Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 4 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- News
నేరం మీది కాదు..ఆ అదృశ్య వ్యక్తిది: ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు: నిమ్మగడ్డకు ముద్రగడ..ఘాటుగా
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Sports
IPL 2021: రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి కుమార సంగక్కర!
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వీడియో: రష్మీని పెళ్లి చేసుకోడానికి వచ్చిన క్రేజీ స్టార్.. సీట్లో నుంచి లేచి వెళ్లిపోయిన రోజా.!
రష్మీ గౌతమ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. చాలా కాలం కిందట సినిమాల్లోకి ప్రవేశించినా ఈ ముద్దుగుమ్మకు సరైన బ్రేక్ రాలేదు. కానీ, ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతున్న 'జబర్ధస్త్' షోలోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రం ఆమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఇందులో యాంకర్ అయిన తర్వాత రష్మీకి ఊహించని స్థాయిలో క్రేజ్ వచ్చింది. దీంతో ఆమెకు సినిమాలతో పాటు ఎన్నో షోలలో అవకాశం వచ్చింది. ఇక, ఈ మధ్య రష్మీని ప్రధానంగా తీసుకుని సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా ఆమెను పెళ్లి చేసుకోడానికి ఓ క్రేజీ స్టార్ వచ్చాడు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ వచ్చింది ఎవరు.? వివరాల్లోకి వెళితే...

రష్మీకి అతడితో ఎఫైర్ ఉందని ప్రచారం
యాంకర్ రష్మీ పాపులర్ అవడానికి మరో కారణం కూడా ఉంది. అదే.. జబర్ధస్త్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయిన సుడిగాలి సుధీర్‌తో ఆమె ప్రేమలో పడిందన్న టాక్ రావడమే. వీళ్లిద్దరూ ఆ షోలో కలిసి పని చేయడంతో ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. రష్మీ - సుధీర్ మధ్య ఎఫైర్ ఉందని కొందరు అంటే.. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని మరికొందరు అంటున్నారు.

ఆ పెళ్లి నుంచి అస్సలు ఆగట్లేదు
ఓ పండుగ సందర్భంగా రష్మీ.. సుధీర్ పెళ్లి చేసుకున్నట్లు ప్రత్యేకమైన షో చేశారు. ఇందులో బుల్లితెర వల్ల ఫేమస్ అయిన వారందరూ కలిసి ఈ జంటను ఒక్కటి చేసినట్లు చూపించారు. చివర్లో సుధీర్ కల అని చూపించారు. ఈ షో తర్వాత రష్మీ - సుధీర్ ఎంతో ఫేమస్ అయిపోయారు. అప్పటి నుంచి వీళ్లిద్దరిపై వస్తున్న వార్తలు ఇంకా పెరిగిపోయాయి.

ఎన్నో సార్లు చెప్పారు.. అయినా ఆగట్లేదు
బుల్లితెర.. వెండితెరలో ఎవరి విషయంలో జరగని విధంగా రష్మీ.. సుధీర్ వ్యవహారంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూమర్లు చెక్ పెట్టేందుకు ఇద్దరూ ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. చాలా ఇంటర్వ్యూలతో పాటు సోషల్ మీడియా వేదికగా వాటిని ఖండించారు. అయినప్పటికీ ఈ ప్రచారానికి పుల్‌స్టాప్ పడడం లేదు. పైగా ఇంకా ఎక్కువ అవుతోంది.

వాళ్లంతా ఈ ఇద్దరినే ఫోకస్ చేస్తున్నారు
టెలివిజన్‌లో యాంకర్ రష్మీ.. సుడిగాలి సుధీర్‌కు ఉన్న క్రేజ్‌ను వాడుకోడానికి ఫిల్మ్ మేకర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి నటిస్తే సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక, బుల్లితెరపైన అయితే వీళ్లిద్దరిపై ప్రత్యేకమైన సన్నివేశాలు రాస్తున్నారు. తమ షో టీఆర్పీని పెంచుకునే చర్యల్లో భాగంగానే ఇలా చేస్తున్నారు.
రష్మీని పెళ్లి చేసుకోడానికి వచ్చిన క్రేజీ స్టార్
తాజాగా ఈ జంటను జబర్ధస్త్ నిర్వహకులు మరోసారి వాడుకున్నారు. వచ్చే వారం రాబోయే ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌లో సుధీర్ టీమ్ చేసిన స్కిట్‌లో రష్మీ రాబోతుంది. ఇందులో ఆమెకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. రష్మీని పెళ్లి చేసుకోడానికి వచ్చే వ్యక్తిగా క్రేజీ స్టార్ బిత్తిరి సత్తి ఎంటర్ అయ్యాడు. అతడి రాకతో షోకు కొత్త ఊపు వచ్చినట్లైంది.

సీట్లో నుంచి లేచి వెళ్లిపోయిన రోజా.!
ఇదే ఎపిసోడ్‌లో రాకింగ్ రాకేష్ స్కిట్‌లో రష్మీ, అనసూయ, రోజా, పోసాని కృష్ణ మురళీలు చిన్నప్పుడు ఎలా ఉన్నారో చూపించే ప్రయత్నం చేశారు. వాళ్లంతా ఒకే స్కూల్‌లో చదువుకున్నట్లు స్కిట్ చేశారు. వాళ్ల గోల పడలేక మాస్టర్ పంపించేయమని అటెండర్‌కు చెప్పగా, అతడు బెల్ కొడతాడు. ఆ సమయంలో ఆర్టిస్టులతో పాటు జడ్జ్ సీట్లో ఉన్న రోజా కూడా లేచి వెళ్లిపోయింది.