For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కెప్టెన్ ఇంత కఠినమా? సంపూ, మధుప్రియకు షాక్... బిగ్‌బాస్‌లో మళ్లీ టెన్షన్!

  By Bojja Kumar
  |

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా సాగుతున్న బిగ్ బాస్ విజయవంతంగా తొలివారం పూర్తి చేసుకుని సోమవారం నుండి రెండో వారంలో అడుగు పెట్టింది. తొలివారం బిగ్ బాస్ షో నుండి నటి జ్యోతి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

  రెండో వారం మొదలైన వెంటనే మళ్లీ బిగ్ బాస్ ఇంట్లో ఎలిమినేషన్ టెన్షన్ మొదలైంది. ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుండి ఎవరు బయటకు వెళతారు అనేది ఈ వారాంతంలో తెలియనుంది. ఈ సారి ఎలిమినేషన్ కోసం ఎవరు నామినేట్ అయ్యారు, బిగ్ బాస్ ఇంట్లో జరిగిన పరిణామాలు ఏమిటి? అనేది చూద్దాం.

  కెప్టెన్ మరీ ఇంత కఠినమా?

  కెప్టెన్ మరీ ఇంత కఠినమా?

  బిగ్ బాస్ కెప్టెన్‌గా కొనసాగుతున్న కల్పన వ్యవహార శైలిపై కొందరు ఇంటి సభ్యులు అసంతృప్తిగా ఉన్నారు. పనులు చేయించే విషయంలో ఆమె చాలా కఠినంగా వ్యవహరిస్తోందని, తాము పనులు చేస్తున్నా సరిగా చేయడం లేదంటూ టార్చర్ పెడుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

  Bigg Boss Telugu : Mumaith Khan Trolled For Hugging Dhanraj
  ఇదేమైనా హాస్టలా? ఏడ్చేసిన ముమైత్

  ఇదేమైనా హాస్టలా? ఏడ్చేసిన ముమైత్

  టాయిలెట్ సరిగా క్లీన్ చేయడం లేదని ముమైత్ ఖాన్ మీద కల్పన ఫైర్ అవ్వడంతో ఆమె ఇతర ఇంటి సభ్యుల వద్దకు వచ్చి తన గోడు వెల్లబోసుకుంది. కెప్టెన్ కల్పన తీరు తనను బాధించిందని, ఆమె వల్ల ఇక్కడ హాస్టల్ కంటే దారుణంగా పరిస్థితులు తయారయ్యాయని ముమైత్ ఏడ్చేసింది. ఇతర ఇంటి సభ్యులు ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేశారు.

  సమీర్ మాదిరిగా చెత్తగా మాట్లాడేవారు

  సమీర్ మాదిరిగా చెత్తగా మాట్లాడేవారు

  తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో.... కెప్టెన్ కల్పన బిగ్ బాస్ కెమెరా ముందుకొచ్చి తన మనసులోని మాటలను బయట పెట్టారు. సమీర్ చాలా ఎక్కువ మాట్లాడారని బాధపడ్డారు. ‘మీరేదో మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యారు కాబట్టే ఇలా చేస్తున్నారు' అని సమీర్ నా గురించి చాలా ఎక్స్ ప్రెసివ్‌గా అన్నారు. ఆయన నటుడు అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. సమీర్ లాగా సమాజంలో 100 మంది ఉంటారు. నాలాంటి వారి గురించి చీ అని, చెత్తగా చెప్పి కారి ఉమ్మి మాట్లాడటం లాంటివి చేస్తారు. ఇలాంటి వాళ్లని చూసినపుడు నేనెందుకు అనవసరంగా ఇక్కడకు వచ్చి కష్టం తీసుకుంటున్నాను అనిపిస్తుంది... అని కల్పన తన మనసులోని మాటను బిగ్ బాస్ ముందు బయట పెట్టారు.

  కెమెరాలు బద్దలు కొట్టి బయటకు వెళ్లగలను

  కెమెరాలు బద్దలు కొట్టి బయటకు వెళ్లగలను

  నేనే ఈ ఇంటి నుండి బయటకు వెళ్లాలనుకుంటే ఎవ్వరూ నన్ను ఆపలేరు. ఆ సమయంలో అన్ని కెమెరాలు ధ్వంసం చేసి వెళ్లగల గట్స్ ఉన్నాయి. చచ్చినా సరే ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు. డోర్ ఓపెన్ కాకుంటే దాన్ని బద్దలు కొట్టి వెళ్లేంత ధైర్యం ఉంది.... అని కెప్టెన్ కల్పన బిగ్‌ బాస్ తో వ్యాఖ్యానించారు.

  ఎలిమినేషన్ రౌండ్

  ఎలిమినేషన్ రౌండ్

  సోమవారం ఎలిమినేషన్ రౌండ్ మొదలైన సందర్భంగా కెప్టెన్ కల్పనకు బిగ్ బాస్ ఎలిమినేషన్ నామినేషన్ నుండి ఒకరిని రక్షించే ప్రత్యేక అధికారం ఇచ్చారు. దీంతో కత్తి కార్తీక పేరు చెప్పి ఎలిమినేషన్ రౌండ్ నుండి ఆమెను రక్షించారు కల్పన. కెప్టెన్ కాబట్టి కల్పన ఎలిమినేషన్ నుండి సురక్షితమనే విషయం తెలిసిందే.

  సంపూ, మధు ప్రియలకు షాక్

  సంపూ, మధు ప్రియలకు షాక్

  సీక్రెట్ టాస్క్ సరిగా పూర్తి చేయని కారణంగా సమీర్‌ను నేరుగా ఎలిమినేషన్‌కు నామినేట్ చేశారు బిగ్ బాస్. తర్వాత ఒక్కొక్కరూ వెళ్లి ఎవరిని నామినేట్ చేయాలనే విషయం బిగ్ బాస్ కు వెల్లడించారు. ఇంట్లో మొత్తం 13 మంది సభ్యులు ఉంటే.... ఒకరిద్దరు మినహా అందరూ సంపూర్ణేష్ బాబు, మధుప్రియ పేర్లను నామినేట్ చేశారు. సంపూను 9 మంది, మధు ప్రియను 10 మంది ఎలిమినేషన్ రౌండ్ కు నామినేట్ చేశారు. వీరి తర్వాత ప్రిన్స్‌ను అత్యధికంగా ముగ్గురి నుండి నామినేషన్లు పడ్డాయి.

  నామినేట్ అయింది వీరే

  నామినేట్ అయింది వీరే

  సమీర్ నేరుగా నామినేట్ కాగా.... ప్రిన్స్, సంపూర్ణేష్ బాబు, మధు ప్రియను ఇంటి సభ్యుల ఓటింగ్ ఆధారంగా ఎలిమినేషన్‌కు నామినేట్ చేస్తున్నట్లు బిగ్ బాస్ ప్రకటించారు.

  సంపూ, మధు ఫ్రియ ప్రవర్తనే కారణం

  సంపూ, మధు ఫ్రియ ప్రవర్తనే కారణం

  ఎక్కువ మంది సంపూ, మధు ప్రియ పేర్లను నామినేట్ చేయడానికి వారి ప్రవర్తనే కారణం. అందరూ ఒకే కారణంతో వీరిని నామినేట్ చేశారు. ఈ ఇద్దరూ ఇంట్లో ఉండలేక పోతున్నారని, మెంటల్‌గా సరిగా లేరని, మధుప్రియ హెల్త్ పరంగా కూడా సరిగా ఉండటం లేదని, వారు గేమ్ స్పిరిట్ ను అర్థం చేసుకోవడం లేదని... అలాంటపుడు వారు బయటకు వెళితేనే మరింత సంతోషంగా ఉంటరనే ఉద్దేశ్యంతో వారి పేర్లను నామినేట్ చేస్తున్నట్లు బిగ్ బాస్‌కు తెలిపారు.

  సంపూ, మధు ప్రియలను నామినేట్ చేసింది వీరే

  సంపూ, మధు ప్రియలను నామినేట్ చేసింది వీరే

  ఆదర్శ్, ప్రిన్స్, హరితేజ, ధనరాజ్, అర్చన, సమీర్, మహేష్ కత్తి, కల్పన, శివ బాలాజీ... సంపూను నామినేట్ చేశారు. మధు ప్రియను నామినేట్ చేసిన వారిలో ఆదర్శ్, ప్రిన్స్, హరితేజ, ముమైత్, ధనరాజ్, అర్చన, సమీర్, సంపూ, మహేష్ కత్తి, శివ బాలాజీ, కల్పన ఉన్నారు.

  ప్రిన్స్ మీద

  ప్రిన్స్ మీద

  ప్రిన్స్‌ను.... నామినేట్ చేసిన వారిలో మధుప్రియ, ముమైత్ ఖాన్, కత్తి కార్తీక ఉన్నారు.

  English summary
  BiggBoss Telugu Eposode-9 details. The contestants give their eviction nominations for the week and perform a romantic task assigned by Bigg Boss!
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X