»   » బిగ్‌బాస్‌‌లో సంపూ షాక్.. సమీర్‌కు కఠిన శిక్ష.. తెలుగు టీచర్‌గా జ్యోతి..

బిగ్‌బాస్‌‌లో సంపూ షాక్.. సమీర్‌కు కఠిన శిక్ష.. తెలుగు టీచర్‌గా జ్యోతి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు వెర్షన్ బిగ్‌బాస్‌లో నాలుగురోజున ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకొన్నాయి. ఇంటి నిబంధనలు ఉల్లంఘించిన పలువురు సెలబ్రిటీలకు బిగ్‌బాస్ కఠిన శిక్షలు విధించాడు. ప్రధానంగా సెలబ్రిటీలలో సంపూర్ణేష్ బాబు, సమీర్‌లకు బిగ్‌బాస్ కఠిన శిక్షలు విధించడంతో ఇతర ప్రముఖులు కంగుతిన్నారు. మిగితా వారందరికీ హెచ్చరికలతో సరిపుచ్చారు. సినీ నటి జ్యోతికి అదనపు బాధ్యతలు అప్పగించడం ఈ ఎపిసోడ్‌లో విశేషాలుగా మిగిలాయి.

సమీర్ ప్రత్యేకమైన టాస్క్

సమీర్ ప్రత్యేకమైన టాస్క్

క్రితం ఎపిసోడ్‌లో సెలబ్రీటీల బట్టలు ఉన్న సూట్‌కేసులను బిగ్‌బాస్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. కొన్ని షరతులను పెట్టి.. వాటిని సంతృప్తికరంగా అమలు చేస్తే సూట్‌కేసులు తిరిగి ఇస్తానని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ నేపథ్యంలో మూడో రోజు ఎపిసోడ్‌లో నటుడు సమీర్‌కు ఓ పత్యేకమైన పనిని బిగ్‌బాస్ అప్పగించాడు. సెలబ్రిటీలకు తెలియకుండా సమీర్ బాధ్యతలు అప్పగిస్తూ ఓ స్ట్రాటేజిని అమలు చేస్తున్నాడు.

విఫలమైన సమీర్

విఫలమైన సమీర్

సెలబ్రిటీలు వారి బట్టల సూట్‌కేసులు తీసుకోనివ్వకుండా సమీర్‌ను అడ్డుకోవాలని బిగ్‌బాస్ సీక్రెట్ పనిని అప్పగించాడు. తాను అప్పగించిన పనిని ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడాలని ఆయన హెచ్చరించారు. అయితే ఆయా సెలబ్రిటీలు తమ తమ సూట్‌కేసులు వెనుకకు తీసుకోకుండా సమీర్ విఫలమయ్యాడని బిగ్‌బాస్ తీర్పు చెప్పాడు.

వచ్చేవారం ఎలిమేషన్‌కు నామినేషన్

వచ్చేవారం ఎలిమేషన్‌కు నామినేషన్

తన బాధ్యత సక్రమంగా నిర్వర్తించలేకోపోయిన సమీర్‌కు బిగ్‌బాస్ కఠిన శిక్ష అమలు చేశాడు. వచ్చేవారం ఎలిమినేషన్ రౌండ్‌కు సమీర్‌ను డైరెక్ట్‌గా నామినేట్ చేశానని బిగ్‌బాస్ కఠినమైన నిర్ణయం తీసుకొన్నారు. బిగ్‌బాస్ నిర్ణయంతో ఇతర సెలబ్రిటీలు కంగుతిన్నారు.

కెప్టెన్ పదవి నుంచి సంపూ తొలగింపు..

కెప్టెన్ పదవి నుంచి సంపూ తొలగింపు..

ఇదే ఊపులో హౌస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంపూర్ణేష్ బాబును ఆ పదవి నుంచి బిగ్‌బాస్ తొలగించారు. ఇంటిలో ఇతర సభ్యుల ప్రవర్తన, భాష ఉపయోగించే తీరును కంట్రోల్ చేయడంలో విఫలమయ్యావని సంపూ‌పై బిగ్‌బాస్ ఆరోపణలు చేశాడు. ఆ ఆరోపణల ఆధారంగా సంపూను కెప్టెన్ పదవి నుంచి బిగ్‌బాస్ తప్పించాడు. ఇక ముందు ఎన్నడూ బిగ్‌బాస్ హౌస్ కెప్టెన్ కాలేడు అని బిగ్‌బాస్ తీర్పు చెప్పాడు.

 తెలుగులోనే మాట్లాడాలి..

తెలుగులోనే మాట్లాడాలి..

బిగ్‌బాస్ హౌస్‌లో తెలుగు మాట్లాడటమే ప్రధానమైన నిబంధన. ఈ రూల్‌ను ఇంటి సభ్యులు అతిక్రమిస్తున్నారనే అభిప్రాయాన్ని బిగ్‌బాస్ వ్యక్తం చేశాడు. తెలుగు కాకుండా ఇతర భాషల్లో మాట్లాడి టెలివిజన్ ప్రేక్షకులను ఇబ్బంది పెడుతున్నారని సభ్యులను మందలించాడు. ఇక నుంచి సభ్యులు తెలుగు భాషల్లోనే మాట్లాడాలని ఆదేశాలు జారీ చేశాడు. ఇక నుంచి ఇంటి నిబంధనలు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని సూచించాడు.

ముమైత్‌కు టీచర్‌గా జ్యోతి

ముమైత్‌కు టీచర్‌గా జ్యోతి

బిగ్‌బాస్ హౌస్‌లో సభ్యురాలైన ముమైత్ ఖాన్‌కు భాష రాదు కాబట్టి.. ఆమెకు తెలుగు భాషను నేర్పాలని నటి జ్యోతికి బాధ్యతలు అప్పగించారు. ముమైత్ తెలుగు మాట్లాడే విధంగా చర్యలు తీసుకోవాలని జ్యోతికి సూచించాడు. తెలుగులో మాట్లాడకుంటే ఆమెపై తగు చర్యలు తీసుకొంటానని బిగ్‌బాస్ వెల్లడించాడు.

ధన్‌రాజ్, ప్రిన్స్‌కు కఠినశిక్ష

ధన్‌రాజ్, ప్రిన్స్‌కు కఠినశిక్ష

ఇక ఇంతటితో బిగ్‌బాస్ ఆగకుండా బిగ్‌బాస్ నిబంధనలు అతిక్రమించిన సంపూ, సమీర్, ధన్‌రాజ్, ప్రిన్స్, శివబాలజీ తదితరులకు కఠినశిక్ష విధించాడు. వీరందరూ లైట్లు వేసి ఉన్నప్పటికీ.. నిద్ర పోవడం బిగ్‌బాస్ ఆగ్రహం కలిగించింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇంటి ఆవరణలో ఉన్న సైకిల్‌ను నిరంతరంగా ఇద్దరు కలిసి తొక్కాలని సూచించాడు. సైకిల్‌పై ఎవరైనా లేకుండా ఉంటే ఇంటిలో సైరన్లు మోగుతాయని, అంతేకాకుండా లైట్లు వేసి ఇతరులు నిద్రపోకుండా చేస్తానని బిగ్‌బాస్ చెప్పాడు. ఆ తర్వాత వారి ప్రవర్తన నచ్చడంతో ఈ శిక్ష నుంచి ఉపశమనం కలిగించాడు.

English summary
Lot of unexpected things happended in Biggboss house. Sampoo wsa removed from captaincy. Sameer was nominated for next week elimination process. Jyothy was appointed as Telugu teacher for Mumaith Khan.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu