Brahmamudi November 3rd Episode: కోయిలి నిజ స్వరూపం తెలుసుకున్న రాజ్- కావ్య... గేమ్ స్టార్ట్ చేసిన కళావతి
Photo Courtesy: JioHotstar
ఆస్తి మొత్తం నీకు ఇచ్చేసి మేం కృష్ణా, రామా అనుకుంటామని కోయిలికి చెప్పడంతో ఆమెకు ఆశ కలుగుతుంది. మీ ఆస్తి నాకేం వద్దని రాహుల్ చెప్పగా.. కోయిలి అతనిపై కోప్పడి రాజ్, కావ్యలు ఇక్కడే ఉండమని చెబుతుంది. కోయిలి ఇంటికి వచ్చింది రాజ్, కావ్య అని గుర్తుపట్టిన రాహుల్.. వాళ్లిద్దరినీ బయటికి తీసుకెళ్లి మీరెన్ని నాటకాలు వేసినా నేను మీతో రాను అని చెబుతాడు. అనవసరంగా మీ టైం వేస్త్ .. ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని వార్నింగ్ ఇస్తాడు. నువ్వు రాకుండా వెళ్లేది లేదని .. బంగారం లాంటి మా అక్కని వదిలిపెట్టి ఈ దరిద్య్రాన్ని తగులుకున్నావని మండిపడతారు రాజ్ - కావ్య. మీరు ఎవరో? ఎందుకోసం వచ్చారో? కోయిలికి చెబితే వాళ్లే మిమ్మల్ని బయటికి గెంటేస్తారని రాహుల్ బెదిరిస్తాడు.
అయితే నువ్వు కూడా రిచ్ పర్సన్ కాదని, జేబులో చిల్లి గవ్వ కూడా లేదని మేం కూడా నిజం చెబుతామని కావ్య బెదిరించడంతో రాహుల్ షాక్ అవుతాడు. ఇంతలో కోయిలి రాగా మేం ఫైవ్ స్టార్ హోటల్‌లో మాత్రమే తింటామని రాజ్, కావ్యలు చెప్పడంతో కోయిలీ అక్కడి నుంచి తెప్పిస్తానని చెబుతుంది. రాజ్, కావ్యలు గెటప్‌లు తీసేసి రిలాక్స్ అవుతుండగా రంజిత్ చూస్తాడు. దాంతో అలర్ట్ అయిన రాజ్ కొద్దిలో తప్పించుకుంటాడు. రాజ్, కావ్య చెప్పిన ఐటెం తెప్పించడానికి 25 వేలు ఖర్చు కావడంతో రంజిత్ తల పట్టుకుంటాడు. రాహుల్ కోసం వెళ్లిన రాజ్, కావ్యలు ఏం చేస్తున్నారోనని స్వప్న బాధపడుతుంటుంది. ఇంతలో అప్పూ వచ్చి కావ్య అక్క, బావగారు ఏదో ఒకటి చేసి రాహుల్‌ని ఇంటికి తీసుకొస్తారని ధైర్యం చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక నవంబర్ 3వ తేదీ ఎపిసోడ్ 868లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
హోటల్ నుంచి మేం చెప్పిన ఐటెమ్స్ తెప్పించారా? లేదా? అని అన్ని చూస్తుంది దీప. కూర్చొని వడ్డించుకోమని కోయిలి చెప్పగా.. మేం వడ్డించుకోవడం ఏంటీ? పనివాళ్లు లేరా? అని కావ్య అడగ్గా కోయిలి షాక్ అవుతుంది. వడ్డించడానికి పనివాళ్లు లేరని ఇలాంటి డబ్బా రాణి నీకొద్దని అంటుంది కావ్య. పనివాళ్లు ఉండేవారని మొన్ననే సస్పెండ్ చేశామని అంటాడు రంజిత్. మా కంపెనీ సీక్రెట్స్ అన్ని పక్కింటి వాళ్లకి చెప్పేస్తున్నారని ఉద్యోగంలో నుంచి తీసేశామని అంటాడు. ఒకరు వడ్డించుకుండా మాకు తినే అలవాటు లేదని రాజ్ అనగా.. మనవాడిని తీసుకుని వెళ్లిపోదామని అంటుంది కావ్య. మీకు నేను వడ్డిస్తానని అంటుంది కోయిలి.
ఐటెమ్స్ అని తినగా ఫుడ్ టేస్ట్ బాలేదని కాకా హోటల్ నుంచి తెప్పించారా అని కావ్య మండిపడుతుంది. కాకా హోటల్ కాదు ఫైవ్ స్టార్ హోటల్ నుంచి అంటుంది కోయిలి. దీనిని పెళ్లి చేసుకుని ఎలా తింటావని, వెళ్లిపోదామని అనగా రాహుల్ మండిపడతాడు. రేపు ఇంతకన్నా పెద్ద హోటల్ నుంచి తెప్పిస్తామని కోయిలి అంటుంది. ఇంతకన్నా పెద్ద హోటలా అని రంజిత్ కంగారు పడుతుండగా.. లోపల అంతా డొల్ల అన్న మాట అని కావ్య సెటైర్లు వేస్తుంది. ఆ దెబ్బకి రంజిత్, కోయిలి షాక్ అవుతుంది. గుండ్రాయి లాంటి ఆడది ఇంట్లో ఉండగా.. హోటల్ తిండి ఎందుకు అని అడుగుతుంది కావ్య. మాకు హోటల్ తిండి అస్సలు పడదని కావ్య, రాజ్‌లు అనగా.. మీరే కదా హోటల్ ఫుడ్ కావాలన్నారని అడుగుతాడు రంజిత్.
అసలు మా తాయారు వంట చేస్తే 10 రోజుల దాకా తినేవాడిని అంటాడు రాజ్. రేపటి నుంచి దీంతో వండిద్దామని కావ్య అనగా.. నాకు వంట రాదు బామ్మ అని అంటుంది కోయిలి. దీనిని చేసుకుని నువ్వెలా సుఖ పడతావని కావ్య అడగ్గా.. నేను వంట నేర్చుకుంటానని చెబుతుంది కోయిలి. నాకు బామ్మగారు వంట నేర్పిస్తారని చెప్పగా.. నువ్వు తట్టుకోలేవని అంటాడు రాజ్. మీకు వంట నేర్చుకుంటాను, మీకు వండిపెడతాను, మిమ్మల్ని శాటిస్‌ఫై చేస్తానని అంటుంది కోయిలి. వద్దు వద్దు అంటూనే ఫుడ్ మొత్తం ఖాళీ చేసేశారని రగిలిపోతుంది కోయిలి. ఇంతలో రంజిత్ వచ్చి మన పని అయిపోయిందని, వాళ్ల ఒక్కపూట ఫుడ్ బిల్లు 30 వేలు అయ్యిందని చెప్పడంతో కోయిలి షాక్ అవుతుంది.
ఫైవ్ స్టార్ హోటల్ నుంచి తెప్పిస్తే ఇక మనం పైకి పోవడమేనని అంటాడు. నాలుగు రోజులంటే మనల్ని నమిలేస్తారని, మహా అంటే ఇంకో 2 లక్షలు అవుతాయి అంతేకదా? కానీ వాళ్ల దగ్గర కోట్లకు కోట్లు ఉన్నాయని అంటుంది కోయలి. ఇప్పటికే మనకి పీకల్లోతు అప్పులు ఉన్నాయని కంగారుపడతాడు. నాలుగు రోజులు వాళ్లకి నచ్చినట్లుగా ఉంటూ వాళ్లని సంతోషపెడితే ఆ ముసలివాళ్ల ఆస్తి అంతా రాహుల్ గాడికి రాసిస్తారు.. వాడిని పెళ్లి పేరు చెప్పి వెంటనే వాడి చేత ఆస్తి రాయించుకుంటామని కోయిలి చెబుతుంది. అప్పుడు అందరినీ కట్టకట్టి బయటికి తోసేయొచ్చని అంటుంది. ఈ ముసలొళ్ల ఆస్తితో పాటు ఆ రాహుల్ గాడి ఆస్తి మనకి బోనస్‌లా కలిసొస్తుందని చెబుతుంద కోయిలి.
వాళ్ల మాటల్ని చాటుగా విన్న రాజ్, కావ్యలు బయటికొచ్చి.. వాళ్ల దగ్గర ఏం లేదని ఎప్పుడో చెప్పాను, ఇద్దరూ దొంగలేనని అంటుంది కావ్య. మనకి క్లారిటీ వచ్చింది.. ఆ రాహుల్ గాడికి కళ్లు తెరిపించాలి, ఇంకో ఆట ఆడిద్దామని అంటాడు రాజ్. దాని మైకంలో నుంచి జుట్టు పట్టుకుని బయటికి తీసుకురావాలని చెబుతాడు. రాహుల్ నమ్మాలంటే మనం ఏం చేయాలని ప్రశ్నిస్తుంది కావ్య. వీళ్లని మనం పెట్టే టార్చర్ సరిపోదని ఇంకా డోస్ పెంచాలని అంటాడు రాజ్. గోల్డ్ బాబని ఒకడున్నాడు.. దుబాయ్ రిటర్న్, వాడిని దింపుతానని చెబుతాడు. వాడి ఓవరాక్షన్ వల్ల మనం దొరికిపోతామని కావ్య భయపడగా.. వీళ్లకి వాడే కరెక్ట్ అని చెబుతాడు రాజ్.
అవసరమైతే 10 లక్షలు అప్పు చేద్దాం, కానీ ఆ ముసలివాళ్ల ఆస్తిని రాయించుకునే వరకు వదలొద్దని అంటుంది కోయిలి. నువ్వు చెప్పింది చెప్పినట్లు జరుగుతుందా అని రంజిత్ అడుగుతాడు. ఇంతలో కావ్య వచ్చి నువ్వు పెళ్లి చేసుకోబోయేది నా మనవడినా? ఈ దరిద్రుడినా? అని అడుగుతుంది. వీడితో రాసుకుని పోసుకుని ఎందుకు తిరుగుతున్నావని నిలదీస్తుంది. వీళ్ల అమ్మకి తమ్ముడినని రంజిత్ చెప్పగా.. నీ వరస దీనికి మొగుడిలా ఉందని కావ్య అనడంతో కోయిలి, రంజిత్‌లు వణికిపోతారు. వంట నేర్పిస్తానని, దాని కంటే ముందు ఇల్లు, వంటగది మెరిసిపోవాలని చెబుతుంది కావ్య. ఇంతలో రాజ్, కావ్యల ముందుకు చీర కట్టుకుని వస్తుంది కోయిలి.
ఇలాంటి చీరతో పని చేస్తారా? అని కావ్య మండిపడుతుంది. కోయిలితో ఇళ్లంతా శుభ్రం చేయిస్తుంది కావ్య. ఆమె ఇల్లు ఊడుస్తుండగా రాజ్య, కావ్యలు అరటి తొక్కలు, చెత్తను ఇల్లంతా పడేస్తారు. ఇంతలో రాహుల్ చెప్పులు వేసుకుని ఇంట్లో తిరుగుతుండగా కోయిలి కోప్పడుతుంది. పనిమనిషిలా ఉన్న కోయిలిని చూసి రాహుల్ షాక్ అవుతాడు. తనకి పనులన్నీ చేయాల్సిన అవసరం లేదని కావ్యపై రాహుల్ మండిపడతాడు. ఇంటిని శుభ్రంగా ఉంచమన్నందుకు నా మీదే కేకలు వేస్తావా? వెళ్లిపోదామని రాజ్‌తో అంటుంది కావ్య. దాంతో వాడికి బుద్ధి లేదు, నేను క్లీన్ చేస్తానని చెబుతుంది కోయిలి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










