»   » పూజా మాట విని ఏడ్చాను.. బాబు గోగినేని, తనీష్ ఉత్తి డొల్లా.. అలా స్పాట్ పెట్టా.. కౌశల్

పూజా మాట విని ఏడ్చాను.. బాబు గోగినేని, తనీష్ ఉత్తి డొల్లా.. అలా స్పాట్ పెట్టా.. కౌశల్

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బిగ్‌బాస్ తెలుగు 2 సీజన్ ముగిసింది. ఎన్నో అటంకాలను, ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొని విజేతగా కౌశల్ నిలిచారు. బిగ్‌బాస్‌లో ఉండగా బయట నుంచి కౌశల్ ఆర్మీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. దాంతో ఆయన సులభంగా పలు ఎలిమినేషన్ల గురించి బయటపడ్డారు. టైటిల్ గెలిచిన తర్వాత కౌశల్ ఆర్మీని ఉద్దేశించి కౌశల్ మాట్లాడాడు. ఇంటిలో జరిగిన విషయాల గురించి.. ఇంటి సభ్యుల గురించి పలు విషయాలు వెల్లడించారు. కౌశల్ చెప్పిన విషయాలు ఏమిటంటే..

   డబ్బుల కోసం వెళ్లలేదు

  డబ్బుల కోసం వెళ్లలేదు

  డబ్బులు సంపాదించడానికి నేను బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లలేదు. ఎంతో మంది అభిమానులను గెలుచుకొన్నాను. నా బిగ్‌బాస్ టైటిల్‌ను ఫ్యాన్స్‌కు అంకితం చేస్తున్నాను. నా తల్లి క్యాన్సర్ వ్యాధి మరణించారు. ఆమె పేరు మీద ప్రారంభించే ఫౌండేషన్‌కు ఆ మొత్తానికి విరాళంగా అందిస్తాను. బిగ్‌బాస్ రెమ్యునరేషన్ వచ్చిన తర్వాత కౌశల్ ఆర్మీ సహకారంతో ఆ కార్యక్రమాన్ని చేపట్టి తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ వ్యాధి బారిన పడిన తల్లులకు వైద్య సహాయం అందిస్తాను.

  నేనేంటో తెలుసుకొన్నాను

  నేనేంటో తెలుసుకొన్నాను

  నా సత్తాను రుజువు చేసుకోవడానికి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాను. అంతకు ముందు షూటింగులకు, ఆఫీస్ పనులు చూసుకోవడం వల్ల నా స్టామినాను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాను. అందుకే బిగ్‌బాస్‌లో నేనేంటో నాకు నేనుగా తెలుసుకొన్నాను. అందరికీ చూపించాను అని కౌశల్ అన్నాడు.

  సింపుల్‌గా వెళ్లా.. టైటిల్‌తో వచ్చా

  సింపుల్‌గా వెళ్లా.. టైటిల్‌తో వచ్చా

  బిగ్‌బాస్ 2 ప్రారంభమయ్యే పది రోజుల ముందు నాకు ఆఫర్ వచ్చింది. పలు రకాల ఇంటర్వ్యూలు చేసిన తర్వాత, నా క్రెడెన్షియల్స్ చూసిన తర్వాత నన్ను ఎంపిక చేశారు. ఇంట్లోకి వెళ్లడానికి ముందు అందరికీ ఆడియో, వీడియో ప్రదర్శించారు. నాకు ఎలాంటి ఏవీ లేకుండా సింపుల్‌గా వెళ్లాను. బిగ్‌బాస్ 2 టైటిల్‌తో తిరిగి వచ్చాను.

   యాంకర్ శ్యామల తప్ప

  యాంకర్ శ్యామల తప్ప

  ఇంట్లో ఉండే 16 మందిలో శ్యామల తప్పా.. అందరూ నన్ను బయటకు పంపించేందుకు ప్రయత్నాలు చేశారు. వాళ్లు చేసే ప్రయత్నాలు నాకు సిక్త్స్‌సెన్స్‌తో తెలిసేది. బాబు గోగినేని నన్ను పంపిస్తానని శపథం చేశాడు. ఆయన ఏం ప్రయత్నాలు చేశారో తేలీదు గానీ.. నేను మాత్రం తక్కువగా శ్రమ పడి నామినేట్ చేస్తే మీరు మంగళహారతి పాడేశారు.

  Big Boss Season 2 Telugu : Koushal Gets More Votes From Other Languages Also
  తనీష్‌ను ఎప్పడూ

  తనీష్‌ను ఎప్పడూ

  తనీష్‌ను నేను ఏ క్షణంలో కూడా పోటీదారుడిగా భావించలేదు. అతను పది రోజులు దీప్తి సునైనాకు కేర్ టేకర్‌గానే ఉండటంతోనే సరిపోయింది. ఆ తర్వాత బిగ్‌బాస్ ముగిసే సమయం కూడా వచ్చేసింది.

   పూజ చెప్పిన మాటలతో

  పూజ చెప్పిన మాటలతో

  బిగ్‌బాస్‌లో ఐదు వారాలు ముగిసిన తర్వాత నేను ఫైనల్‌లో ఉంటానని నా మనసాక్షికి తెలిసింది. కౌశల్ ఆర్మీ గురించి మొదట పూజా రాంచంద్రన్ చెప్పింది. వాట్ ఏ ఆర్మీ అని పూజ చెప్పిన వెంటనే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. నా కోసం ఏ విధంగా పనిచేశారో.. ఎలా చేస్తున్నారో నాకు తెలిసింది.

  గీతా మాధురి కాదు.. బాధురి గీతా మాధురి నాతో గొడవలు పెట్టుకోవాలని చూసింది. బయట ఉన్న నాకు మద్దతు గురించి శ్యామల ఏం చెప్పిందో తెలీదు కానీ.. నన్ను బయటకు పంపించడానికి ప్రయత్నం చేసింది. నేను మాటకు మాట బదులివ్వడంతో కామ్ అయిపోయారు. అందుకే మొత్తం సీజన్ నామినేట్ చేసి నీకు ఆర్మీ ఉందటగా.. దాని సంగతి ఏంటో చూద్దాం అని గీతా అన్నారు. ఆమె పాడితే గీతా మాధురి లేకపోతే గీతా బాధురి అని కౌశల్ అన్నాడు.

  గీతా మాధురి కాదు.. బాధురి గీతా మాధురి నాతో గొడవలు పెట్టుకోవాలని చూసింది. బయట ఉన్న నాకు మద్దతు గురించి శ్యామల ఏం చెప్పిందో తెలీదు కానీ.. నన్ను బయటకు పంపించడానికి ప్రయత్నం చేసింది. నేను మాటకు మాట బదులివ్వడంతో కామ్ అయిపోయారు. అందుకే మొత్తం సీజన్ నామినేట్ చేసి నీకు ఆర్మీ ఉందటగా.. దాని సంగతి ఏంటో చూద్దాం అని గీతా అన్నారు. ఆమె పాడితే గీతా మాధురి లేకపోతే గీతా బాధురి అని కౌశల్ అన్నాడు.


  గీతా మాధురి నాతో గొడవలు పెట్టుకోవాలని చూసింది. బయట ఉన్న నాకు మద్దతు గురించి శ్యామల ఏం చెప్పిందో తెలీదు కానీ.. నన్ను బయటకు పంపించడానికి ప్రయత్నం చేసింది. నేను మాటకు మాట బదులివ్వడంతో కామ్ అయిపోయారు. అందుకే మొత్తం సీజన్ నామినేట్ చేసి నీకు ఆర్మీ ఉందటగా.. దాని సంగతి ఏంటో చూద్దాం అని గీతా అన్నారు. ఆమె పాడితే గీతా మాధురి లేకపోతే గీతా బాధురి అని కౌశల్ అన్నాడు.

  బాబుకు జెండా గురించి తెలీదు

  బాబుకు జెండా గురించి తెలీదు

  బిగ్‌బాస్ ఇంట్లో ఒకసారి బాబు గోగినేనితో భారతీయ జెండాలోని అశోక చక్రంలో ఎన్ని పుల్లలు ఉంటాయని అడిగితే 26 అని సమాధానం చెప్పారు. అప్పుడే ఆయన ఏ రేంజ్ ఇంటర్నేషనల్ పర్సనాలిటీ నాకు తెలిసింది. కౌశల్ లెవెల్ ఏంటో అని ఎద్దేవా చేశేవారు.. నా లెవెల్ బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ అని ఇప్పుడు చెబుతున్నాను అని కౌశల్ వెల్లడించాడు.

  English summary
  Bigg Boss winner Kaushal had a chit chat with Kaushal Army. He revealed some facts about the Bigg Boss Contestant. He said Babu goginent do not have knowledge about Indian flag.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more