»   » ‘బిగ్ బాస్’ ట్విస్ట్: ముమైత్ ఔట్, ఆపై సీక్రెట్ రూంలోకి..... శివ బాలాజీపై బాంబ్!

‘బిగ్ బాస్’ ట్విస్ట్: ముమైత్ ఔట్, ఆపై సీక్రెట్ రూంలోకి..... శివ బాలాజీపై బాంబ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బిగ్ బాస్' తెలుగు రియాల్టీ షోలో ప్రేక్షకులు ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. అర్చన, ముమైత్ ఖాన్‌ ఇద్దరు ఎలిమినేషన్‌కు నామినేట్ అవ్వగా.... ప్రేక్షకులు, హౌస్‌మేట్స్ అంతా అర్చన ఎలిమినేట్ అవుతుందని భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ముమైత్ ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు.

ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిన విషయం ఎన్టీఆర్ చెప్పగానే ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులు షాకయ్యారు. బిగ్ బాస్ షో అందరూ ఊహించినట్లు సాగదు అనడానికి ఇదో చక్కటి ఉదాహరణ. ఎలిమినేట్ అయిన వెంటనే ఏ మాత్రం బాధ పడకుండా తన లగేజ్ సర్దుకుని బయటకు వచ్చేసింది ముమైత్.

ముమైత్ ఎలిమినేట్ అవ్వడానికి కారణం

ముమైత్ ఎలిమినేట్ అవ్వడానికి కారణం

ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అవ్వడానికి కారణాన్ని ఎన్టీఆర్ వెల్లడించారు. అంతేకాదు ముమైత్‌కు జరిగిన నామినేషన్ అన్ ఫెయిర్ అని బిగ్ బాస్ ఫీలవుతున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు. ఎందుకంటే... నామినేట్ ఎప్పుడైనా హౌస్ మేట్స్ చేస్తే ప్రేక్షకులు వాళ్లని ఎలిమినేట్ చేస్తారు. కానీ ఈ సారి నామినేషన్ ప్రక్రియలో ముమైత్, హరితేజ వాళ్లని వాళ్లే నామినేట్ చేసుకోవడం జరిగింది. కాబట్టే ఈ రోజు వాళ్లు ఎలిమినేషన్‌కు నామినేట్ అవ్వడం జరిగింది. ఒక వేళ వాళ్లను వాళ్లు నామినేట్ చేసుకుని ఉండక పోతే ఈ నామినేషన్‌కు వచ్చి ఉండేవాళ్లు కాదేమో? అని ఎన్టీఆర్ తెలిపారు.

Bigg Boss Telugu : Dhanraj Ultimate Performance in Bigg Boss
ముమైత్‌ మళ్లీ బిగ్ బాస్ ఇంట్లోకి

ముమైత్‌ మళ్లీ బిగ్ బాస్ ఇంట్లోకి

ఊహించని విధంగా ముమైత్ ఖాన్‌కు మళ్లీ ఇంట్లోకి వెళ్లే అవకాశం కల్పించారు బిగ్ బాస్. ఈ స్థానంలో హరితేజ ఉన్న కూడా బిగ్ బాస్ ఇదే చేసేవాడని ఎన్టీఆర్ తెలిపారు. అయితే ముమైత్ మళ్లీ ఇంట్లోకి ఎప్పుడు ఎంటర్ అవుతారు? ఎలా ఎంటర్ అవుతారు? అనేది బిగ్ బాస్ చేతుల్లోనే ఉందని ఎన్టీఆర్ తెలిపారు. ప్రస్తుతానికి ముమైత్ ఖాన్ సీక్రెట్ రూమ్ లో కూర్చుని బిగ్ బాస్ కళ్లతో హౌస్ మేట్స్‌ను గమనిస్తుంటారు. ఈ సీక్రెట్ రూమ్‍‌లో ఎంత కాలం ఉంటారో? బిగ్ బాస్ ఎప్పుడు ఆవిడని ఇంట్లోకి పంపుతారో బిగ్ బాస్ నిర్ణయిస్తారని ఎన్టీఆర్ తెలిపారు.

ఇక నుండి గెలవడానికి ఆడతానన్న ముమైత్

ఇక నుండి గెలవడానికి ఆడతానన్న ముమైత్

ఇక నుండి షో గెలవడానికే ఆడతాను, ప్రేక్షకులను ఏ మాత్రం అప్ సెట్ చెయ్యను, బిగ్ బాస్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను అని ముమైత్ ఖాన్ ఈ సందర్భంగా వెల్లడించారు.

శివ బాలాజీపై ముమ్ము బాంబ్

శివ బాలాజీపై ముమ్ము బాంబ్

ఇంట్లో నుండి ఎలిమినేట్ అయ్యే సమయంలో ఇంటి సభ్యుల్లో ఎవరో ఒకరిపై బిగ్ బాంబ్ వేసే అకాశం ఎలిమినేట్ అయిన వారికి వస్తుంది. ఈ బాంబును ముమైత్ ఖాన్ కోపిష్టి శివ బాలాజీపై ప్రయోగించింది. దీని ప్రకారం... వారం రోజుల పాటు, లేదా బిగ్ చెప్పే వరకు శివ బాలాజీ ఏం మాట్లాడినా దానికి ముందు ‘ముమ్ము ముమ్ము ముమ్ము ముమ్ము మ్ముము' అంటూ ముమైత్ జపం చేయాల్సి ఉంటుంది. శివ బాలాజీ ముమ్ము అని సరిగ్గా 5 సార్లు అంటున్నాడా? లేదా? అనే విషయాన్ని లెక్క బెట్టే బాధ్యత కత్తి కార్తీకకు అప్పగించారు.

ఆట అదిరింది

ఆట అదిరింది

ముమైత్ ఇంటి నుండి బయటికి రావడానికి ముందు ఇంటి సభ్యులతో ఓ ఆట ఆడించాడు ఎన్టీఆర్. ఒకరిలోని లోపాలను ఎత్తి చూపి, వారు సంజాయిషీ ఇచ్చేలా ఉన్న ఈ గేమ్ చాలా సరవత్తరంగా సాగింది.

ఇదీ ఆట తీరను

ఇదీ ఆట తీరను

ఈ ఆటలో భాగంగా ఇంటి సభ్యుల వద్ద చీటీలతో కూడిన ఓ బౌల్, ఎన్టీఆర్ వద్ద చీటీలతో కూడిన ఓ బౌల్ ఉంటుంది. బిగ్ బాస్ ఇంట్లో ఓ విట్‌నెస్ బాక్స్(బోను) ఉంటుంది. ఈ టాస్క్ ప్రకారం మొదటగా ఎన్టీఆర్ చెప్పిన వ్యక్తి బోనులో నిల్చుకుంటే... ఎన్టీఆర్ తన వద్ద ఉన్న బాక్సు నుండి ఓ చీటీ తీసి ఓ పేరు చదువుతాడు. ఆ పేరున్న వ్యక్తి బోనులో నిల్చుకున్న వ్యక్తి వద్దకు వచ్చి అతడిపై తన ఆరోపణలు వెల్లడించాలి. దానికి బోనులో ఉన్న వ్యక్తి సంజాయిషీ ఇవ్వాలి. సంజాయిషీ ఇవ్వడం పూర్తయిన తర్వాత బోనులో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి ఇంట్లోని బాక్సులో ఉన్న చీటిలో రాసి ఉన్న పని చేయాలి.

నవదీప్ మీద శివ బాలాజీ ఆరోపణ

నవదీప్ మీద శివ బాలాజీ ఆరోపణ

నవదీప్ కెప్టెన్ అయిన తర్వాత ఇంట్లో చక్కర ఎక్కువ వాడేస్తున్నారు, అది కెప్టెన్ చేతకాని తనమే అని శివ బాలాజీ ఆరోపించారు. దీనికి నవదీన్ ఇంతకాలం కోపిష్టి కెప్టెన్ ఉండటం వల్ల ఇంటి సభ్యులు స్వీట్స్ విషయంలో తమ కోరికలు అణుచుకున్నారు అని సంజీయిషీ ఇచ్చాడు. తర్వాత చీటీలో రాసి ఉన్న ప్రకారం ఒక వ్యక్తికి మూడు ముద్దులు ఇవ్వాలని కోరగా ధనరాజ్ కు మూడు ముద్దులు ఇచ్చాడు నవదీప్.

శివ బాలాజీ మీద అర్చన ఆరోపణ

శివ బాలాజీ మీద అర్చన ఆరోపణ

శివకు కోపం ఎక్కువ అని అర్చన ఆరోపించారు. తన కోపం తగ్గించుకుటానని శివ బాలాజీ సంజీయిషీ ఇచ్చారు. చీటిలో ఉన్న ప్రకారం సాష్టాంగ నమస్కార్ చేసి 30 సెకన్ల పాటు ప్రిన్స్ కాళ్లు పట్టుకున్నాడు.

అర్చన మీద ధనరాజ్ ఆరోపణ

అర్చన మీద ధనరాజ్ ఆరోపణ

అర్చన ప్రతి విషయాన్ని లాగి చెబుతుందని, రిపీటెడ్ గా చెబుతుందని ఆరోపించారు. తనపై చాలా మంది ఇలాంటి కంప్లయింట్స్ చేశారని, ఈ విషయంలో మారుతానని అర్చన సంజాయితీ ఇచ్చారు. చీటీలో రాసి ఉన్న ప్రకారం ధనరాజ్ ను తన వీపుపై ఎక్కించుకుని రెండు రౌండ్లు కొట్టింది. ఇలా ఫన్నీ ఫన్నీ ఆరోపణలు, శిక్షలతో గేమ్ రసవత్తరంగా సాగింది.

కెప్టెన్‌కు ఫన్నీ వేషం

కెప్టెన్‌కు ఫన్నీ వేషం

షోలో మరింత ఫన్ రేజ్ చేయడంలో భాగంగా కెప్టెన్ నవదీప్‌తో ఫన్నీ వేషం వేయించారు. తోక, కిరీటం, పెద్ద కళ్లద్దాలు, బొట్టు, మీసంతో నవదీప్ ను అలంకరించారు.

English summary
NTR asks Mumaith Khan to pack her luggage and exit the house. She gets emotional and sheds tears. Big Boss plays a fair game and calls Mumaith Khan back to the stage while she tries to exit the show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu