»   » ‘బిగ్‌బాస్’ డేట్ ఫిక్స్: 12 మంది సెలబ్రిటీలు, 60 కెమెరాలు, 70 రోజులు!

‘బిగ్‌బాస్’ డేట్ ఫిక్స్: 12 మంది సెలబ్రిటీలు, 60 కెమెరాలు, 70 రోజులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్న బుల్లితెర రియాల్టీ షో 'బిగ్ బాస్' ప్రారంభ తేదీ, షెడ్యూల్ ఖరారైంది. జులై 16 నుండి స్టార్ మాటీవీలో ఈ షో ప్రసారం కాబోతోంది. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు, శని-ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ఈ షో ప్రసారం అవుతుంది.

  12 మంది సెలబ్రిటీలు పాల్గొనే ఈ రియాల్టీ షో ప్రత్యేకంగా నిర్మించిన బిగ్ బాస్ హౌస్ లో జరుగుతుంది. అందరినీ అందులోకి పంపి లాక్ చేస్తారు. 70 రోజుల పాటు వారు అందులో బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండాల్సి ఉంటుంది. వారి కదలికలను 70 కెమెరాలతో పర్యవేక్షిస్తుంటారు.

  100 మంది నుండి వడపోత

  100 మంది నుండి వడపోత

  దాదాపు 100 మంది ప్రముఖుల వడపోత అనంతరం 12 మందిని ఫైనల్ పోటీ దారులుగా ఎంపిక చేశారు. బిగ్ బాస్ తెలుగు వీక్షకులకు ఈ పన్నెండుమంది కావాల్సినంత వినోదం పంచుతారని షో నిర్వాహకులు అంటున్నారు.

  రెస్పాన్స్ అదుర్స్

  రెస్పాన్స్ అదుర్స్

  ఇప్పటికే విడుదలైన బిగ్ బాస్ తెలుగు ప్రోమోలకు మంచి స్పందన వచ్చింది. 55 మిలియన్(5.5కోట్లు) వ్యూస్ సొంతం చేసుకుంది. నేషనల్ వైడ్ సోషల్ మీడియా ప్లాప్‌ఫాంలో ఈ వీడియోలు ట్రెడింగ్ అయ్యాయి. షో ప్రారంభం అయ్యాక కూడా రెస్పాన్స్ అదే స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

  భారీ మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్

  భారీ మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్

  దాదాపు 10000 స్కేర్ ఫీట్స్ వైశాల్యంలో బిగ్ బాస్ హౌస్ నిర్మించారు. ఈ హౌస్ నిర్మాణంలో దాదాపు 750 మంది పని చేసినట్లు షో నిర్వాహకులు తెలిపారు. దీన్ని బట్టి ఈ షోపై ఎంతపెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారో అర్థం చేసుకోవచ్చు.

  జులై 16

  జులై 16

  బిగ్ బాస్ హౌస్ లో ఏర్పాటు చేసిన 60 కెమెరాలతో అందులో ఉండే సెలబ్రిటీల ప్రతి కదలికను ప్రేక్షకులు పరిశీలించడానికి వీలుంటుంది. బిగ్ బాస్ షో మనకు కొత్త కాబట్టి ఈ షో ఎలా ఉంటుంది? ఏవిధంగా ఎంటర్టెన్ చేస్తుంది? అది జులై 16 తర్వాతగానీ మనకు అర్థమయ్యే పరిస్థితి లేదు.

  English summary
  On the 16th of July, Telugu television market will be scaling new heights with the launch of the biggest ever reality show, “Bigg Boss” on Star Maa, with Young Tiger NTR appearing as the host for the first time on the small screen. This show will have 12 celebrity contestants brought together for 70 days, surrounded by 60 cameras and cut off from the outside world in 1 BIGG house.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more