తనీష్, కౌశల్ కొట్టుకొనేంతగా.. ముప్పు తప్పించుకొన్న గీతా..ఒళ్లు జలదరించేలా టాస్క్!
Recommended Video

తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షో కార్యక్రమ ముగింపు దగ్గరపడుతున్న కొద్ది ఇంటి సభ్యుల అసల రంగు ప్రవర్తన బయటపడుతున్నది. ఇంటి సభ్యులు టైటిల్ ఎగురేసుకుపోయే ఆలోచనలో ఒకర్ని మరొకరు టార్గెట్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇది ఎక్కువగా కనిపిస్తున్నది. తమలోనే అసహనాన్ని బయటకు వ్యక్తం చేస్తూ మాటల యుద్దానికి తలపడుతున్నారు. ఇంటి సభ్యుల అసలు రంగు మరోసారి బయటపడటానికి 10వ రోజు ఆట సాక్ష్యంగా నిలిచినట్టు కనిపిస్తున్నది. వివరాల్లోకి వెళ్లితే..

ఒళ్లు జలదరించేలా టాస్క్
కెప్టెన్ టాస్క్, టికెట్ టూ ఫినాలే, ఇతర టాస్కులు విఫలం కావడంతో సోమవారం ఇంట్లోని సభ్యులకు కొత్త రకం టాస్క్ ఇచ్చారు. వేస్ట్ ఫినాలే టాస్క్ లెవెల్ 1 అనే టాస్క్‌ను బిగ్‌బాస్ నిర్దేశించాడు. ఆ గేమ్ పేరు ఏంటంటే.. మీ ఇసుక జాగ్రత్త.

ఉద్రేక పూరితంగా సాగినట్టు
మీ ఇసుక జాగ్రత్త టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు చెరో జట్టుగా విడిపోవాలి. ఓ బాక్సులో ఇసుకను పోసి దానిని నుంచి ప్రత్యర్థి జట్టు నుంచి కాపాడుకోవాలి. ఈ కార్యక్రమం చాలా ఉద్రేక పూరితంగా సాగినట్టు కనిపిస్తున్నది.

ఇసుక తొట్లతో గేమ్
ఒకరి ఇసుక తొట్లను మరొకరు పడేసుకోవడానికి నానా రకాలుగా ప్రయత్నించారు. కాళ్లతో ఇసుక బాక్సులను తన్ని కింద పడేశారు. ఓ దశలో రోల్ రైడా బాక్సులో కూరుకుపోగా అలానే మరో సభ్యుడు లాక్కెళ్లడం ఒళ్లు జలదరించేలా కనిపించింది.

గీతా మాధురి తొట్టిని
గీతా మాధురి, దీప్తికి కేటాయించిన ఇసుక బాక్స్‌ను ఇంటి సభ్యులు తన్ని కిందపడేశారు. కాళ్లతో తొక్కేందుకు ప్రయత్నించారు. ఓ దశలో గీతా మాధురి పక్కనే ఇసుక బాక్స్ పడటంతో పెద్ద ముప్పు తప్పినట్లయింది.

నువ్వెంత అని కౌశల్, తనీష్
ఇక తనీష్, కౌశల్ మాటలతో దాడి చేసుకొన్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అని.. ఏంటి అంటే జవాబుగా ఏంటి అని మాటలు రువ్వుకొన్నారు. ఇలాంటి సన్నివేశాలు చూస్తే ఇంట్లో అధిపత్య పోరు బాగానే జరిగినట్టు స్పష్టంగానే కనిపించింది.


Click it and Unblock the Notifications











