»   » ‘బాహుబలి’ ని గంగ భయపెడుతుందా?

‘బాహుబలి’ ని గంగ భయపెడుతుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన 'బాహుబలి' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో భారీ వసూళ్లు సాధించింది.ఈ చిత్రం ఈ శనివారం మా టీవి లో ప్రీమియర్ షోగా వేస్తున్నారు. దాంతో మిగతా ఛానెల్స్ అన్నీ ఆ రోజు తమ టీఆర్పీలకు ఓ రేంజిలో దెబ్బ తగులుతుందనే భావిస్తున్నాయి. ఈ మేరకు మాటీవి తమ చిత్రం ప్రోమోతో టీజర్ వదిలింది.

Biggest Block Buster #Baahubali World Television Premiere ..This Saturday (24th) at 6 PM on Maa TV .. #BaahubaliOnMAATV


Posted by Maa TV on 21 October 2015

అయితే ఈ బాహుబలిని తట్టుకోవటానికా అన్నట్లు జెమినీ టీవీ వారు అదే రోజు అదే సమయానికి రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన గంగ..ముని 3 చిత్రం ప్రీమియర్ షో వేస్తున్నారు. ఈ చిత్రం చూడాలని చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపధ్యంలో టీఆర్పీల వార్ ఈ రెండిటి మధ్యా జరుగుతుందని భావిస్తున్నారు.


'బాహుబలి' విషయానికి వస్తే..


భారతీయ సినీ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది 'బాహుబలి'. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అనువాదమై దేశవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందింది. మన దేశంలో అత్యధిక స్థూల వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది.


Can Lawrence's film ‘Ganga’ scare Baahubali?

చిత్రం విడుదలై మొన్నటితోతో 100 రోజులు పూర్తయ్యింది. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. చెన్నైలోని పలు సినిమా థియేటర్లలో ఆన్‌లైన్‌ బుకింగ్స్‌లో ఇప్పటికే హౌస్‌ఫుల్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి.


బాహుబలి'ని స్పెయిన్‌లో జరుగుతున్న ఓ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. స్పెయిన్‌లో జరుగుతున్న సిట్‌గీస్‌ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రత్యేకంగా 'బాహుబలి ది బిగినింగ్‌' చిత్రాన్ని ప్రదర్శించారు.

English summary
While in Telugu Rajamouli's Baahubali will be aired on Maa TV on Oct, 24th, in Hindi it will be aired on Oct, 25th. Now Raghava Lawrence's film ‘Ganga’ starring Tapsee and Nitya Menon is getting screened on Oct, 24th.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu