»   » బిగ్ బాస్: గబ్బు మొకంది అంటూ ఫ్యాన్స్ ఫన్నీ సెటైర్లు, షాకైన అర్చన...

బిగ్ బాస్: గబ్బు మొకంది అంటూ ఫ్యాన్స్ ఫన్నీ సెటైర్లు, షాకైన అర్చన...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bigg Boss Telugu Last Week: Trolls and Memes గబ్బు మొకంది, బిగ్ బాస్ సభ్యులకు షాక్

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో తొలి సీజన్ మరో రెండు రోజుల్లో ముగియబోతోంది. చివరి వారం ఇంట్లో సిరీయస్ ఇష్యూలు, గొడవలు లేకుండా అంతా సరదాగా సాగిపోతోంది. ఇంట్లో ఖాళీగా బోర్ ఫీలవుతున్న ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఓ గేమ్ టాస్క్ పెట్టారు.

శివ బాలాజీ ఈ గేమ్ టాస్క్‌ అందరి కంటే తక్కువ సమయంలో ఫినిష్ చేసి విజేతగా నిలిచాడు. ఆయనకు ఫ్యాన్స్‌తో వీడియో కాల్ మాట్లాడే అవకాశం ఇవ్వడంతో పాటు, ఐస్ క్రీమ్ బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత స్థానంలో ఆదర్శ్ నిలిచాడు. అతడికి అభిమానుల ట్విట్టర్ ఫీడ్స్ చూపించడంతో పాటు, పిజ్జా బహుమతిగా అందించాడు బిగ్ బాస్.

గేమ్ టాస్క్

గేమ్ టాస్క్

తర్వాతి స్థానంలో నవదీప్ నిలవగా అతడికి ఫ్యాన్స్ ఫేస్ బుక్ ఫీడ్స్, కూల్ డ్రింగ్ గిఫ్టుగా ఇచ్చారు. 4వ స్థానంలో నిలిచిన అర్చనకు అభిమానులు ఆమెపై సోషల్ మీడియాలో వేసిన ఫన్నీ సెటైర్లు చూపించి, చాక్లెట్ బహుమతిగా ఇచ్చారు. చివరి స్థానంలో ఉన్న హరితేజకు ఇంటి పనులు అన్నీ చేయాల్సిందిగా శిక్ష వేశారు.

షాకైన అర్చన

షాకైన అర్చన

అభిమానులు తనపై సోషల్ మీడియాలో పోస్టు చేసిన మీమ్స్ చూసి అర్చన షాకైంది. నాపై బయట ఇలాంటి అభిప్రాయం వచ్చిందా అంటూ కాస్త అప్ సెట్ అయింది. ఇది కూడా నీపై అభిమానులు చూపించే ఒక రకమైన ప్రేమే అని ఇంటి సభ్యులు సర్దిచెప్పడంతో అర్చన కూలైంది.

మీ పాపను తీసుకెళ్లండి ఆంటీ

మీ పాపను తీసుకెళ్లండి ఆంటీ

ఆ మధ్య అర్చన మదర్ బిగ్ బాస్ ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అర్చన చాలా ఎమోషనల్ అయింది. అయితే దీన్ని ఫన్నీగా మార్చి కొందరు ఫ్యాన్స్ మీమ్స్ క్రియేట్ చేశారు. ఎలాగూ వచ్చారు కదా మీ పాపని తీసుకెళ్లిపోండి ఆంటీ అంటూ ఓ పోస్టు పెట్టారు. నేను భావోద్వేగానికి గురైతే ఇలా చేశారు ఏంటి? అర్చన కాస్త ఫీలైంది.

హరికథ చెప్పడం అంటే...

హరికథ చెప్పడం అంటే...

హరికథ చెప్పడం అంటే హరితేజ మీద చాడీలు చెప్పినంత ఈజీ కాదమ్మా... అంటూ అర్చన మీద మరో సెటైర్ పడింది.

గబ్బు మెకంది అంటూ ఫన్నీగా

గబ్బు మెకంది అంటూ ఫన్నీగా

షో స్టార్ట్ అయిందో లేదో... గొడవ స్టార్ట్ చేస్తుంది గబ్బు మొకంది అంటూ.... కొందరు ఫ్యాన్స్ ఫన్నీ సెటైర్లు వేశారు.

గుడ్డు లేకుంటే ఏడుస్తా

గుడ్డు లేకుంటే ఏడుస్తా

గుడ్డు లేకుంటే నేను ఏడుస్తా... అంటూ అర్చనను ఉద్దేశించి క్రియేట్ చేసిన మరో సెటైర్.

వారం పాటు అలాగే ఉంచాలి

వారం పాటు అలాగే ఉంచాలి

వారం పాటు అర్చనను ఇంట్లో అలాగే ఫ్రీజ్ చేస్తే బావుంటుంది అంటూ కొందరు అభిమానులు సెటైర్లు వేశారు.

మేకోవర్

మేకోవర్

బిగ్ బాస్ ఫైనల్ ఈవెంటులో ఇంటి సభ్యులు అందంగా కనిపించడం కోసం.... ప్రత్యేకంగా హెయిర్ స్టైలిస్టులను పలిపించి మేకోవర్ చేయించారు. మేకోవర్ తర్వాత వారి లుక్ ఎలా ఉండనుందో శుక్రవాంర ప్రాసారం అయ్యే షోలో చూడొచ్చు.

English summary
Bigg Boss Telugu Season 1, Episode 68 details. Bigg Boss asks the 5 finalists to take part in the next challenge. Later, they get a make-over from top stylists.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu