»   » ఎన్టీఆర్ ‘బిగ్‌బాస్‌‌’కు స్టార్ గ్లామర్.. హీరోయిన్ల పేరు తెలిస్తే దిమ్మతిరుగాల్సిందే..

ఎన్టీఆర్ ‘బిగ్‌బాస్‌‌’కు స్టార్ గ్లామర్.. హీరోయిన్ల పేరు తెలిస్తే దిమ్మతిరుగాల్సిందే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి బుల్లితెరపై ఎంట్రీ ఇస్తూ చేస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హిందీ వెర్షన్‌లో ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. ఈ కార్యక్రమానికి ప్రస్తుతం దక్షిణాదికి విస్తరిస్తున్నారు. తమిళంలో హోస్ట్‌గా విలక్షణ నటుడు కమల్ హాసన్ చేస్తుండగా, తెలుగులో ఆ అవకాశం జూనియర్ ఎన్టీఆర్‌కు వచ్చింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి పేర్లను తాజాగా స్టార్ మా టెలివిజన్ చానెల్ వెల్లడించింది.

బిగ్‌బాస్ షోలో పాల్గొనే వారి పేర్లు ఇవే..

బిగ్‌బాస్ షోలో పాల్గొనే వారి పేర్లు ఇవే..

ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి జాబితాలో ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి, సదా, స్నేహా, రంభ, మంచు లక్ష్మి తదితరుల పేర్లు ఉన్నట్టు వెల్లడించారు. ఈ తారల పేర్లు బయటకు రావడంతో బిగ్‌బాస్ తెలుగు వెర్షన్‌కు మరింత క్రేజ్ పెరిగింది. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యవహరిస్తున్నారనే వార్త బయటకు రాగానే తెలుగు టెలివిజన్ రంగానికి కొత్త క్రేజ్ వచ్చినట్టయిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

బిగ్‌బాస్‌ డెన్‌లోకి పోసాని

బిగ్‌బాస్‌ డెన్‌లోకి పోసాని

టాలీవుడ్‌లో పోసాని కృష్ణమురళిది ప్రత్యేకమైన శైలి. మాటల రచయితగా పరిశ్రమలోకి వచ్చిన పోసాని ఆ తర్వాత నటుడిగా, దర్శకుడి, నిర్మాతగా మారారు. ప్రస్తుతం టాలీవుడ్ కమెడియన్, క్యారెక్టర్ ఆరిస్ట్‌లో పాపులర్ అనే ముద్ర ఉంది. టెలివిజన్ రంగంలో జీ చానెల్లో బతుకు జట్కా బండి అనే కార్యక్రమంలో హోస్ట్‌గా ఉన్నారు. ఎన్టీఆర్ హోస్ట్‌గా ఉన్నారనే అంశంతో ఆయన బిగ్‌బాస్‌కు పోసాని ఒకే చెప్పినట్టు సమాచారం.

ఢీ కొట్టనున్న సదా

ఢీ కొట్టనున్న సదా

బిగ్‌బాస్‌లో మరో పార్టిసిపెంట్ సినీ నటి సదా. దక్షిణాదిలో సక్సెస్ ఫుల్ చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం ఈటీవీలో ఢీ అనే డ్యాన్స్ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆమె కుదుర్చుకొన్న నాలుగు సంవత్సరాల కాంట్రాక్టు ముగిసింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒకే చెప్పినట్టు సమాచారం.

బిగ్‌బాస్‌తో స్నేహ పూర్వకంగా

బిగ్‌బాస్‌తో స్నేహ పూర్వకంగా

తెలుగు చిత్రాల్లో హోమ్లీ హీరోయిన్‌గా రాణించిన స్నేహ కూడా బిగ్‌బాస్‌లో పాల్గొనున్నారు. ఆమె నటించిన చిత్రాలు దక్షిణాదిలో చాలా సక్సెస్‌గా నిలిచాయి. పలు భాషల్లో అగ్రహీరోల సరసన ఆమె నటించిన ఘనత ఉంది. స్నేహ పాల్గొనడం ద్వారా బిగ్‌బాస్‌కు మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.

రంభా హో.. హో.. రంభా హో..

రంభా హో.. హో.. రంభా హో..

బిగ్‌బాస్‌లో పాల్గొనే అగ్రతారల్లో రంభ ఒకరు కావడం మరో విశేషం. యమదొంగ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రత్యేకమైన పాటలో కూడా నర్తించింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ లాంటి అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. అద్భుతమైన టాలెంట్ ఉన్న సీనియర్ హీరోయిన్లలో రంభ ఒకరు. రంభ గ్లామర్ బిగ్‌బాస్‌కు అదనపు ఆకర్షణగా మారే అవకాశం ఉంది.

క్రేజీ మంచులక్ష్మీ..

క్రేజీ మంచులక్ష్మీ..

టాలీవుడ్‌లో స్టార్ సెలబ్రిటీ స్టేటస్ ఉన్న యాక్టర్లలో మంచు లక్ష్మి ఒకరు. సినీ నటిగా, యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. బిగ్‌బాస్‌లో మంచు లక్ష్మి పాల్గొనడం ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. మంచు లక్ష్మీతోపాటు గ్లామర్ ఉన్న స్టార్లు పాల్గొనడం ద్వారా బిగ్ బాస్ ఓ రేంజ్‌లో ఉండే అవకాశం కనిపిస్తున్నది.

12 మంది సెలబ్రిటీలు

12 మంది సెలబ్రిటీలు

ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షో జూలై 15వ తేదీన ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమంలో 12 మంది సెలబ్రిటీలు పాల్గొంటారు. దాదాపు 70 రోజులు పెద్ద భవనంలో కలిసి ఉంటారు. ఈ భవనం చుట్టూ 70 కెమెరాలు అమర్చారు.

English summary
It is for the first time Jr.NTR is going to host a reality TV show Big Boss which marks the as small debut of the actor. Hindi version Big Boss has received a great acclamation from the audience which was hosted by Bollywood Salman Khan. Sneha and Rambha: Yesteryear actresses Sneha and Rambha are working as Judges to some of the TV shows. They would like to him to call them onboard to participate as contestants in the show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu