For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వర్షపై బుల్లెట్ భాస్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు: దీన్ని ఎవడూ నమ్మట్లేదు అంటూ దారుణంగా!

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై హవాను చూపిస్తూ నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. దాదాపు ఎనిమిదేళ్లుగా ప్రేక్షకులకు మజాను పంచుతూ దూసుకుపోతోన్న ఈ కార్యక్రమం.. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో సందడి చేస్తోంది. ఇక, ఈ షో వల్ల ఎంతో మంది ఆర్టిస్టులు ఫుల్ పాపులర్ అయ్యారు. అందులో చాలా మంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు.

  అలాంటి వారిలో క్యూట్ బ్యూటీ వర్ష ఒకరు. మోడలింగ్ నుంచి సీరియళ్లలోకి ఎంటరైన ఈ భామ.. జబర్ధస్త్ షోలో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయింది. అప్పటి నుంచి వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా వర్షపై బుల్లెట్ భాస్కర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగిందో మీరే చూడండి!

  అలా మొదలు.. ఇలా పాపులర్

  అలా మొదలు.. ఇలా పాపులర్


  సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న లక్ష్యంతో వర్ష మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అందులో తన గ్లామర్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ చిన్నది.. ఆరంభంలో బుల్లితెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే 'అభిషేకం', 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లలో నటించింది. తద్వారా చాలా కాలం క్రితమే ఈ చిన్నది ఫుల్ పాపులర్ అయింది.

  పెళ్లైన ఆరు నెలలకే తల్లైన ప్రభాస్ హీరోయిన్: అప్పుడే అందాలు చూపిస్తూ సెల్ఫీ

  వర్ష కెరీర్‌ను మార్చిన జబర్ధస్త్

  వర్ష కెరీర్‌ను మార్చిన జబర్ధస్త్


  బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా వరుస సీరియళ్లతో సందడి చేస్తోన్న వర్ష.. జబర్ధస్త్ షోలోకి గెస్టుగా వచ్చి నటించింది. మొదటి దానిలోనే ఈమె అందరి దృష్టినీ ఆకర్షించి.. గుర్తింపును తెచ్చుకుంది. దీంతో ఆమెకు వరుసగా స్కిట్లు వచ్చాయి. దీంతో అందులో వర్ష పర్మినెంట్ ఆర్టిస్టు అయిపోయింది. అప్పటి నుంచి అందులో కంటిన్యూ అవుతోంది. దీంతో ఆమె కెరీర్‌ కూడా మారిపోయింది.

  అన్నింట్లోనూ రచ్చ చేస్తోంది

  అన్నింట్లోనూ రచ్చ చేస్తోంది


  జబర్ధస్త్ షో ద్వారా మరింత ఫేమస్ అయిన వర్ష.. తన అందం, అభినయంతో చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకుంది. కామెడీ షోకు కావాల్సిన టైమింగ్ కూడా పుష్కలంగా ఉండడంతో ఈ బ్యూటీ వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. దీంతో జబర్ధస్త్‌, స్పెషల్ ఈవెంట్లతో పాటు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' షోలోనూ రచ్చ చేస్తోంది.

  తల్లైన తర్వాత మరో యాక్టర్‌తో హీరోయిన్ ఎఫైర్: బెడ్‌పై రొమాన్స్ చేసే పిక్ వైరల్

  అతడితో ట్రాకుతో భారీ క్రేజ్

  అతడితో ట్రాకుతో భారీ క్రేజ్


  జబర్ధస్త్ వర్ష ఫేమస్ అవడానికి ఆమె ఆ షోలో సందడి చేయడమే కాదు.. యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో ప్రేమాయణం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చేసే స్కిట్ల వల్లే భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఇక, తరచూ అతడితో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతూ హైలైట్ అయింది. దీంతో వీళ్లిద్దరూ బుల్లితెరపై జంటగా సందడి చేస్తున్నారు.

  బుల్లెట్ భాస్కర్‌తో సందడిగా

  బుల్లెట్ భాస్కర్‌తో సందడిగా

  సుదీర్ఘమైన ప్రయాణంలో జబర్ధస్త్‌లోని ఎంతో మంది టీమ్ లీడర్లతో కలిసి పని చేసిన వర్ష.. ప్రస్తుతం బుల్లెట్ భాస్కర్ టీమ్‌లో పర్మినెంట్ సభ్యురాలిగా మారిపోయింది. ఇందులో ఆమెతో పాటు ఫైమా, ఇమాన్యూయేల్ కూడా తెగ సందడి చేస్తున్నారు. దీంతో వీళ్ల స్కిట్లే మరింత ఫన్నీగా మారుతున్నాయి. ఇక, ఈ టీమ్‌లో వర్షపై ఎన్నో పంచులు వేస్తూ పరువు తీస్తున్నా ఆమె ఫీల్ అవట్లేదు.

  భర్తపై పడుకుని నిహారిక ముద్దులు: క్లిప్ లీక్ చేసిన చిరంజీవి కూతురు.. ఏం రాసిందో చూస్తే!

  వర్ష పరువు తీసేసిన భాస్కర్


  ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ షోలో భాగంగా వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమోను తాజాగా వదిలారు. ఇందులో బుల్లెట్ భాస్కర్, వర్ష జంటగా ఓ సాంగ్ చేస్తూ ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో వర్ష 'నేను యాంకర్‌ను, యాంకర్‌ను అంటే ఎవరూ నమ్మట్లేదేంటి' అని అంటుంది. దీనికి భాస్కర్ 'దీన్ని అమ్మాయి అంటేనే ఎవడూ నమ్మట్లేదు' అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

  శాంతి స్వరూప్‌లా ఉన్నావు

  శాంతి స్వరూప్‌లా ఉన్నావు

  ఆ తర్వాత కూడా తగ్గని బుల్లెట్ భాస్కర్.. వర్షపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పంచులు వేశాడు. ఒక సందర్భంలో ఆమె 'నేను ఇలా నడుచుకుంటూ వెళ్తే.. లెఫ్ట్ నుంచి చూడగానే ఇంద్రజ గారు అంటున్నారు. రైట్ నుంచి చూడగానే కుస్భూ గారు అంటున్నారు' అంటుంది. అప్పుడు భాస్కర్ 'స్ట్రయిట్‌గా చూడమను శాంతి స్వరూప్ అంటారు' అన్నాడు. దీంతో ఆమె షాకైపోయింది.

  English summary
  Telugu Actress, Model Varsha Partcipated in Extra Jabardasth Show. Bullet Bhaskar Did Sensational Comments on her in an Upcoming Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X