Brahmamudi October 17th Episode: రుద్రాణి ప్లాన్ అట్టర్ ఫ్లాప్... రాజ్‌ని అడ్డంగా ఇరికించేసిన మీడియా

Photo Courtesy: JioHotstar

మహిళా సంఘాలు ప్రతినిధులు ఇంటికొచ్చి గోల చేయడంతో వారిని మరింత రెచ్చగొడుతుంది రుద్రాణి. మా రేంజ్ ఏంటీ? వూళ్లో మా పవర్ ఏంటీ? అంటూ నానామాటలు అంటుంది. దాంతో మీరు కావ్యని వేధిస్తున్నారని, ఆమె కడుపులోని బిడ్డను చంపాలని చూస్తున్నారని కేసు పెడితే మీరంతా జైలుకు వెళ్తారని వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో అపర్ణ జోక్యం చేసుకుని మా కోడలిని మేం చాలా బాగా చూసుకుంటున్నామని చెబుతుంది. మా మాటలు నమ్మేలా అనిపించడం లేదని మహిళా సంఘాల నేతలు అంటారు. ఇంతలో కావ్య వచ్చి నాకు, మా ఆయనకి ఎలాంటి గొడవలు లేవని చెబుతుంది. మీరెందుకు మీ పుట్టింటికి వెళ్లారని అడగ్గా.. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా అని అంటుంది కావ్య. ఆమె హామీతో మహిళా సంఘాల నేతలు వెళ్లిపోతారు.

తన ప్లాన్‌ని కావ్య ఫెయిల్ చేయడంతో రగిలిపోతుంది రుద్రాణి. విడాకుల పేపర్స్ బయటికి తీసి రాజ్‌తో కావ్యని రెచ్చగొట్టించి దాని మీద సంతకాలు పెట్టించి వారిని విడగొట్టాలని ప్లాన్ చేస్తుంది. ఇంట్లో జరుగుతున్న గొడవల కారణంగా రాజ్‌పై సీతారామయ్య సీరియస్ అవుతాడు. కావ్య ఇంటికి వెళ్లిన రాజ్.. ఇంటికి వస్తావా? నాకు విడాకులు ఇచ్చేస్తావా? అని వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక అక్టోబర్ 17వ తేదీ ఎపిసోడ్ 854లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial October 17th 2025 Episode 854 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

అల్లుడుగారితో ఏం మాట్లాడొద్దని కావ్యని కృష్ణమూర్తి, కనకంలు లోపలికి తీసుకెళ్లిపోతుండగా.. రాజ్ వారిని ఆపి దీని మీద సంతకం పెట్టి వెళ్లమంటాడు. అవి ఏంటని కావ్య అడగ్గా.. విడాకుల పేపర్లు అని చెబుతాడు. ఆ మాటలతో కావ్య, కనకం, కృష్ణమూర్తిలు షాక్ అవుతారు. నాతో కలిసుండటం కంటే నీకు నీ బిడ్డే ముఖ్యమైనప్పుడు ఇక మనం కలిసుండటంలో అర్ధం లేదని అంటాడు. నీకు నీ బిడ్డ కావాలంటే ఇందులో సంతకం పెట్టు.. నేను నా దారిన వెళ్లిపోతాను, లేదు కలిసి ఉండాలంటే ఇప్పుడే నాతో రావాలి అని డెడ్‌లైన్ పెడతాడు రాజ్.

మీరు కూడా ఇలా ఆవేశంలో నిర్ణయం తీసుకుంటే ఎలా అని అడుగుతాడు కృష్ణమూర్తి. ఇప్పుడు కొత్తగా సంతకం చేయడం ఎందుకు? గతంలోనే ఒకసారి సంతకం చేసి ఇచ్చానని, ఆ పేపర్లు పోయాయా? అని నిలదీస్తుంది కావ్య. సంతకం చేస్తే వెళ్లిపోతారు? అంతేకదా? అని పెన్ను కోసం లోపలికి వెళ్తుంది. ఇక్కడ ఇంత గొడవ జరుగుతుండగా పక్కింటి ఆవిడ వచ్చి కొంచెం పంచదార ఉంటే ఇస్తావా అని అంటుంది. పండక్కి అల్లుడుగారు వచ్చారు అని అడుగుతుంది. ఆ వెంటనే కావ్య సంతకం చేసి ఇచ్చేస్తుంది.

మీ ఆయన నీ పేరు మీద ఆస్తులు కొంటున్నాడా? తెగ సంతకాలు చేసేస్తున్నావని అడుగుతుంది పక్కింటి ఆవిడ. విడాకులు కావాలని అడిగితే సంతకాలు చేస్తున్నానని కావ్య అనడంతో ఆవిడ షాక్ అవుతుంది. నాతో విడిపోవడానికి కూడా సిద్ధపడతావు తప్పించి.. నాతో రాను అంటావు అని అడుగుతాడు రాజ్. ఆరు నెలలు సహవాసం చేస్తే గాడిద గుర్రం అయ్యిందని.. మీతో చేరి చేరి మాట మీద నిలబడటం అలవాటైపోయిందని అంటుంది కావ్య. ఆ మాటలతో రగిలిపోయిన రాజ్... విడాకుల పేపర్లు చించేసి నిన్ను తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్లనని అంటాడు. మీరేంటో నాకు బాగా తెలుసు... విడాకుల డ్రామాలు, అమ్మమ్మకి హార్ట్ అటాక్ వచ్చినట్లు చెప్పడం మానేయండి అంటుంది కావ్య. నువ్వు నాతో పాటు వచ్చే వరకు నిరాహారదీక్ష చేస్తానని టెంట్ వేసుకుని కూర్చొంటాడు రాజ్.

రుద్రాణి డ్యాన్స్‌లు వేస్తుండగా రాహుల్ వచ్చి.. ఏం సాధించావని సెలబ్రెట్ చేసుకుంటున్నావని అడుగుతాడు. మన ప్లాన్ మాత్రమే వేశాం.. ఇంకా సక్సెస్ అయ్యామో లేదో తెలియదని అంటాడు రాహుల్. మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతామని నాకు అనిపిస్తోంది.. బిడ్డను వదులుకోవడానికి కావ్య ఒప్పుకోదు కాబట్టి ఆ పేపర్ మీద సంతకం చేసి ఉంటుందని చెబుతుంది రుద్రాణి. ఇంతలో ఇందిర పెద్దగా అరుస్తూ అందరినీ పిలవడంతో రుద్రాణి, రాహుల్‌లు కిందకి వస్తారు. నీ కొడుకు పెద్ద ప్రాబ్లమ్ చేస్తున్నాడని సుభాష్‌పై మండిపడుతుంది. నా మనవరాలు ఇంటికి రాను అని చెప్పిందని అంటుంది. నా ఇంటికి వస్తావా? రావా? అని అత్తారింటి ముందు నిరాహారదీక్షకు దిగాడని చెబుతుంది ఇందిర.

మనం ఇచ్చిన డోస్‌కి రాజ్ భయపడి ఉంటాడని, అందుకే కావ్యని తీసుకురావడానికి అలా దీక్షకు కూర్చొన్నాడని అంటాడు ప్రకాశం. దుగ్గిరాల ఇంటి వారసుడు అలాంటి ఇంటి ముందు నిరాహారదీక్ష చేస్తున్నాడంటే మన పరువు ఏమవుతుందో ఆలోచించారా? అని రుద్రాణి ప్రశ్నిస్తుంది. మీడియా వాళ్లు ఇష్టమొచ్చినట్లు మన గురించి రాస్తారని హెచ్చరిస్తుంది. ఆ దేవుడి దయ వల్ల నా మనవరాలి కోసం దీక్ష చేస్తున్నాడని, ఖచ్చితంగా నా మనవరాలిని తీసుకునే వస్తాడని అంటుంది ఇందిర. కావ్యని ఎలాగైనా ఇంటికి తీసుకొస్తాడని నమ్మకం కుదిరిందని అంటుంది అపర్ణ. ఈ ప్లాన్ కూడా ఫెయిల్ కావడంతో రుద్రాణిపై మండిపడతాడు రాహుల్.

నిరాహారదీక్ష చేస్తున్న భర్తను ఊరించడానికి కావ్య యాపిల్ పండు తింటూ వస్తుంది. చాలా చోట్ల నిరాహారదీక్షలు అనగానే వెనుక నుంచి బిర్యానీలు తినేస్తారని, మీరు కూడా అలాగే చేస్తారా అని ప్రశ్నిస్తుంది. అలాంటి దొంగ నిరాహారదీక్షలు చేయనని, నా దీక్షలో నిజాయితీ ఉందని అంటుంది. మీకు తోడుగా ఎవ్వరూ లేరని కావ్య అంటుండగా.. ఓ వ్యక్తి వచ్చి నేను కూడా మీకు తోడుగా దీక్ష చేస్తానని ఓ తాగుబోతు వస్తాడు. నా పెళ్లాం ముందు నాకు విలువ లేదు, నువ్వెలా నీ పెళ్లాంతో బాధపడుతున్నావో? నేను అలాగే బాధపడుతున్నానని అంటాడు. వీళ్లు మన దారికి రావాలంటే మనం దీక్షలు చేయాల్సిందేనని చెబుతాడు. ఆ మాటలు విన్న కావ్య నవ్వుకుంటూ ఉంటుంది.

రోజంతా కష్టపడి వచ్చిన మగాడు.. ఓ గుక్కెడు మందు తాగి స్వేచ్ఛ కూడా లేదా? ఈ పోరాటంలో చాలామంది మగాళ్లు ఉన్నారని వాళ్లందరినీ తీసుకొస్తానని అంటాడు. దాంతో కంగారుపడ్డ రాజ్.. నీకు దండం పెడతాన్రా ఇక్కడి నుంచి వెళ్లిపో అని చెబుతాడు. నాకు 5 నిమిషాలు టైం ఇవ్వు.. ఎంతమందిని తీసుకొస్తానో చూడు అని అంటాడు. అప్పూ హ్యాపీగా ఉండి, ఫ్రూట్స్ తింటూ ఉండగా కళ్యాణ్ వచ్చి... ఎప్పుడూ ఎడుస్తుండే నువ్వు ఇలా తింటుంటే నాకు టెన్షన్‌గా ఉందని అంటాడు. ఇంత సడెన్‌గా నీలో ఇంత ఛేంజ్ ఏంటీ? అని అప్పూని అడుగుతాడు కళ్యాణ్. ఇన్ని రోజులు అక్కకి బావగారు నిజం చెబుతారో? లేదో? అని నాకు చాలా భయంగా ఉండేదని కానీ ఈరోజు అక్క కోసం నిరాహారదీక్ష చేస్తున్నారని తెలిసి భయమంతా పోయిందని అంటుంది అప్పూ.

నిరాహారదీక్ష చేస్తున్న రాజ్ ముందుకు కావ్య వచ్చి కాఫీ తాగుతుంది. ఇంతలో ఆ తాగుబోతు మళ్లీ వచ్చి భార్యాబాధితుల కోసం ప్రపంచం మొత్తానికి తెలియాలని చెప్పి మీడియా వాళ్లని పిలిచానని చెబుతాడు. మీడియాని చూడగానే రాజ్ షాక్ అవుతాడు. వాళ్లయితేనే పబ్లిసిటీ బాగా వస్తుందని, నిన్ను ఫేమస్ చేసే బాధ్యత నాది అంటాడు. నీ పేరు చెప్పగానే మీడియా వాళ్లంతా ఇలా పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు? నువ్వేమైనా సెలబ్రిటీవా? అని అడుగుతాడు. ఇప్పటికైనా మీ దీక్ష పక్కనపెట్టి లోపలికి వస్తారా? అని కావ్య అడగటంతో రాజ్ లోపలికి పరిగెత్తబోతుండగా మీడియా వాళ్లు చుట్టుముట్టేస్తారు. మీరొక కోటీశ్వరుడు అయ్యుండి ఇలా మధ్యతరగతి ఇంటి ముందు టెంట్ ఎందుకు వేసుకున్నారని మీడియా వాళ్లు అడుగుతారు. మీకు పుట్టబోయే బిడ్డ విషయంలో గొడవలు ఉన్నాయా? లేదా? అని ప్రశ్నిస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X