Don't Miss!
- Sports
Team India : సూర్యకుమార్‌పై మరీ ఎక్కువగా ఆధార పడుతున్న టీమిండియా..!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
షూటింగ్ లో కలకలం.. బిగ్ బాస్ వీజే సన్నీపై రౌడీ షీటర్ దాడి.. అసలు ఏమైందంటే?
బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన షో మొదలైన కొద్ది రోజులకే చాలా మందికి ఫేవరెట్ కంటెస్టెంట్ గా మారిపోయాడు. ఎవరూ ఊహించని విధంగా కప్పు కూడా సాధించి మంచి క్రేజ్ సంపాదించాడు. అయితే మిగతా సీజన్ల విన్నర్స్ తో పోలిస్తే బిగ్ బాస్ సన్నీకి మంచి ఆఫర్లు వస్తున్నాయి ప్రస్తుతం ఆయన ఒక వెబ్ సిరీస్ షూటింగ్ లో ఉండగా ఆయన మీద దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Recommended Video


షణ్ముఖ్ జస్వంత్ తో పోటీ
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వీజే సన్నీ సినిమాల మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక ప్రముఖ ఛానల్ లో రిపోర్టర్ గా తన కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత కొద్ది రోజులకే సీరియల్ లో నటించే అవకాశాలు దక్కించుకున్నాడు.
సినిమాల్లో చిన్నాచితక అవకాశాలు దక్కించుకుంటూ బిగ్ బాస్ అవకాశం రావడంతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించాడు. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో షణ్ముఖ్ జస్వంత్ తో పోటీ పడిన సన్నీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి కప్ గెలిచాడు.

రౌడీ షీటర్ దాడి
బిగ్ బాస్ విజేత సన్నీ పై దాడి జరిగింది. హైదరాబాద్ లోని హస్తినాపురం ప్రాంతంలో ఓ వెబ్ సిరీస్ షూటింగ్‌లో ఉన్న సన్నీపై బుధవారం ఓ రౌడీ షీటర్ దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా సిరీస్ నుంచి నేరుగా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సన్నీ దాడి చేసిన రౌడీ షీటర్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న మీర్‌పేట్ పోలీసులు, రౌడీ షీటర్‌ను అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.

రౌడీ షీటర్ దాడి
షూటింగ్ జరుగుతుండగా సాయంత్రం సమయంలో రౌడీషీటర్ సెట్‌కు వచ్చి హల్‌చల్ చేశాడని తెలుస్తోంది. అంతేకాక హీరో సన్నీతో గొడవకు దిగి అతనిపై దాడి చేశాడని అంటున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే సన్నీని షూటింగ్ నుంచి కారులో పంపించి పోలీసులకు సమాచారం అందించారని కూడా మరో ప్రచారం జరుగుతోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు.

చాలా సేఫ్ గా
ఇక వంశీ కృష్ణ అంటే బిగ్ బాస్ రివ్యూయర్ ఈ విషయం మీద స్పందించాడు. వీజే సన్నీ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. చిన్న సమస్యకు గూండాలు వచ్చి గొడవ సృష్టించారు. వారు VJ సన్నీని తాకను కూడా తాక లేదు. అక్కడ ఉన్న బౌన్సర్లు వారిని వెనక్కు నెట్టారు. సన్నీ చాలా సేఫ్ గా ఉన్నారని, అతని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

హరీష్ శంకర్ కథ
ఇక ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, హరీష్ శంకర్ సంయుక్తంగా జీ5 కోసం రూపొందిస్తున్న వెబ్ సీరిస్ 'ఏటీఎం'. ఈ సిరీస్ లో బిగ్‌బాస్ ఫేమ్ వీజే సన్నీ, దివితో పాటు నటుడు సుబ్బరాజు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సి.చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సీరీస్‌కు హరీష్ శంకర్ కథ అందించారు. హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నారు.