Remuneration: మర్యాద మనీష్‌కు రెమ్యునరేషన్ ఎంత? 2 వారాల్లో ఎన్ని లక్షలంటే?

తెలుగు టెలివిజన్ రంగంలో అంత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. సెలెబ్రెటీ కంటెస్టెంట్స్, అగ్రిపరీక్ష ద్వారా కామనర్స్ గా ఎంపికైన కంటెస్టెంట్స్ తో కలిసి హౌజ్ లో రసవత్తరమైన ఆట సాగుతోంది. హౌజ్ లోకి మొత్తం 15 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 7న గ్రాండ్ గా లాంఛ్ అయిన బిగ్ బాస్ తెలుగు రియాలిటీ గేమ్ షో ఇప్పటి వరకు 15 రోజులను పూర్తి చేసుకుంది. అటు సెలెబ్రెటీ కంటెస్టెంట్స్, ఇటు కామనర్స్ మధ్య ఘర్షణలు, వాగ్వాదాలు, అభిప్రాయ బేధాలు, స్నేహాలు, సపోర్ట్, ఛాలెంజ్ లతో షో ఆసక్తికరంగా మారింది.

ఇక బిగ్ బాస్ హౌజ్ లో ప్రతివారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఒక మొదటి వారంలోనే ప్రముఖ యంగ్ అండ్ టాలెంటెడ్ లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక 2వ వారం కూడా నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. 8 మంది ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. అందులో హరిత హరీష్, భరణి శంకర్, ఫ్లోరా సైనీ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, డీమాన్ పవన్, సంజన గల్రానీ ఉన్నారు. ఇక వీరిలో తక్కువ మద్దతు వచ్చిన మర్యాద మనీష్ 2వ వారంలో ఎలిమినేట్ అయ్యారు.

Bigg Boss Telugu Season 9 Maryada Manish Elimination

కాగా, మర్యాద మనీష్ హౌజ్ నుంచి వెళ్లిన పోయిన సందర్భంగా ఆయన రెమ్యునరేషన్ ఎంత అందుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా బిగ్ బాస్ టీమ్ అందించిన వివరాల ప్రకారం.. ఎలిమినేషన్ తో హౌస్ ని వదిలేసిన మర్యాద మనీష్ 2 వారాల్లో బిగ్‌బాస్ హౌస్‌లో ఉండటంతో 1.40 లక్షల రూపాయలు పారితోషికం తీసుకున్నారని తెలియజేశారు. అంటే ఒక రోజు గాను హౌజ్ లో ఉన్నందుకు రూ.10 వేలు, ఆ లెక్కన వారానికి రూ.70 వేలు అందుకున్నారని చెప్పుకొచ్చారు.

ఆయన హౌజ్ నుంచి ఇంటికి వెళ్లిపోతూ కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఎగ్జిట్ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ తెలుగు మాజీ కంటెస్టెంట్ శివాజీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. హౌజ్ లో ఫైర్ ఎవరు? ఫ్లవర్ ఎవరు? అని ప్రశ్నించగా.. మనీష్ స్పందిస్తూ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన టాప్ 7 కంటెస్టెంట్స్ ఇంటికి వెళ్లిపోతారని నా అభిప్రాయం. వాళ్ల వల్ల ఇప్పటికీ గేమ్ ఇంపాక్ట్ అవ్వలేదని తనూజ గురించి చెప్పారు. ఇక ఇమ్మాన్యుయేల్ గురించి పాజిటివ్ గా చెప్పుకొచ్చారు. ఎంటర్ టైన్ మెంట్, టాస్క్, ఎమోషనల్ గా ఉన్నారని చెప్పారు.

ఇక హౌజ్ నుంచి బయటికి రాకోతే మాత్రం ప్రియాను నెక్ట్స్ వీక్ లో ఎలిమినేషన్ చేద్దామని అనుకున్నానని కూడా చెప్పారు. అంతే కాదు తను కూడా కొన్ని సందర్భాల్లో మాట జారనని కూడా చెప్పారు. కాస్తా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నానని నేను కూడా నోటీస్ చేశాను. శ్రీజ, ప్రియతో తనకు జరిగిన ఘటనలతోనే బిగ్ బాస్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని శివాజీ మనీష్ కు తెలియజేశారు. మనీష్ కూడా స్పందిస్తూ తన సైడ్ తప్పులను కూడా ఎగ్జిట్ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X