For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అర్థనగ్నంగా సంపూ.. ఓ అమ్మాయిని పంపు బాసూ.. బిగ్‌బాస్‌లో అనసూయ ఎంట్రీ..

  By Rajababu
  |

  జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రారంభించిన బిగ్‌బాస్ తెలుగు కార్యక్రమం ఓ మోస్తారు ఆసక్తితో ముందుకెళ్తున్నది. సాధారణంగా ఆడవాళ్ల మధ్య ఉండే కలహాలు బిగ్‌బాస్ హౌస్‌లో దర్శనమిస్తున్నాయి. పురుషుల మధ్య సఖ్యత బాగానే కనిపిస్తున్నా మహిళల మధ్య వివాదాలకు పొగ కారణమవుతున్నది. రెండు రోజుల క్రితం ఎపిసోడ్‌లో సరదా సంఘటన జరిగింది. ఒంటి మీద ఎన్ని బట్టలు ఉంచుకొంటే అన్నీ ఉంచుకొండి.. మిగితావన్నీ సూట్ కేసులో పెట్టి అప్పగించండి అని బిగ్‌బాస్ ఆదేశించారు.

  బిగ్‌బాస్‌కు బట్టల సూట్‌కేసుల అప్పగింత

  బిగ్‌బాస్‌కు బట్టల సూట్‌కేసుల అప్పగింత

  సూట్ కేసులను అప్పగించేందుకు సైరన్ మోతను గడువు విధించారు. సైరన్ ముగిసే లోపు తమ మీద వీలైనన్నీ బట్టలు శరీరం మీద వేసుకొని జాగ్రత్త పడ్డారు. కొందరు మాత్రం తగనన్నీ బట్టలు తీసుకోవడంలో విఫలమయ్యారు. వారిలో బిగ్‌బాస్ హౌస్ కెప్టెన్ సంపూర్ణేశ్ బాబు, సింగర్ కల్పన, హరితేజ, శివబాలాజీ, మధుప్రియ, అర్చన తదితరులు ఉన్నారు. వీరిలో సంపూ మాత్రం చాలా తక్కువ బట్టలు తీసుకోవడంతో అర్థనగ్నంగానే వీక్షకులకు దర్శనమిస్తున్నారు.

  Bigg Boss Telugu : Mumaith Khan Trolled For Hugging Dhanraj
  ఒంటిపై బట్టలు లేకుండా సంపూ

  ఒంటిపై బట్టలు లేకుండా సంపూ

  బిగ్‌బాస్ హౌస్‌లో సంపూ ఒంటిపై షర్ట్ లేకుండా కనిపిస్తున్నారు. ఒంటికి టవల్ చుట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ ఇంటిని, ఇంట్లో సభ్యులను పరిశీస్తున్నారు. సహజంగానే సంపూను చేస్తే నవ్వు రావడం ఖాయం. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో విభిన్నమైన గెటప్‌లో సంపూ కనిపించడం మరీంత వినోదంగా మారింది.

  సూట్‌కేసులు తెచ్చుకోవడానికి బిగ్ టాస్క్

  సూట్‌కేసులు తెచ్చుకోవడానికి బిగ్ టాస్క్

  బిగ్ బాస్ అప్పగించిన బట్టల సూట్‌కేసులను తిరిగి వెనుకకు తెప్పించుకోవడానికి ఇంటి సభ్యులకు పెద్ద టాస్కే పెట్టారు. ఇంటి ఆవరణలో హోమాన్ని రాజేయాలని, అయితే నిరంతరం హోమం మండుతూనే ఉండేలా ఇద్దరు సభ్యులు జాగ్రత్త పడాలని సూచించాడు. అలా హోమంలో మంట ఆరిపోకుండా ఉంటే ఎవరి బట్టలు వారికి అప్పగిస్తామని బిగ్‌బాస్ వెల్లడించారు.

  నిరంతరంగా హోమం

  నిరంతరంగా హోమం

  బిగ్ బాస్ ఆదేశాల మేరకు హోమాన్ని ఆరిపోకుండా కాపాడుకొంటూ ఒక్కొక్కరు బట్టల సూట్‌కేసులను వెనుకకు తెచ్చుకొంటున్నారు. అలా తెచ్చుకొన్న వారిలో మధుప్రియ, హరితేజ, శివబాలాజీ, కల్పన ఉన్నారు. ఒక సంపూ వంతు ఎప్పుడొస్తుందో అని వేచిచూస్తున్నారు. సంపూ మాత్రం నిక్కరు, ధోతి, లుంగీతో పైన కండువా వేసుకొని నెట్టుకొస్తున్నారు.

  అమ్మాయిని పంపించండి..

  అమ్మాయిని పంపించండి..

  ఇలా సాగుతున్న నేపథ్యంలో ప్రిన్స్ చాలా నిరుత్సాహానికి లోనవుతున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నవారంతా కూడా తనకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారే.. అందులో పెళ్లైనవారేనని ప్రిన్స్ అన్నారు. తనకు మంచి కంపెనీ లేదని, దయచేసి ఓ అమ్మాయిని పంపించండి. కనీసం స్నేహంగానైనా ఉండటానికి అవకాశం ఉంటుంది అని బిగ్‌బాస్‌కు ప్రిన్స్ మొరపెట్టుకొన్నారు. ప్రిన్స్ మొర ఆలకిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.

  అనసూయ వైల్డ్ కార్డ్ ఎంట్రీ

  అనసూయ వైల్డ్ కార్డ్ ఎంట్రీ

  ఇక బిగ్‌బాస్ ఇలా సాగుతుంటే బయట ఆసక్తికరమైన వార్త ఒకటి ప్రచారం జరుగుతున్నది. త్వరలోనే అనసూయ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు ఓ సంచలన వార్త ఒకటి వైరల్‌గా మారింది. ఒకవేళ ఈ వార్త నిజమైతే కొందరు ఇంటి సభ్యులకు కొంత సంతోషంగా ఉండవచ్చు కానీ.. ప్రిన్స్‌కు మాత్రం నిరాశే మిగిలవచ్చు. ఎందుకంటే అనసూయ వివాహిత కావడమే.

  హరితేజ అత్యుత్సాహం

  హరితేజ అత్యుత్సాహం

  బిగ్‌బాస్ హౌస్‌లో తొలిసారి ఓ మహిళ, పురుషుల మధ్య గొడవ జరిగింది. యాంకర్ హరితేజ అత్యుత్సాహం ప్రదర్శించడం ఈ గొడవకు కారణమైంది. ఆదర్శ్ బాలకృష్ణ, ప్రిన్స్ మాట్లాడుకుంటూ ఇక్కడ పెళ్లి కానిది నీవేనని ప్రిన్స్‌తో అన్నాడు. ఆ మాట విన్న హరితేజ ఇప్పుడు ఆ విషయం ఎందుకు.. పెళ్లి ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు అని గొడవపడింది.

   కంటతడి పెట్టిన హరితేజ

  కంటతడి పెట్టిన హరితేజ

  మాటా మాట పెరిగడంతో వివాదం పెద్దగా మారింది. ఆ తర్వాత మనస్తాపం చెందిన హరితేజ కంటతడి పెట్టింది. అయితే సభ్యుల సూచన మేరకు ముగ్గురు కలిసి మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకొన్నారు. ఒకరికొకరు సారీ చెప్పుకొని హరిప్రియను ఆదర్శ్ కౌగిలించుకొని ఓదార్చడం గమనార్హం.

  English summary
  Telugu Version of Bigboss started with High Energy. Young Tiger Entry into show makes worthy. His entry makes audience get thrilled. some of the contestants like Katti Mahesh, Katti Karthika, Madhupriya are really shock for the Television, Tollywood audience.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X