ఏప్రియల్ 1 నుంచి టీవీలు బంద్!

సెట్-టాప్-బాక్సులు లేనిదే ఈ ప్రాంతాల్లో టీవీ కార్యక్రమాలను వీక్షించడం కుదరదని ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫెడరేషన్ (ఐబీఎఫ్) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. దేశ వ్యాప్తంగా సగటున 67 శాతం, హైదరాబాద్, అమృత్‌సర్, చండీగఢ్ అలహాబాదుల్లో నూరుశాతం డిజిటలీకరణ పూర్తయినట్లు సమాచార ప్రసారశాఖ మంత్రి మనీష్ తివారి మరో ప్రకటనలో తెలిపారు.
ఇన్నాళ్లూ టీవీ ప్రసారాలు రూపసృష్టి సంకేతాల (అనలాగ్ సిగ్నళ్ల) రూపంలో చేరేవి. ఇప్పుడు వాటి స్థానంలో సంఖ్యారూప సంకేతాలు (డిజిటల్ సిగ్నళ్లు) రానున్నాయి. సెట్-టాప్-బాక్సులు లేనిదే ఈ కొత్త సంకేతాలను టీవీలు అర్థం చేసుకోలేవు. ఈ విషయమై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రచారం చేపట్టింది. మొత్తం 1.60 కోట్ల సెట్-టాప్-బాక్సులను ఏర్పాటుచేయాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటివరకు 1.08 కోట్ల బాక్సులు ఏర్పాటైనట్లు మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











