For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss 5: హమీదా వాకిట్లో శ్రీరామచంద్ర చెట్టు.. కంటెస్టెంట్లను ఆటాడేసుకొన్న హైపర్ ఆది

  |

  ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మొత్తానికి 35 వ రోజు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో కొనసాగింది. ఫెస్టివల్ సందర్భంగా నాగార్జున కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. పాటలు డాన్స్ లో ఉంటూ అందరికీ వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన వీడియోలు కూడా చూపించడం జరిగింది. ఇక అందరూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ కనిపించారు. ఇక ఆ తరువాత హైపర్ ఆది ఎంట్రీతో వాతావరణం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. పోలీస్ ఆఫీసర్ గా ఇన్వెస్టిగేషన్ చేసేందుకు వచ్చాను అంటూ ఒక ఆట ఆడేసుకున్నాడు. నాగార్జున కూడా హైపర్ ఆదికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినట్లు అర్థమైంది. ఎందుకంటే చివరికి నాగార్జున పై కూడా హైపర్ ఆది పంచ్ లు బాగానే వేశాడు. అందరికంటే ఎక్కువగా హామీదా శ్రీరామ్ మధ్యలో ఉన్న రిలేషన్ పై కూడా ఎక్కువగా పంచ్ లు వేసే ప్రయత్నం చేశాడు.

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  నాగార్జునపై కంప్లైంట్

  నాగార్జునపై కంప్లైంట్

  పోలీస్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి గా హైపర్ ఆది స్టేజి మీదకు ఎంట్రీ ఇవ్వగానే అందరు కూడా నవ్వేశారు. దీంతో ఇంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ వస్తే ఎందుకు నవ్వుతున్నారు అంటూ హైపర్ ఆది ఆశ్చర్యపోయాడు. ఇక ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలని నాగార్జున చెప్పగానే వాళ్ళ మీద కాదు సార్ మీ మీద కూడా ఒక కేసు నమోదు అయింది అంటూ హైపర్ ఆది పంచ్ వేశాడు. 1989 అక్టోబర్ 5 న మీరు ఒక చేయిన్ లాగినట్లు మహిళ కేసు పెట్టింది అనగానే.. నాగార్జున.. నేను లాగింది అమ్మాయి మెడలో చేయిన్ కాదు శివ సినిమాలో సైకిల్ చేయను అని అనగానే అందరూ నవ్వేశారు.

   గన్నుతో కాల్చుతూ.. ఆది పంచ్

  గన్నుతో కాల్చుతూ.. ఆది పంచ్

  హైపర్ ఆదిని కూడా లోపలికి వచ్చి ఒక టాస్క్ ఆడితే బాగుంటుంది అని చెప్పినప్పటికీ దానికి ఇంకా టైం ఉందని కూడా అతను వివరణ ఇచ్చాడు. అంటే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టేందుకు అతను బాగానే ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక లోపలి నుంచి గన్ను తెప్పించిన హైపర్ ఆది ఒక్కొక్కరు అందరి మీద తల పెట్టి కల్చమని చెప్పాడు. సౌండ్ వచ్చిన వారి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తానని చెప్పడంతో మొదట సన్ని మానస్ పై పెట్టగా సౌండ్ అయితే రాలేదు.. ఇక కాజల్ పై కూడా సౌండ్ రాలేదు. ఇక చివరికి ప్రియపై సౌండ్ వచ్చింది.

  టెన్షన్ లో ఉన్న హామీదాపై గన్ సౌండ్

  టెన్షన్ లో ఉన్న హామీదాపై గన్ సౌండ్

  ఇక ప్రియగారు నేను పోలీస్ ఆఫీసర్ ఎలా అయ్యాను అనుకుంటున్నారా? మీరు ఇంటికి కెప్టెన్ ఇవ్వలేనిది నేను పోలీస్ ఆఫీసర్ అవ్వలేనా? స్పోర్ట్స్ కోటాలో వచ్చింది అని లూడో గేమ్ ఆడి నందుకు జాబ్ వచ్చింది అని హైపర్ ఆది మరో పంచ్ చేశాడు. ఇక ప్రియా తర్వాత శ్రీరామ్ పై గన్ను పెట్టగా సౌండ్ రాలేదు.ఆ తర్వాత అసలే ఎలిమినేషన్ డేంజర్ జోన్ లో ఉన్నటువంటి హామీదా పై పెట్టగానే ఒక్కసారిగా సౌండ్ వచ్చింది. దీంతో ఆమె మరొకసారి టెన్షన్ పడింది. కానీ హైపర్ ఆది మాత్రం అందరినీ నవ్వించే ప్రయత్నం చేశారు.

  హమీదా వాకిట్లో శ్రీరామ్ చెట్టు..

  హమీదా వాకిట్లో శ్రీరామ్ చెట్టు..

  ఇక హామీదాపై గన్ను సౌండ్ రాగానే శ్రీరామ్ ని కూడా పైకి లేపిన హైపర్ ఆది ఇద్దరి గురించి చాలా ప్రత్యేకంగా పంచ్ లు వేస్తూ చెప్పాడు. అసలు ఇతనికి శ్రీ రామచంద్ర అనే పేరు పెట్టారు కానీ శ్రీకృష్ణుడు అని పేరు పెట్టాల్సింది అని హైపర్ ఆది నాగార్జునతో చెప్పారు. చిన్నప్పుటి నుంచి మీరు సింగింగ్ తో పాటు ఫ్లటింగ్ అనేదానిమీద ప్రాక్టీస్ బాగానే చేసినట్టు ఉన్నారా అని మొహం మీద అడిగేశాడు. ఇక నాగార్జున గారికి తెలియకుండా చాలా జరుగుతున్నాయి అంటూ చెప్పిన హైపర్ ఆది శ్రీ రామచంద్ర, హామీదా బయటకు వచ్చిన తర్వాత స్పెషల్ గా ఈవెంట్స్ కూడా చేసేందుకు ప్లాన్స్ జరుగుతున్నాయని హైపర్ ఆది చెప్పాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే తరహా లో హమీదా వాకిట్లో శ్రీరామ్ చెట్టు అనే ఈవెంట్స్ జరుగుతాయని ఆది పంచ్ వేసి అందరిని నవ్వించాడు. నిజానికి అందరూ చాలా కష్టపడి ఫ్లట్ చేస్తారు కానీ శ్రీ రామచంద్ర మాత్రం కేవలం ఒక పాట పాడే ఎట్రాక్ట్ చేస్తాడు అని ఆది వివరణ ఇచ్చాడు.

  English summary
  Bigg boss telugu hyper aadi comedy track on Sreerama Chandra,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X