»   » ‘బిగ్‌బాస్‌’ ఎన్టీఆర్ అదుర్స్.. మహేశ్‌పై కత్తి.. కుప్పకూలిన సంపూ.. ముమైత్ కంటతడి

‘బిగ్‌బాస్‌’ ఎన్టీఆర్ అదుర్స్.. మహేశ్‌పై కత్తి.. కుప్పకూలిన సంపూ.. ముమైత్ కంటతడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

బిగ్‌బాస్ తెలుగు వెర్షన్ రియాలిటీ షోకు వారాంతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మారోసారి జోష్ తెచ్చారు. వారం రోజుల్లో సాదాసీదాగా సాగుతున్న ఈ షోలో శనివారం రోజున ఎలక్ట్రిఫయింగ్ ఫెర్మార్సెన్స్ బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాడు. ఎన్టీఆర్ హోస్ట్‌గా గత ఆదివారం (జూలై 16న) బిగ్‌బాస్ తొలి రియాలిటీ షో ప్రారంభమైన సంగతి తెలిసిందే.

వారాంతంలో ఎన్టీఆర్ అదుర్స్

వారాంతంలో ఎన్టీఆర్ అదుర్స్

వారం రోజుల్లో ఇంటి సభ్యుల మధ్య జరిగిన సరదా సన్నివేశాలు, గొడవలు, మానసిక సంఘర్షణ తదితర అంశాలను ఒక్కక్కొరిని పేరు పేరునా పలకరిస్తూ ఎన్టీఆర్ చేసిన హంగామా ప్రేక్షకులకు దిమ్మ తిరిగేలా చేసింది. రానున్న రోజుల్లో ఈ షోను మరింత మనోరంజకంగా ఉంటుందనే సంకేతాలను యంగ్ టైగర్ పంపించారు.

Bigg Boss Telugu : Bigg Boss given Warning to Contestants
ఆకట్టుకొంటున్న యంగ్ టైగర్

ఆకట్టుకొంటున్న యంగ్ టైగర్

వెండితెరైనా, బుల్లి తెరైనా నాకేం ఫరక్ రాదనే విధంగా ఎన్టీఆర్ చేసిన హోస్ట్ విన్యాసం వీక్షకులను బుల్లితెర వైపు పరిగెట్టేలా చేస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. స్టార్ మా టెలివిజన్ ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమానికి మంచి స్పందనే కనిపిస్తున్నదనే పరిశ్రమ వర్గాల టాక్

జ్యోతికి చేదు లడ్డూలు

జ్యోతికి చేదు లడ్డూలు

రియాలిటీ షోను ఆసక్తికరంగా నడిపిసున్నందుకు గానూ ఇంటి సభ్యులకు ఎన్టీఆర్ చేదు లడ్డూలు తినిపించే ఎపిసోడ్ శనివారం ఆసక్తికరంగా సాగింది. సినీ నటి జ్యోతికి యాంకర్ కత్తి కార్తీక, ఇతర సహ సభ్యులు చేదు లడ్డూలు నోట్లో కుక్కడం, ఆమె వాంతులు చేసుకోవడం శనివారం ఎపిసోడ్‌లో హైలెట్‌గా నిలిచాయి.

ఎలిమిషన్‌లో మహేశ్ కత్తి, జ్యోతి, హరితేజ

ఎలిమిషన్‌లో మహేశ్ కత్తి, జ్యోతి, హరితేజ

తొలివారం ముగిసిన నేపథ్యంలో ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ వారంలో ఐదుగురు ఇంటిసభ్యులు మధుప్రియ, కత్తి కార్తీక, మహేశ్ కత్తి, జ్యోతి, హరితేజ ఐదుగురు ఎలిమినేషన్‌ నామినేట్ అయ్యారు. అయితే ఆయా వ్యక్తుల ప్రవర్తన ఆధారంగా చేసుకొని మధుప్రియ, కత్తి కార్తీక‌ను మినహాయించారు. ఎన్టీఆర్ పాల్గొనే ఆదివారం ఎపిసోడ్‌లో మహేశ్ కత్తి, జ్యోతి, హరితేజపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతున్నది.

ముమైత్ కంటతడి..

ముమైత్ కంటతడి..

మహేశ్ కత్తిని ఎలిమినేషన్ గురి అవుతున్నాడనే మాటతో ముమైత్ ఖాన్ ఉద్వేగానికి గురయ్యారు. తాను అనవసరంగా మహేశ్‌ను నామినేట్ చేశాను అని ముమైత్ కంటతడి పెట్టుకొన్నారు. మహేశ్‌ను కౌగిలించుకొని కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే ఎలిమినేషన్, ముమైత్ ఉద్వేగంపై మహేశ్ కత్తి స్పందించిన తీరు ఎన్టీఆర్‌నే కాకుండా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొన్నది.

కొత్త కెప్టెన్‌గా కల్పన

కొత్త కెప్టెన్‌గా కల్పన

బిగ్ బాస్ ఇంటికి సంపూ స్థానంలో కొత్త కెప్టెన్‌గా ఎంపికైన సింగర్ కల్పనకు ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపాడు. ఇంట్లో తల్లిలా అందర్ని బాగా చూసుకొంటున్న కల్పన తీరును యంగ్ టైగర్ ప్రశంసించాడు. అంతేకాకుండా బిగ్‌బాస్ హౌస్‌లో మరింత సమర్థవంతంగా తన పాత్రను పోషించాలని ఆయన సూచించాడు.

సంపూకు తీవ్ర అనారోగ్యం

సంపూకు తీవ్ర అనారోగ్యం

బిగ్‌బాస్ హౌస్‌లో మానసిక సంఘర్షణకు లోనైన సంపూ అనారోగ్యానికి గురయ్యాడు. ఓ దశలో కుప్పకూలినంత పనిచేశాడు. నన్ను ఇంటి నుంచి బయటకు పంపించాలని బాస్‌ను వేడుకొన్నారు. తన అనారోగ్యానికి మందులు పనికిరావని, ఇంటి నుంచి బయటకు పంపాలని బిగ్‌బాస్‌ను కోరాడు. అయితే ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి కన్ఫెషన్ రూమ్‌కు వచ్చిన వైద్యులకు సహకరించాలని సంపూకు బిగ్‌బాస్ సూచించాడు. దాంతో సంపూ వైద్యానికి సహరించాడు.

English summary
Telugu Version of Bigboss started with High Energy. Young Tiger Entry into show makes worthy. His entry makes audience get thrilled. some of the contestants like Katti Mahesh, Jyothy, Hari Teja nominated for elimination.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu