Brahmamudi October 8th Episode: స్పృహ తప్పిపడిపోయిన అప్పూ ... కావ్యని ఈడ్చిపారేసిన ధాన్యలక్ష్మీ
Photo Courtesy: JioHotstar
ఎవరూ భోజనం వడ్డించకపోవడంతో తనే వడ్డించుకుని తింటాడు రాజ్. నిద్రపోవడానికి బెడ్ రూమ్‌కి వెళ్లగా.. కావ్య దిండు, దుప్పటి ఇచ్చి బయటికి వెళ్లిపోమని చెబుతుంది. మీరు నన్ను అబార్షన్ ఎందుకు చేయించుకోమంటున్నారో నిజం చెప్పే వరకు హాల్‌లోనే సోఫా మీద పడుకోమని చెబుతుంది కావ్య. రాజ్ హాల్‌లో పడుకోవడం చూసిన అపర్ణ.. సుభాష్‌ని కూడా బయటికి గెంటేస్తుంది. ఇంతలో ప్రకాశం కూడా హాల్‌లోకి వచ్చి... నీ ఒక్కడి వల్ల ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేదని బాధపడతాడు.
కావ్య - రాజ్‌లు విడిపోబోతున్నారని తెలిసి అప్పూ ఒంటరిగా బాధపడుతుంది. ఇది చూసిన రుద్రాణి ఈ అవకాశాన్ని వాడుకుని ఇంట్లో గొడవలు పెట్టాలని అనుకుంటుంది. వెంటనే ధాన్యలక్ష్మీ దగ్గరికి వెళ్లి ఆమెను తీసుకొచ్చి అప్పూని చూపిస్తుంది. కడుపుతో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉండాల్సిన నీ కోడలు.. ఆ కావ్య వల్ల ఏడుస్తూ కూర్చొందని చెప్పడంతో ధాన్యలక్ష్మీ రగిలిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక అక్టోబర్ 8వ తేదీ ఎపిసోడ్ 846లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కావ్య, రాజ్‌ల గురించి ఆలోచించి ఆలోచించి కావ్య సంగతేమో కానీ ముందు నీ కోడలికి అబార్షన్ అయ్యేలా ఉందని రుద్రాణి చెప్పడంతో ధాన్యలక్ష్మీ సీరియస్ అవుతుంది. నువ్వు ఇప్పటికైనా కేర్ తీసుకోకపోతే తనలో ఏదైనా ప్రాబ్లమ్ రావొచ్చని హెచ్చరిస్తున్నానని చెప్పి వెళ్లిపోతుంది రుద్రాణి. ఇంతలో కళ్యాణ్ కనిపించడంతో అప్పూని తీసుకుని ఎక్కడికైనా బయటికి వెళ్లిరావొచ్చు కదా అని చెబుతుంది ధాన్యలక్ష్మీ. తర్వాత ఎప్పుడైనా వెళ్తామని అంటాడు కళ్యాణ్. ఇన్నిరోజులు నేను వద్దు అన్నప్పటికీ వెళ్లారు, ఇప్పుడు నేనే వెళ్లమని చెబుతున్నాను కదా.. అప్పుడే అప్పూ కొంచెం రిలాక్స్‌గా ఉంటుందని చెబుతుంది ధాన్యలక్ష్మీ. అప్పూని డల్‌గా ఉండొద్దని చెప్పు.. పుట్టే పిల్లలు యాక్టీవ్‌గా ఉండరని కొడుకుని హెచ్చరిస్తుంది.
తల్లి మాట ప్రకారమే అప్పూ దగ్గరికి వెళ్లి.. కాసేపు బయటికి వెళ్లి వద్దామని కళ్యాణ్ అడగ్గా..నాకు మూడ్ లేదని చెబుతుంది అప్పూ. నువ్వు డల్‌గా ఉండటం అమ్మ చూసిందని అందుకే రిలాక్స్‌గా ఉంటావని బయటికి తీసుకెళ్లమందని, వెళ్లకపోతే హర్ట్ అవుతుందని అంటాడు కళ్యాణ్. భర్త బతిమలాడటంతో అప్పూ ఒప్పుకుంటుంది. కావ్య గురించి ఆలోచిస్తూ రాజ్ గార్డెన్‌లో అటూ ఇటూ తిరుగుతాడు. భర్తను రెచ్చగొట్టి నిజం చెప్పించాలనుకున్న కావ్య.. తన లాయర్ ఫ్రెండ్‌కి ఫోన్ చేసినట్లు నటిస్తుంది. మా ఆయనకి నేను విడాకులు ఇస్తానని చెప్పానని అవి నాకు ఇప్పించాలని అంటుంది. ఇన్ని రోజులు నేను పడిన ఆరాటమంతా బూడిదలో పోసిన పన్నీరైపోయిందని, ఆయన కోసం చేసిన త్యాగానికి అర్ధమే లేకుండా పోయిందని చెబుతుంది. బిడ్డ కావాలా? నేను కావాలా? అని అడిగారని.. ఆయనను వదిలేసుకోవడానికే సిద్దపడ్డానని అంటుంది. ఆ మాటలు విన్న రాజ్, అప్పూ, కళ్యాణ్‌లు షాక్ అవుతారు. ఆయన నా జీవితంలో లేకపోయినా ఆయన జ్ఞాపకమైనా బిడ్డ రూపంలో ఉంటుంది కదా? అని రాజ్‌కి వినిపించేలా అంటుంది.
ఆ మాటలు విన్న అప్పూ.. బయటికి రానని తేల్చిచెబుతుంది. అక్క బాధపడుతుంటే మనం బయటికి వెళ్లి సంతోషంగా ఎలా గడపగలమని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది. బయటికి వెళ్తారనుకున్న అప్పూ తిరిగి ఇంట్లోకి రావడం చూసిన ధాన్యలక్ష్మీ షాక్ అవుతుంది. వెళ్దామనే అనుకున్నానని, కానీ వెళ్లలేకపోయానని క్షమించమని అంటుంది అప్పూ. ఇది చూసిన రుద్రాణి.. అప్పూ బయటికి వెళ్లకపోవడానికి కారణం కావ్యే అని చెబుతుంది. ప్రతిక్షణం ఇంట్లో గొడవలు జరుగుతుంటే ఎవరైనా ఎందుకు హ్యాపీగా ఉంటారని ప్రశ్నిస్తుంది. అప్పూ- కళ్యాణ్‌లు బయటికి వెళ్తుండగా కావ్య ఫోన్‌లో విడాకుల గురించి మాట్లాడుతూ కనిపించిందని, అక్క కష్టం చూడలేక బాధపడుతూ ఇంట్లోకి వచ్చేసిందని చెబుతుంది రుద్రాణి. కావ్య కారణంగా నీ కోడలు అప్పూ నలిగిపోతోందని, ఇలా ప్రతిక్షణం కావ్య గురించి అప్పూ ఆలోచించి ఆలోచించి ఏదో ఒక పెద్ద ప్రాబ్లమ్ రాకముందే కళ్లు తెరవమని వార్నింగ్ ఇస్తుంది.
రాజ్ ఫోన్‌లో మాట్లాడుతుండగా కావ్య రావడంతో ఏంటీ దెయ్యంలా చూస్తున్నావని సెటైర్లు వేస్తాడు రాజ్. ఇన్నాళ్లు నేనే మీ అదృష్టం, అవకాయ అని చెప్పిన మీకు నేను ఇప్పుడు దెయ్యంలా కనిపిస్తున్నానా? అని అడుగుతుంది కావ్య. రేపు మనిద్దరం నాసిక్ వెళ్తున్నామని చెబుతుంది. నా బిడ్డను నేను కాపాడుకోవాలంటే భర్త అనే అధికారం అడ్డుగా ఉండకూడదు కదా అందుకే ఆయనకి విడాకులు ఇచ్చేస్తానని చెబుతుంది కావ్య. నాకు తెలిసిన లాయర్ ఒకరు ఉంటే రేపు ఆవిడని కలిసి డివోర్స్ కోసం అప్లయ్ చేస్తే విడాకులు తొందరగా వచ్చేస్తాయని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది.
వాడు ఆవేశంలో ఏదో చెబితే.. నువ్వు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటావా? అని మండిపడుతుంది అపర్ణ. భర్తగా నా మనసుకి నచ్చింది ఆయన చేయపోయినా, నేను అయినా ఆయన మనసుకి నచ్చింది చేయాలి కదా అని అంటుంది కావ్య. ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావ్? నీ కంటికి నేను పిచ్చోడిలా కనిపిస్తున్నానా? విడాకులు ఇచ్చేస్తానని బెదిరించగానే భయపడిపోయి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు అబార్షన్ ఎందుకు చేయించాలని అనుకుంటున్నానో చెప్పేస్తానని అనుకుంటున్నావా? అని ప్రశ్నిస్తాడు రాజ్. నేను ఏ తప్పూ చేయడం లేదని నా మనస్సాక్షికి, ఆ పరమాత్మకి తెలుసని అంటాడు. కానీ ఆ కారణం ఏంటీ? అనేది నాకు చెప్పి తీరాలని అడుగుతుంది కావ్య. మీరు నిజం చెబితే ఓకే లేదంటే నేను మీతో ఎక్కువ రోజులు కలిసుండనని, నాకు విడాకులు ఇచ్చేయండి.. నా దారి నేను చూసుకుంటానని తేల్చిచెబుతుంది కావ్య.
డివోర్స్ పేపర్స్ తీసుకురా? ఎక్కడెక్కడ సంతకాలు కావాలో చెబితే పెట్టేస్తానని అంటాడు రాజ్. దానికొక ప్రొసీజర్ ఉంటుందని, దానికి టైం పడుతుందని కావ్య అంటుంది. నీకు నా నుంచి విడిపోవాలని అంత సరదాగా ఉంటే అలాగే కానివ్వు అంటాడు రాజ్. దానిపై ఇందిర మండిపడుతుండగా అప్పూ కళ్లు తిరిగి కిందపడిపోతుంది. అప్పూని కావ్య పట్టుకోబోతుండగా నువ్వు నా కోడలిని ముట్టుకోవద్దని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. అసలు నా కోడలికి ఇలాంటి పరిస్ధితి రావడానికి కారణం నువ్వు, తనకి మనశ్శాంతి దూరమై, భోజనం కూడా చేయని స్థితికి నీ గొడవలే కారణమని అంటుంది. నా కోడలి దగ్గరి నుంచి వెళ్లిపోమ్మని ఈడ్చిపారేస్తుంది ధాన్యలక్ష్మీ. అప్పూని పరీక్షించిన డాక్టర్.. మీ భార్యకి స్ట్రెస్ ఎక్కువైందని చెబుతుంది.
స్ట్రస్ రావడానికి ఫిజికల్‌గానే కష్టపడాల్సిన అవసరం లేదని, మెంటల్‌గా కష్టపడినా స్ట్రెస్ పెరుగుతుందని అంటుంది డాక్టర్. అప్పూ గారు ఏదో విషయం గురించి చాలా బాధపడుతున్నట్లుగా అనిపిస్తోందని, తన ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకోండి.. ఆ ప్రాబ్లమ్ త్వరగా సాల్వ్ అయ్యేలా చూడమని చెబుతుంది డాక్టర్. లేదంటే ఈ స్ట్రెస్ ఎక్కువై హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించడంతో ధాన్యలక్ష్మీ, కళ్యాణ్‌లు షాక్ అవుతారు. అప్పూ గారు చాలా నీరసంగా ఉన్నారని.. టైంకి ఫుడ్ తీసుకోవడం లేదని హెచ్చరిస్తుంది డాక్టర్. ప్రెగ్నెన్సీ టైంలో తల్లి ఎంత హ్యాపీగా ఉంటే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడుతుందని లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తుంది డాక్టర్.
అర్ధరాత్రి కళ్యాణ్‌ని పిలిచిన రాజ్ క్షమాపణలు చెబుతాడు. ఈరోజు అప్పూకి ఆ పరిస్ధితి రావడానికి కారణం నేనే, నా వల్ల అప్పూ కళ్లుతిరిగి పడిపోయిందని అంటాడు రాజ్. తను టైంకి ఫుడ్ తీసుకోక కళ్లు తిరిగి కిందపడిపోయిందని నువ్వేం చేస్తావని అంటాడు కళ్యాణ్. భర్తగా వదిన గురించి నువ్వెంత బాధపడుతున్నావో, ఒక చెల్లిగా వాళ్ల అక్కకి ఏం జరుగుతుందోనని తను కూడా అంతే బాధపడుతోందని చెబుతాడు కళ్యాణ్. కళావతికి ఏం జరగకూడదన్న స్వార్ధం వల్ల ఇంట్లో అందరూ ఇంత బాధపడుతున్నారని, అప్పూ కిందపడితే కానీ అర్ధం కాలేదని అంటాడు రాజ్. ఇంటి పెద్ద కొడుకుగా అందరి ఆనందానికి కారణం అవ్వాల్సిన నేనే.. ఇంటిల్లిపాది కన్నీటికీ కారణం అవుతుంటే సిగ్గుగా ఉందని చెబుతాడు. ఇప్పటికైనా వదినకు ఉన్న ప్రాబ్లమ్ గురించి ఇంట్లో అందరికీ చెప్పమని అంటాడు కళ్యాణ్. ఇంతలో డాక్టర్ ఫోన్ చేసి అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దని వార్నింగ్ ఇస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










