For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ.. శౌర్య గురించి అసలు విషయం చెప్పిన హిమ

  |

  హిమతో నిరుపమ్ పెళ్లి పనులు ఓ వైపు కొనసాగుతుంటే.. జ్వాలా అలియాస్ శౌర్య తన ప్రేమను గెలిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది. రక్తంతో ఏకంగా నిరుపమ్ బొమ్మ గీసి జ్వాలా తన మనసులోని మాటను చెప్పుకొన్నది. హిమతో రక్తంతో గీసిన బొమ్మ గురించి చెప్పింది. నేనంటే నీకు చాలా ఇష్టం కదా.. డాక్టర్ సాబ్ నన్ను తన ఇంటికి ఎందుకు రమ్మన్నారు? వాళ్ల ఇంటిలో ఏం ఫంక్షన్ చేశారు? అని హిమను జ్వాలా అడిగితే.. మా అత్తగారి బర్త్ డే ఫంక్షన్ చేశారు అంటే.. అవునా.. అత్తగారి ఫంక్షనా? అయితే నేను అక్కడికి వరకు వచ్చాను. చివరి నిమిషంలో వెనక్కి వెళ్లాను. నేను రాకపోవడమే మంచిదైంది. నిన్ను చూసి అత్తగారు నన్ను ఏమైనా అంటే డాక్టర్ సాబ్ బాధపడేవారు. నేను అక్కడ అడుగుపెట్టే సరికి నా శత్రువు హిమ నాకు కాల్ చేసింది. ఆమెను పట్టుకొందామని వెళితే.. నా ఆటో తీసుకొని పారిపోయింది. నన్ను పరిగెత్తించి.. ఓ చోట ఆటోను వదిలేసి వెళ్లింది. అందుకే రాలేకపోయాను అని జ్వాలా చెప్పింది. కార్తీకదీపం సీరియల్‌ 1384 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

  నిరుపమ్‌ను కలవడం ఇష్టం లేదా?

  నిరుపమ్‌ను కలవడం ఇష్టం లేదా?

  నిరుపమ్ గురించి చెబుతుంటే.. హిమ ఏదో ఆలోచనల్లో పడిపోతే.. నేను చెప్పేది నీకు ఇష్టం లేదా? నిరుపమ్‌కు నేను ఐలవ్ యూ చెబుతానంటే.. వద్దన్నావు.. నీవు చెప్పమన్నప్పుడు.. నేను చెప్పలేకపోయాను. అసలు నేను నిరుపమ్ కలువడం ఇష్టం లేదా? అని జ్వాలా అనగానే.. హిమ షాక్ తిన్నది. దాంతో నేను ఏదో మాట వరుసకు అన్నాను అని జ్వాలా చెప్పడంతో హిమ కాస్త రిలీఫ్ అయ్యింది.

  హిమకు క్యాన్సర్ లేదు

  హిమకు క్యాన్సర్ లేదు


  ఇదిలా ఉండగా, హిమకు క్యాన్సర్ అని తెలియడంతో సౌందర్య హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్‌ను కలిసింది. నా మనువరాలు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నది. ఈ ట్యాబ్లెట్లు వాడుతున్నది. కాస్త ఒకసారి చూసి ఆమె వ్యాధి గురించి చెప్పండి అంటే.. ఆ ట్యాబ్లెట్లను చూసిన డాక్టర్.. ఇవి క్యాన్సర్‌కు కాదు.. బలానికి అని చెప్పడంతో సౌందర్య షాక్ తిన్నది. నా మనవరాలు డాక్టర్ హిమ అని చెప్పడంతో.. నాకు ఆమె తెలుసు. ఆమెకు ఎలాంటి క్యాన్సర్ వ్యాధి లేదు. ఇటీవల ఓ పేషంట్‌కు బ్లడ్ అవసరమైతే.. తనే బ్లడ్ ఇచ్చింది. క్యాన్సర్ పేషెంట్ బ్లడ్ డొనేట్ చేయరు అని చెప్పడంతో సౌందర్య ఆలోచనల్లో పడి అక్కడి నుంచి బయటకు వచ్చింది.

  నీవే హిమ అని చెప్పేస్తా.. శోభ బెదిరింపు

  నీవే హిమ అని చెప్పేస్తా.. శోభ బెదిరింపు


  ఇక హిమ నేరుగా డాక్టర్ శోభ ఇంటికి వెళ్లింది. హిమను చూడగానే.. శోభ కంగారు పడింది. పులిని చూసి బయపడ్డావా? అయితే హిమకు కౌంటర్ ఇస్తూ.. నీ ఫ్యామిలీ గురించి.. నీ ఇంట్లో నుంచి పారిపోయిన వారి గురించి తెలుసు. నీ ఫ్యామిలీ హిస్టరీ నాకు తెలుసు అని శోభ అంటే.. నా ఫ్యామిలీ గురించి ఎక్కువ మాట్లాడితే.. అంటూ గొంతు పట్టి పిసికేందుకు హిమ ప్రయత్నించింది. పిచ్చి వేషాలు వేయవద్దని హెచ్చరిస్తే.. నాకు నిరుపమ్ అంటే.. పిచ్చి.. అందుకే నేను ఈ నాటకాలు వేస్తున్నాను. నువ్వే హిమ అని చెబుతాను.. అప్పుడు నీ పరిస్థితి ఏమిటో ఊహించుకో. నీ మీద జ్వాలా ఎలా మండిపడుతుందంటే.. అని శోభ ఏదో చెప్పబోతే.. నీవే హిమ పేరుతో కాల్ చేస్తున్నట్టు చెబుతాను అని హిమ అనగానే.. శోభ షాక్ తిన్నది.

  ఒళ్లు దగ్గరపెట్టుకో.. అంటూ వార్నింగ్

  ఒళ్లు దగ్గరపెట్టుకో.. అంటూ వార్నింగ్


  అయితే హిమకు శోభ కౌంటర్ ఇస్తూ.. నీవే హిమ అని చెప్పేస్తాను. అప్పుడు నీపై ఉన్న కోపంతో జ్వాలా ఊగిపోతుంది. అప్పుడు నీ సంగతి ఏంటో తేలిపోతుంది అని అంది. అయితే శోభకు అంతే ఘాటుగా కౌంటర్ ఇస్తూ.. నేనే హిమను అని చెప్పడానికి టెన్సన్ పడుతున్నాను. నీవే చెబితే.. నాకు ఆ టెన్షన్ పోతుంది. ఒకవేళ నేనే హిమ అని జ్వాలా తెలుసుకొంటే.. జరిగేది ఏదో జరుగుతుంది. కాబట్టి.. నీవు చెప్పడటమే మంచిది అనే విధంగా కౌంటర్ ఇచ్చింది. దాంతోపాటు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఇక ముందైనా ఒళ్లు దగ్గరపెట్టుకో.. నమస్తే అంటూ చురక అంటించింది.

  హిమను చెంపదెబ్బ కొట్టిన సౌందర్య

  హిమను చెంపదెబ్బ కొట్టిన సౌందర్య

  డాక్టర్ వద్ద నుంచి నేరుగా ఇంటికి వచ్చిన సౌందర్య.. కోపంతో హిమ చెంపపై కొట్టింది. హిమను కొట్టడంతో ఆనందరావు వచ్చి.. పెరిగిన పిల్లలను కొట్టవద్దు అంటే.. మీరు మధ్యలోకి రాకండి.. ఈ రోజు క్యాన్సర్ నాటకానికి ముగింపు వేస్తా.. హిమకు క్యాన్సర్ లేదు అనగానే.. ఆనందరావు షాక్ తిన్నాడు. ఎందుకు అబద్దాలు ఆడుతున్నావు అంటే.. అబద్దం కాదండి.. మోసం అని సౌందర్య గట్టిగా అరిచింది. ఎందుకు అబద్దాలు ఆడుతున్నావు అని.. ఆనందరావు ఏదో అంటుండగా.. నిరుపమ్, స్వప్న వచ్చి.. ఏమిటో ఇంట్లో వారందరూ విషాదంగా కనిపిస్తున్నారు అని స్వప్న వెటకారం ప్రదర్శించింది.

  రోగంతోపాటు ధైర్యం కూడా అంటూ

  రోగంతోపాటు ధైర్యం కూడా అంటూ

  అయితే నిరుపమ్, స్వప్నను చూసి వెళ్లిపోతుంటే.. ఆగు అంటూ సౌందర్య అరిచింది. హిమను చూసి.. ఇప్పుడే ఇలా ఉంటే.. పెళ్లి తర్వాత ఎలా ఉంటుందో అని స్వప్న అంటే.. అలాంటి సమస్య ఏమి ఉండదు. మీరు అని హిమ అంది.. అయితే నీకు ఆ రోగంతోపాటు ధైర్యం కూడా పెరిగింది. అయినా ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని ఊరికే అన్నారా ఏంటి? అని స్వప్న అరిచింది. దాంతో నీవు ఇక మారవా? అని సౌందర్య అంటే.. నేనెందుకు మారాలి? నా ఆలోచనలు మార్చుకొంటాను. ఇప్పుడే ఇలా ఉంటే.. భవిష్యత్‌లో కష్టమే.. ఏమైనా అందామా అంటే.. రోగంతో సానుభూతి ఒకటి అని స్వప్న దురుసుగా మాట్లాడింది. అయితే నీ సానుభూతి ఇక్కడ ఎవరికి అవసరం లేదు అంటూ స్వప్పకు హిమ కౌంటర్ ఇచ్చింది.

  జ్వాలానే శౌర్య అంటూ హిమ షాకింగ్ న్యూస్

  జ్వాలానే శౌర్య అంటూ హిమ షాకింగ్ న్యూస్

  ఇదిలా ఉండగా.. కార్తీకదీపం తాజా ప్రోమోలో రకరకాల ట్విస్టులు కనిపించాయి. నిరుపమ్ ముందు జ్వాలా నిలబడి.. నా ప్రేమను చెప్పాలంటే.. భయంగా ఉంది అంటే... నేను నిన్ను ప్రేమించడం లేదు. నేను హిమనే ప్రేమిస్తున్నాను అంటూ నిరుపమ్ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. అయితే నీవు చెప్పిన మాటలు అబద్దం.. నీవు చేసిన పనులు అబద్ధం అంటూ జ్వాలా ఫైర్ అయింది. అక్కడే చాటుగా ఉన్న సౌందర్య వారి మాటలు విని.. ఏంటి అలా మాట్లాడుకొంటున్నారు అంటే.. జ్వాలానే హిమ అని అసలు విషయం బయటపెట్టంది.

  English summary
  Karthika Deepam 21st June Episode number 1384.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X