For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెళ్లి చేసుకున్నాం కాబట్టి తప్పలేదు.. క్యారెక్టర్‌లెస్ అంటారా? రెచ్చిపోయిన వితిక..

  |
  Bigg Boss Telugu 3 : Episode 26 Highlights || Filmibeat Telugu

  తెలుగు 'బిగ్ బాస్' రియాలిటీ షోలో వివాదాలు మరీ ముదురుతున్నాయి. దీంతో రోజు రోజుకు షో ఆసక్తికరంగా మారుతోంది. గత రెండు సీజన్లతో పోలిస్తే.. ఈ సారి కాసింత ఎక్కువగానే ప్రేక్షకాదరణను పొందుతోంది 'బిగ్ బాస్'. దీనికి కారణం ఇంట్లో జరిగే రచ్చే. సీజన్ ప్రారంభమైన మొదటి వారంలోనే కంటెస్టెంట్లు గొడవలు పెట్టుకుని గ్రూపులుగా ఏర్పడ్డారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. తాజాగా నిన్న (ఆగస్టు 15) జరిగిన బిగ్ బాస్ 26వ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగింది. ఆ వివరాలు చూద్దామా..

  శ్రీముఖి, బాబా భాస్కర్ సపోర్ట్‌తో అలీ రెజా

  శ్రీముఖి, బాబా భాస్కర్ సపోర్ట్‌తో అలీ రెజా

  గత ఎపిసోడ్‌లో శ్రీముఖి, బాబా భాస్కర్ సపోర్ట్ తో అలీ రెజా సింహాసనంపై కూర్చొని కెప్టెన్ అయినా సంగతి తెలిసిందే. అలీని దించడానికి రాహుల్ అండ్ టీం విశ్వప్రయత్నాలు చేసింది. ఆఖరికి రాహుల్, రవికృష్ణ మాత్రమే 15 నిమిషాల పాటు అలీని సింహాసనం నుంచి దించడానికి ప్రయత్నించారు. కానీ, అలీని దించలేక తప్పుకున్నారు. దీంతో అలీనే కెప్టెన్‌గా నియమించబడ్డాడు.

  ఆగస్టు 15 సందర్భంగా బిగ్ బాస్ హౌస్‌లో

  ఆగస్టు 15 సందర్భంగా బిగ్ బాస్ హౌస్‌లో

  గురువారం ఎపిసోడ్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నడుమ సందడిగా సాగింది. గత సీజన్లలో లాగే స్కిట్‌లు, డాన్స్‌లతో ఎంజాయ్ చేశారు. ఈ సందర్బంగా సరికొత్త టాస్క్ లో స్త్రీ, పురుషుల సమానత్వం లాంటి అంశాలపై కంటిస్టెంట్ల మధ్య ఓ రేంజ్‌లో చర్చలు నడిచాయి.

  ఆడవాళ్లు గొప్పనా లేక మగవాళ్ల గొప్పనా

  ఆడవాళ్లు గొప్పనా లేక మగవాళ్ల గొప్పనా

  ఆడవాళ్లు గొప్పనా లేక మగవాళ్ల గొప్పనా అనే అంశంపై బిగ్ బాస్ కంటిస్టెంట్ల నడుమ జరిగిన చర్చలు ఒకింత వివాదాల స్థాయికి వెళ్లాయి. స్త్రీ, పురుష సమానత్వంపై కంటిస్టెంట్లు అందరూ ఎవరి వాదన వారు వినిపించారు. మగవాళ్లు ఎంతమందితో నైనా మాట్లాడొచ్చు.. ఎవరితోనైనా ఉండొచ్చని రవి, మహేష్‌ అనగా.. వారిపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ అషురెడ్డి, వితికా షేరు, పునర్నవిలు కలిసి పంచ్‌లు విసిరారు.

  పెళ్లి అనే ఒకే బంధం కారణంగా.. ఎమోషనల్ అయిన వితిక

  పెళ్లి అనే ఒకే బంధం కారణంగా.. ఎమోషనల్ అయిన వితిక

  పెళ్లి చేసుకున్నామనే ఒకే ఒక కారణంగా ఆడవాళ్లు మగవారి కోసం సర్వం త్యాగం చేస్తారు. పుట్టింటి వారిని కాదని అత్తింటి వారికి సేవలు చేస్తారు అదీ ఆడవాళ్ళ గొప్పతనం అని అషురెడ్డి అంది. ఇక వితిక అయితే సమాజంలో ఆడవాళ్ళ అణిచివేతపై ఫైర్ అవుతూ ఎమోషనల్‌గా ఫీల్ అయింది. మరోవైపు వరుణ్ ఏమాత్రం శాంతంగా కనిపించాడు.

  ఆవేశంగా పునర్నవి

  ఆవేశంగా పునర్నవి

  మహిళల గొప్పతనం చెప్పే ప్రయత్నంలో భాగంగా పునర్నవి ఆవేశంగా మాట్లాడింది. ఓ అబ్బాయి వెళ్లి నలుగురు అమ్మాయిలతో మాట్లాడితే అది సోషలైజింగ్ అంటారు. అదే అమ్మాయి వెళ్లి అబ్బాయితో మాట్లాడితే.. క్యారెక్టర్‌లెస్ అని ముద్ర వేస్తారు. ఇదీ నేటి సమాజం అమ్మాయిలకు ఇస్తున్న గౌరవం అంటూ ఆవేశపూరిత డైలాగ్స్ కొట్టింది. ఇక చివరగా దేశ భక్తి పాటలకు అందరూ కలిసి డాన్స్ వేశారు. ఈ రకంగా ఆగస్టు 15 ఎపిసోడ్ ఆసక్తికరంగా ముగిసింది.

  ఇంతకీ ఎలిమినేషన్ ఎవరు..?

  ఇంతకీ ఎలిమినేషన్ ఎవరు..?

  ఈ వారం ఎలిమినేషన్‌ లిస్ట్ లో రాహుల్, శివజ్యోతి, శ్రీముఖి, రవి, రోహిణి, వరుణ్, బాబా భాస్కర్‌లు ఉన్న విషయం తెలిసిందే. అయితే వారందరికీ ఎలాంటి రిమార్కులు లేకపోవడంతో (రాహుల్ మినహా) ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.

  English summary
  Big boss reality show Full success in Telugu Television History. Two seasons succesfully completed. And season 3 Started 21st july. This season Was Host By Akkineni Nagarjuna.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X