Just In
- 10 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 10 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 11 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 12 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విజయ్ దేవరకొండను కలిసిన అభిజిత్.. వాళ్ళ కోరిక నిజమైతే బావుండు..
బిగ్ బాస్ సీజన్ 4 విజేతగా నిలిచిన అభిజీత్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఏ మాత్రం గ్యాప్ లేకుండా జనాలకు మరీంత దగ్గరవుతున్నాడు. బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక ఓట్లు అందుకున్న అభిజీత్ ఇప్పుడు అభిమానుల నుంచి పొందిన ప్రేమను వీలైనంత త్వరగా తిరిగి ఇచ్చేయాలని అనుకుంటున్నాడు. ఇక బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు పలువురు సెలబ్రెటీల నుంచి కూడా మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు వారిని కూడా కలుసు కుంటున్నాడు.

తిరిగి ఇచ్చేయాలని..
అభిజీత్ గెలవడానికి కారణాలు ఎన్ని ఉన్నా కూడా అతనికి అభిమానుల సపోర్ట్ తో పాటు పలువురు సెలబ్రెటీలు ఇచ్చిన సపోర్ట్ కూడా ఎంతగానో ఉపయోగపడింది. ఇక వీలైనంత వరకు వాళ్ళు ఇచ్చిన ప్రేమను కూడా తిరిగి ఇచ్చేయాలని అభిజిత్ చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. రోజు ఇంటర్వ్యూలలో పాల్గొంటూనే వాళ్ళకు కృతజ్ఞతలు కూడా చెబుతున్నాడు.

కూల్ గా ఉండడం వలన..
అభిజిత్ మొదట బిగ్ బాస్ లో అడుగుపెట్టినప్పుడు పెద్దగా అంచనాలు ఏ;ఏమి లేవు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తప్పితే అతని కెరీర్ లో చెప్పుకోదగ్గ అంశం మరొకటి లేదు. దాని వల్లే కేవలం ఒక వర్గం క్లాస్ ఆడియెన్స్ నుంచి మద్దతు అందుకున్నాడు. అయితే హౌజ్ లో అతను కూల్ గా ఉండడం అన్ని వర్గాల ఆడియెన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేసింది.

విజయ్ దేవరకొండను కలిసిన అభిజిత్
విజయ దేవరకొండను కూడా అభిజీత్ ప్రత్యేకంగా కలుసుకున్నాడు. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు విజయ్ దేవరకొండ అభిజిత్ కు మద్దతు అందిస్తూ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక హౌజ్ నుంచి బయటకు రాగానే విషయం తెలుసుకున్న అభిజీత్ మొత్తానికి రౌడీ స్టార్ ను ఈ రోజు కలుసుకున్నాడు. సోషల్ మీడియాలో ఫుల్ ఛిల్ అంటూ స్పెషల్ పోస్ట్ కూడా వేశాడు.

ఇక అందరి కోరిక ఒక్కటే..
అభిజిత్ హీరోగా నటించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక చిన్న నెగిటివ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాతోనే వీరిద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. ఇక చాలా రోజుల తరువాత ఇద్దరు ఇలా కలవడంతో ప్రస్తుతం వీరి అభిమానులంతా ఒక్కటే కోరుకుంటున్నారు. ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తే బావుంటుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.