెషన్స్

22 జూలై - 28 జూలై నివేదిక‌లో 5,75,255 వ్యూయ‌ర్ ఇంప్రెష‌న్స్‌తో స్టార్ మా టాప్ తెలుగు ఛాన‌ల్‌గా నిలిచింది. అలాగే టాప్ 5 కార్యక్ర‌మాల్లో కూడా స్టార్ మా ఛాన‌ల్ కార్య‌క్ర‌మాలే మూడు ఉన్నాయి.

బిగ్ బాస్ టీం సంబరాలు

బిగ్ బాస్ టీం సంబరాలు

బిగ్ బాస్ రియాల్టీ షోకు భారీ రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో గతవారం ఎన్టీఆర్ కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఫోటోలను స్టార్ మాటీవీ వారు ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

ట్రెండింగ్

ట్రెండింగ్

ఇండియా వైడ్ ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతున్న విషయాల్లో కూడా బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో గురించే ఉండటం విశేషం.

29వ వారంలో కూడా టాప్

29వ వారంలో కూడా టాప్

బిగ్ బాస్ షో ప్రారంభం అయిన తర్వాత మాటీవీకి తిరుగులేకుండా పోయింది. అందుకు ఈ సర్వే రిపోర్ట్స్ ప్రత్యక్ష నిదర్శనం.

English summary
Jr NTR-hosted reality show Bigg Boss Telugu has registered record TRP ratings and made Star Maa No 1 Telugu TV channel in the 29 and 30th week of the year 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu