»   » బిత్తిరి సత్తిపై దాడిలో జై పవన్ కల్యాణ్.. వివాదంలో కొత్త ట్విస్ట్

బిత్తిరి సత్తిపై దాడిలో జై పవన్ కల్యాణ్.. వివాదంలో కొత్త ట్విస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
బిత్తిరి సత్తి దాడిలో జై పవన్ కల్యాణ్.. వివాదంలో కొత్త ట్విస్ట్ !

ప్రముఖ యాంకర్, నటుడు బిత్తిరి సత్తిపై ఓ వ్యక్తి దాడి చేయడం మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. దాడికి గురైన బిత్తిరి సత్తికి పలువురు సానుభూతితో మద్దతు తెలిపారు. అయితే ఈ వివాద ఘటనలో పవన్ కల్యాణ్‌కు అనుకూలంగా నినాదాలు చేసినట్టు వార్తలు వచ్చాయి. మీడియాలో ఈ అంశం కీలకం కావడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ దాడి వెనుక ఏమైనా కుట్ర ఉందా అనే కోణంలో చర్చ జరుగుతున్నది. తెలంగాణ యాస, భాషతో ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో తీన్మార్ కార్యక్రమంలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిత్తిరి సత్తిపై సోమవారం ఉదయం దాడి జరిగిన సంగతి తెలిసిందే.

 అందుకే బిత్తిరి సత్తిపై దాడి చేశా..

అందుకే బిత్తిరి సత్తిపై దాడి చేశా..

బిత్తిరి సత్తిపై దాడి చేసిన వ్యక్తిని మణికంఠగా గుర్తించారు. దాడికి పాల్పడిన మణికంఠను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు పాల్పడిన మణికంఠ మాట్లాడుతూ.. తెలంగాణ భాషను కించపరిచే విధంగా బిత్తిరి సత్తి తీన్మార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. తెలంగాణను అమితంగా అభిమానించే వ్యక్తిగా నేను చాలా మనస్తాపానికి గురయ్యాను. అందుకే అతడిని దాడి చేశాను అని మణికంఠ అన్నారు.

 అలా చేస్తే వదిలపెట్టను..

అలా చేస్తే వదిలపెట్టను..

నా స్వస్థలం హైదరాబాద్. సొంత ఇల్లు ఉంది. నాకు హిందుత్వ సంస్థలతో సంబంధం లేదు. కేవలం తెలంగాణ భాషను వెక్కిరించినందుకే దాడి చేశాను. తెలంగాణను కించపరిచే ఎవర్ని వదిలిపెట్టను మణికంఠ హెచ్చరించారు.

 పవన్‌కు అనుకూలంగా నినాదాలు

పవన్‌కు అనుకూలంగా నినాదాలు

బిత్తిరి సత్తిపై దాడికి పాల్పడిన వ్యక్తి జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం ఎవరికీ అంతుపట్టని విషయంగా మారింది. బిత్తిరి సత్తిపై దాడికి, పవన్ కల్యాణ్‌కు సంబంధమేమిటి అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది.

 పవన్ కల్యాణ్ పేరు ఎందుకు

పవన్ కల్యాణ్ పేరు ఎందుకు

తీన్మార్‌లో ప్రముఖుల తీరును ఎండగట్టే బిత్తిరి సత్తి ఈ మధ్యకాలంలో జనసేనను గానీ, పవన్ కల్యాణ్‌ను గానీ విమర్శించిన దాఖలాలు లేవు. మణికంఠపై బిత్తిరి సత్తి వర్గీయులు ప్రతీదాడి చేసినప్పడు పవన్ కల్యాణ్ పేరు ఉచ్చరిస్తూ నినాదాలు ఎందుకు చేశాడు అనేది చర్చనీయాంశమైంది.

 మణికంఠకు పవన్ కల్యాణ్‌తో

మణికంఠకు పవన్ కల్యాణ్‌తో

బిత్తిరి సత్తి దాడి వెనుక కారణాలపై సదరు ఛానెల్ ఆరా తీస్తున్నది. దాడికి పాల్పడిన మణికంఠకు జనసేనతో ఏమైనా సంబంధం ఉందా? లేక అతను పవన్ కల్యాణ్ అభిమానా? అనే కోణంలో వివరాలను సేకరిస్తున్నారు.

 ఆందోళనలో యాంకర్లు

ఆందోళనలో యాంకర్లు

బిత్తిరి సత్తి దాడి వ్యవహారం ఇతర యాంకర్లను ఆందోళనకు గురిచేస్తున్నది. యాజమాన్యం ఎజెండా ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించే తమపై ఎవరైనా దాడి చేస్తారా అనే గుబులు వారిలో మొదలైనట్టు తెలుస్తున్నది. కొందరు తమ సన్నిహితుల వద్ద ఈ విషయాన్ని చర్చించినట్టు సమాచారం.

English summary
Famous Anchor Bittiri Satti attacked by Unidentified man. Attacker was alleged that he was hurted the way Bittiri Satti was projecting the Telangana Language. I will not spare anybody if Telangana language misused. And in this incident, he has given slogans of Pawan Kalyan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu