Brahmamudi September 13th Episode: కావ్యకి తృటిలో తప్పిన పెను ప్రమాదం.. భార్యని కాపాడుకున్న రాజ్

Photo Courtesy: JioHotstar

అత్తగారు నెక్లెస్ వేసుకోమ్మని చెప్పడంతో కావ్య తన గదిలోకి వెళ్లి చూడగా అక్కడ నెక్లెస్ కనిపించదు. ఈ విషయాన్ని చెప్పగా.. నెక్లెస్ మనింట్లో ఎవరు తీస్తారని రుద్రాణి నటిస్తుంది. ఇంట్లో వాళ్లు ఎవ్వరూ తీయనప్పుడు బయటివాళ్లే తీసుంటారని పని మనిషి రత్తాల్ని నిలదీస్తుంది రుద్రాణి. ఆమె కోపంగా సమాధానం చెప్పడంతో సైలెంట్ అయిపోతుంది. అయితే ఈ ఇంటికొచ్చిన రాధగారే నెక్లెస్ తీసుంటారని అనుమానం వ్యక్తం చేస్తుంది. దాంతో రాజ్, కావ్య, ఇందిరలు రుద్రాణిపై మండిపడతారు.

నెక్లెస్ పోతే పోయింది.. అక్కని అవమానిస్తే నేను చూడలేనని చెబుతాడు రాజ్. అయినా వినిపించుకోకుండా రాధ బ్యాగ్ చెక్ చేస్తుంది. అందులో నెక్లెస్ లేకపోవడంతో రుద్రాణి నీళ్లు నములుతుంది. ఇంతలో అక్కడికి స్వరాజ్ వచ్చి.. నెక్లెస్ ఎక్కడుందో నేను చూపిస్తానని అపర్ణని రుద్రాణి గదిలోకి తీసుకెళ్తాడు. అక్కడి కబోర్డ్‌లో నెక్లెస్ కనిపించడంతో అపర్ణ షాకై.. రుద్రాణికి క్లాస్ పీకుతుంది. తన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ కావడంతో అసలు నెక్లెస్ ఎలా తన గదిలోకి వచ్చిందో తెలియక రుద్రాణి షాక్ అవుతుంది. నీ గదిలో నెక్లెస్ పెట్టింది నేనే అని .. ఎదుటివాళ్లకి అన్యాయం చేయాలని చూస్తే మనమే నాశనం అయిపోతామని పిల్లాడు వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 13వ తేదీ ఎపిసోడ్ 825లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial September 13th 2025 Episode 825 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

స్వరాజ్‌ను అపర్ణ, సుభాష్‌లు గారాభంగా చూసుకుంటూ ఉండటంతో రేవతి కంటతడి పెడుతూ బయటికి వెళ్లిపోతుంది. ఒకప్పుడు మనకు ఎవరూ లేరా? అని నా కొడుకు అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోయానని కానీ ఈరోజు వాడి అమ్మమ్మ అలా ఒడిలో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపిస్తుంటే తట్టుకోలేకపోయానని.. నేను చేసిన తప్పుకి ఇన్నిరోజులుగా నా బిడ్డకు ఎంత పెద్ద శిక్ష వేశానో? వాడికి ఎంత ప్రేమను దూరం చేశానో ఇప్పుడు అర్ధమవుతోందని బాధపడుతుంది రేవతి. ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడెందుకు బాధపడుతున్నావని అడుగుతాడు రాజ్.

నా కన్నవాళ్లు కనిపించేంత దూరంలో ఉన్నారని తెలిసినా, ఏం చేయలేక వాళ్లకి దగ్గర కాలేక ఎంతో నరకం అనుభవించానని బాధపడుతుంది రేవతి. ఈరోజు మీరు కోరుకున్నది జరిగింది కదా? ఇంకా ఎందుకు బాధపడటం అని అడుగుతుంది కావ్య. వాళ్లు చూపించే ప్రేమను చూసి తట్టుకోలేకపోయానని.. అక్కడే ఉంటే దొరికిపోతానని భయం వేసి వచ్చేశానని అంటుంది రేవతి. అక్కడే ఉంటే నువ్వు ఒక్కదానివే దొరికేదానివని, ఇక్కడ మన ముగ్గురం దొరికిపోతామని నవ్విస్తాడు రాజ్. భోజనాలు వడ్డించలేక రాహుల్ కిందా మీద పడతాడు.

ఏమైంది రాధ? ఎందుకు అలా వెళ్లిపోయావని అపర్ణ అడుగుతుంది. రాధ గారికి వాళ్ల అమ్మ గారు గుర్తొచ్చారని చెబుతుంది కావ్య. అమ్మతో కలిసి ఉండటం లేదా? ఎందుకు దూరంగా ఉన్నారు? ఏమైనా గొడవ అయ్యిందా? అని రుద్రాణి అడుగుతుంది. వాళ్ల అమ్మనాన్నలు ఈ ఊళ్లో ఉండరని ఎక్కడో వైజాగ్‌లో ఉంటారని.. ఈరోజు స్వరాజ్‌ని అమ్మ ఒడిలో కూర్చోబెట్టుకుని తినిపిస్తుంటే అక్క చూసి ఎమోషనల్ అయ్యిందని చెబుతాడు రాజ్. ఏ బిడ్డకైనా వాళ్ల అమ్మమ్మ ప్రేమ దక్కితే కంటతడి పెడుతుందని అంటుంది కావ్య. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఇంటికి రావొచ్చని, వీడు ఈ ఇంటి మనిషేనని చెబుతుంది అపర్ణ.

కళ్యాణ్‌కి అప్పూ తినిపిస్తుంటే.. రాజ్ నాకు కూడా అలాగే తినిపించాలని కావ్యతో గొడవ పడతాడు. ఆ స్వీట్ రాజ్‌కి తినిపించు, మేమంతా కళ్లు మూసుకుంటామని చెబుతాడు సీతారామయ్య. దాంతో కావ్య సిగ్గుపడుతూ రాజ్‌కి తినిపిస్తుంది. రేవతి ముసుగుని ఎలాగైనా తీయాలని అనుకున్న రుద్రాణి వాటర్ తీసుకొచ్చి ఆమెపై పోస్తుంది. అంతా తడిసిపోయిందని, ముసుగు తీసేయమని రుద్రాణి అంటుంది. ఇక్కడున్న వాళ్లంతా మీ వాళ్లేనని ముసుగు తీసేసి తినమని లాగడానికి ట్రై చేస్తుంది. దాంతో రాజ్, కావ్య, ఇందిరలు షాక్ అవుతారు. ఎవరి ఆచారాలు వాళ్లవి, ఎందుకు ఆమెను బలవంతం చేస్తున్నావు? వదిలేయమని అపర్ణ మండిపడుతుంది. రాధ తప్పించుకోవడంతో తన ప్లాన్ ఫెయిలైందని రగిలిపోతుంది రుద్రాణి.

భోజనాల తర్వాత అప్పూ బయటికి వచ్చి బాధపడుతుండటంతో ఏమైందని అడుగుతాడు కళ్యాణ్. అక్కకి ఈ విషయం ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదని అంటుంది. అన్నయ్య, వదినల సంతోషం చూస్తుంటే నిజం చెప్పలేకపోతున్నానని కళ్యాణ్ కూడా బాధపడతాడు. ఇంతలో కావ్య మజ్జిగ తీసుకొచ్చి మీ అన్నయ్య ఎక్కడ? అని అడుగుతుంది. రాజ్ ఫోన్ మాట్లాడుతూ తనను పట్టించుకోకపోవడంతో కావ్య గట్టిగా అరిచి మజ్జిగ తాగమని ఇస్తుంది. మొత్తంగా తాగేస్తారా? కొంచెం ఉంచొచ్చు కదా అని కావ్య అడగ్గా.. ఇదేమైనా శోభనం గదిలో పాలా? సగం తాగి సగం ఉంచడానికి అంటూ మండిపడతాడు రాజ్.

దాంతో కావ్య అలిగి వెళ్లిపోతూ మెట్లపై పడిపోతుండగా రాజ్ వచ్చి పట్టుకుంటాడు. నాకేం కాలేదని మీరేం కంగారు పడొద్దని అంటుంది కావ్య. కంగారు పడకుండా ఎలా ఉంటాం, నువ్వేమైనా నార్మల్ కళావతివా? నీ కడుపులో నా బిడ్డ ఉందని ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని మండిపడతాడు రాజ్. వీడికి ఏం కానివ్వనని, బిడ్డకి నా కడుపులో ప్రాణం పోస్తున్నాను.. వీడికి ప్రమాదం వస్తుందని తెలిస్తే ప్రాణం అడ్డేసైనా కాపాడుకుంటానని చెబుతుంది. ఆ మాటలతో కళ్యాణ్, అప్పూలు మరింత బాధపడతారు. కడుపులోని బిడ్డను అంతలా ప్రేమిస్తున్న అక్కకి ఈ విషయం ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదని అంటుంది అప్పూ.

భోజనాలు ముగిశాక ఒక పాత్రలో చిట్టీలు రాసి ఎవరికి ఏమోస్తే వాళ్లు అది చేయాలని చెబుతుంది రుద్రాణి. ఎప్పుడు ఎవరిని విడదిద్దామా? ఎవరి కొంప కూలుద్దామా? అని ప్లాన్లు చేసే మా అత్తగారిలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా? అని స్వప్న సెటైర్లు వేస్తుంది. ముందు సీతారామయ్యకి డైలాగ్ చెప్పమని రావడంతో పెద్దాయన యాక్టింగ్‌తో పాటు డైలాగ్స్ ఇరగదీస్తాడు. దాంతో కుటుంబ సభ్యులంతా చప్పట్లు కొడుతూ అభినందిస్తారు. తర్వాత స్వప్నకి భర్త అలిగితే భార్య బుజ్జగించాలని వస్తుంది, దానిని భార్య అలిగితే భర్త బుజ్జగించాలని అన్నట్లుగా మార్చేసింది స్వప్న. నేను అది రాయలేదని రుద్రాణి చెప్పగా.. అలాగే ఉందని ఇందిర కూడా అంటుంది. తర్వాత స్వప్న - రాహుల్‌లు డ్యాన్స్ చేస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X